Centre on Covid-19: కేంద్రం కీలక నిర్ణయం.. త్వరలో కరోనా కాలర్ ట్యూన్ బంద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గత రెండేళ్లుగా దేశంలో టెలికాం ఆపరేటర్లు ప్రవేశపెట్టిన కాలర్ ట్యూన్‌లు ఎట్టకేలకు నిలిచిపోనున్నాయి. ఎప్పుడూ కాల్ చేసినా ‘కరోనాపై పోరాటంలో మనం పోరాడాల్సింది రోగితో కాదు వ్యాధితో’ అంటూ వినిపించే కాలర్ ట్యూన్‌లతో ప్రజలు విసిగెత్తిపోయారు. ఈ కాలర్‌ట్యూన్ సెల్‌ఫోన్ వినియోగదారులకు పలు సందర్భాల్లో చికాకు కూడా తెప్పించేది. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో టెలికాం ఆపరేటర్లు ఈ కాలర్ ట్యూన్‌ను త్వరలో తొలగించనున్నారు.
ఈ కాలర్ ట్యూన్ కారణంగా అత్యవసర సమయాల్లో ఫోన్‌కాల్ మాట్లాడటం ఆలస్యమవుతోందని వినియోగదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 ప్రీ-కాల్ సందేశాలను తొలగించేందుకు పరిశీలన చూస్తోంది. ఈ సందేశాలను నిలిపివేయాలని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖకు టెలీకమ్యూనికేషన్ల విభాగం లేఖ రాసింది. చాలా మంది వినియోగారులు అత్యవసరంగా కాల్ చేయాల్సిన సమయంలో కరోనా కాలర్ ట్యూన్‌ను డియాక్టివేట్ చేయడానికి టెలికాం ఆపరేటర్లను సంప్రదించేవారని.. ఆర్‌టీఐ ద్వారా అనేక ఫిర్యాదులను జోడించి ఈ కాలర్ ట్యూన్ తొలగించాలని అభ్యర్థించినట్లు లేఖలో పేర్కొంది. కాగా త్వరలోనే కరోనా కాలర్ ట్యూన్ తొలగించే విషయంపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర ఆరోగ్యశాఖ చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read
తాజావార్తలు
-
Pakistan: అప్పులు చేసే పాకిస్తాన్, అప్పులిచ్చే IMFలో కీలక బాధ్యతలు..
-
AP Government: భవన నిర్మాణదారులకు గుడ్‌న్యూస్.. మున్సిపల్ సేవల్లో కీలక మార్పులు..
-
Nagarjuna: ‘పాన్ ఇండియాతో తలనొప్పి.. నా టార్గెట్ తెలుగే.. నన్ను నిలబెట్టింది ఇక్కడి ప్రేక్షకులే’
-
AP High Court: పుంగనూరు, రాయచోటి ఘటనలపై హైకోర్టులో విచారణ.. తీర్పు రిజర్వ్
-
IND W vs ZIM W: స్మృతి మంధాన కెప్టెన్సీలో కొత్త శకం.. జింబాబ్వేపై టాస్ గెలిచిన భారత్..
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!