ప్రస్తుతం న్యూజిలాండ్ వేదికగా మహిళల ప్రపంచకప్ జరుగుతోంది. అయితే పురుషుల ప్రపంచకప్ ప్రైజ్ మనీతో పోలిస్తే మహిళల ప్రపంచకప్ ప్రైజ్ మనీ తక్కువ అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పురుషుల, మహిళ ప్రపంచకప్ టోర్నీల ప్రైజ్ మనీల మధ్య సమానత్వం తీసుకొచ్చేందుకు ఐసీసీ అడుగులు వేస్తోంది. రాబోయే 8 ఏళ్లలో మహిళల క్రికెట్ ఈవెంట్లకు సంబంధించి జరిగే చర్చల్లో దీనిపై మరింత చర్చిస్తామని ఐసీసీ సీఈవో జియోఫ్ అలార్‌డైస్ అన్నారు. కాగా 2019లో జరిగిన పురుషుల […]
టీడీపీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంత్రి కొడాలి నాని ఆ పార్టీపై తీవ్రంగా విమర్శలు చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని చంద్రబాబు లాక్కున్నారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై ఎలాంటి ప్రేమ లేదని.. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి ఎందుకు బయటకు పంపారో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. మీరే పార్టీ లాక్కుంటారని.. మీరే వెన్నుపోటు పొడుస్తారని.. మీరే మళ్లీ ఎన్టీఆర్ ఫోటోకు దండలు వేస్తారని చంద్రబాబును ఉద్దేశించి ఎద్దేవా చేశారు. […]
హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైనే వాహనాలను పార్క్ చేస్తుంటారు. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చాలా కాలంగా రోడ్లపై వదిలివెళ్లిన వాహనాలను పోలీసులు క్రేన్‌ల సహాయంతో తొలగిస్తున్నారు. ఆయా వాహనాలను ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలను వదిలివెళ్లే వారికి ట్రాఫిక్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. 15 రోజులు కారు రోడ్డుపై కనిపిస్తే సీజ్ చేస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా రోడ్లపై వాహనాలు వదిలి వెళ్లేవారికి భారీగా జరిమానా […]
హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ యూనియన్ బ్యాంకులో దారుణం చోటుచేసుకుంది. బ్యాంకు లాకర్ గదిలో ఓ వృద్ధుడు ఉన్నాడనే విషయాన్ని గమనించకుండా సిబ్బంది బయటి నుంచి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో సదరు వృద్ధుడు 18 గంటల పాటు లాకర్ గదిలోనే ఉండిపోవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం సాయంత్రం 4:20 గంటలకు కృష్ణారెడ్డి (87) అనే వృద్ధుడు లాకర్ పని మీద యూనియన్ బ్యాంకుకు వెళ్లాడు. లాకర్ గదిలో ఆయన ఉండగానే బ్యాంకు పనివేళలు ముగియగానే సిబ్బంది […]
రాజస్థాన్ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రతాప్ సింగ్ కచరియావాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందులను ఉద్దేశిస్తూ రాజస్థాన్ మంత్రి బీజేపీ నేతలను రావణుడి భక్తులతో పోల్చారు. బీజేపీ నేతలు రాముడి భక్తులు కాదని రావణుడి భక్తులు అని మంత్రి ప్రతాప్ సింగ్ కచరియావాస్ స్పష్టం చేశారు. బీజేపీ నేతలు హిందూ భక్తులు అని చెప్పుకుంటున్నారని.. కానీ వాళ్లు రాముడి […]
ఐపీఎల్ ద్వారా మరో యువ కెరటం వెలుగులోకి వచ్చింది. సోమవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా లక్నో ఆటగాడు ఆయుష్ బదోనీ తన సత్తా చూపించాడు. అయితే అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్‌లోనే అతడు రికార్డు సృష్టించాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్ దిగిన ఆయుష్ బదోనీ మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉండగా 41 […]
ఏపీలో సినిమా టిక్కెట్లకు సంబంధించి జగన్ సర్కారు మరో ముందడుగు వేసింది. ఇప్పటికే పెద్ద సినిమాలకు టిక్కెట్ రేట్లు పెంచిన ప్రభుత్వం త్వరలోనే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను విక్రయించనుంది. ఈ ప్రక్రియకు సంబంధించి కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆన్‌లైన్ టిక్కెట్ల వెబ్‌సైట్ నిర్వహణ టెండర్ల ప్రక్రియ చివరి దశలో ఉంది. ఈ బిడ్డింగ్‌లో రెండు సంస్థలు పాల్గొనగా జస్ట్ టిక్కెట్స్ సంస్థకు టెండర్ దక్కినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి […]
ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఈరోజు అమీతుమీ తేల్చుకున్నాయి. అయితే ఈ పోరు కేఎల్ రాహుల్ టీమ్‌పై హార్డిక్ పాండ్యా జట్టు విజయం సాధించింది. వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 158 పరుగులు చేసింది. దీపక్ హుడా (55), ఆయుష్ బదోనీ (54) హాఫ్ సెంచరీలతో రాణించారు. అనంతరం […]
టీడీపీ స్థాపించి 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, ప్రస్తుత ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1983లో కాంగ్రెస్ వ్యతిరేక గాలిలో కమ్యూనిస్టులకు రావాల్సిన అధికారాన్ని ఎన్టీఆర్ తన్నుకుపోయారని నారాయణ వెల్లడించారు. ప్రపంచంలో రాజకీయ పార్టీ స్థాపించిన అతి తక్కువ సమయంలో అధికారంలోకి వచ్చిన నేత ఎన్టీఆరేనని ఆయన గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం రాజకీయ నేతల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నారు. ఇప్పడున్న […]
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఆయన ఎప్పుడూ మోటివేషనల్ వీడియోలను షేర్ చేస్తుంటారు. తాజాగా ఆయన ఓ వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియోలో తమకు దొరికిన ఆహారాన్ని పిల్లి వచ్చి తింటుండగా.. ఒక కాకి పిల్లిని తన ముక్కుతో గుచ్చగా ఆ కాకితో పిల్లి ఫైట్ చేస్తుండగా.. మరో కాకి వచ్చి ఆ ఆహారాన్ని తీసుకువెళ్లిపోతుంది. దీంతో కష్టాలు వచ్చిన సమయంలో ఎలా పోరాడాలో కాకులను చూసి […]