★ నేడు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద 500 వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించనున్న సీఎం జగన్★ ఏపీలో పెరిగిన టోల్‌ప్లాజా రేట్లు.. నేటి నుంచి అమలు★ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నేడు ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు★ తిరుమల: నేటి నుంచి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి, రేపు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం★ ప్రకాశం: మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలంటూ నేడు […]
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం పరుగులతో పోటెత్తింది. గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఘనవిజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఛేదించింది. లక్నో ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 40, డికాక్ 61 పరుగులతో రాణించారు. వీళ్లిద్దరూ అవుటైనా.. వన్‌డౌన్‌లో వచ్చిన మనీష్ పాండే (5) విఫలమైనా లక్నోకు తిరుగులేకుండా పోయింది. దీనికి కారణం విండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్. అతడు 23 […]
తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలిలో నేర చరితుల్ని సభ్యులుగా చేర్చడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘోరమైన నేరాలకు పాల్పడిన కొందరు వ్యక్తులు ఇటీవల టీటీడీ పాలకమండలిలో సభ్యులుగా చేరారని అటువంటి వారిని వెంటనే తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. నేరచరిత ఉన్నవారిని ఆలయ పాలకమండలిలో సభ్యులుగా ఎలా నియమిస్తారని.. భగవంతుని సేవలో నేరచరితులు ఉండటాన్ని ఉపేక్షించేది లేదంటూ ప్రభుత్వంపై, టీటీడీపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. […]
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు భారీ స్కోర్ చేసింది. 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. ఓపెనర్ రాబిన్ ఊతప్ప (50) మెరుపు బ్యాటింగ్ చేశాడు. 27 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. అతడు అవుటైనా శివమ్ దూబె (49) కూడా దూకుడుగా ఆడాడు. అయితే తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశం కోల్పోయాడు. దూబె 30 […]
అసలే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో అల్లాడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. సబ్బుల ధరలను పెంచుతూ హిందూస్థాన్ యూనీలివర్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్, పామాయిల్, సోయాబీన్ దిగుమతులపై ప్రభావం పడటంతో సబ్బుల తయారీ కంపెనీలకు నష్టం వాటిల్లుతోంది. ఈ మేరకు పలు సబ్బుల ధరలను 3 నుంచి 7 శాతం మేరకు హెచ్‌యూఎల్ పెంచింది. దీంతో సర్ఫ్ ఎక్సల్, వీల్, రిన్ వంటి డిటర్జెంట్ పౌడర్లతో పాటు డోవ్, లక్స్, […]
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో ఐసీయూలో రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు వైద్యులపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాకుండా ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీనివాసరావును కూడా బాధ్యుడిగా గుర్తించింది. ఆయనపై బదిలీ వేటు వేసింది. ఎంజీఎం సూపరింటెండెంట్‌గా శ్రీనివాసరావు స్థానంలో చంద్రశేఖర్‌కు పూర్తి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా రోగిని ఎలుకలు కొరికిన ఘటనపై పూర్తి వివరాలు తక్షణమే నివేదిక పంపించాలని […]
కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌లకు జైలు శిక్ష బదులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐఏఎస్ అధికారులు ఏయే జిల్లాలలోని హాస్టళ్లలో సంక్షేమ కార్యక్రమాలు చేయాలో హైకోర్టు తీర్పు కాపీలో స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయా జిల్లాల్లోని హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఓ రోజు ఏడాది పాటు సేవలందించి భోజన ఖర్చులు భరించాలని ఆదేశించింది. ఈ ప్రకారం 8 మంది ఐఏఎస్‌లకు 8 జిల్లాల కేటాయింపు […]
ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపును వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సమర్థించుకున్నారు. తమ ప్రభుత్వం వచ్చిన మూడేళ్లలో ఒకసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ఆయన గుర్తుచేశారు. ఇప్పుడు కూడా ఆర్ధిక పరిస్థితుల నేపథ్యంలో హేతుబద్దంగా స్వల్పంగా మాత్రమే విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నామన్నారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీలు ఇతర రాష్ట్రాల కంటే ఏపీలోనే తక్కువగా ఉన్నాయని సజ్జల అన్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్ధం చేసుకుంటారనే నమ్మకం ఉందన్నారు. అయితే విద్యుత్ […]
ఐపీఎల్‌లో ఈరోజు సూపర్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ జరగబోతోంది. మరి ఈ రెండు సూపర్ జట్లలో విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి. టాస్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒక మార్పుతో లక్నో జట్టు బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ఆడిన మోషిన్ స్థానంలో ఆండ్రూ టై జట్టులోకి […]
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు భారత రత్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జీవితాంతం అవిశ్రాంతంగా సేవలను అందిస్తున్న రతన్‌టాటా భారతరత్న అవార్డుకు అర్హుడంటూ సామాజిక కార్యకర్త రాకేష్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు తిరస్కరించింది. ఓ వ్యక్తికి దేశ అత్యున్నత అవార్డు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. అయినా అసలు […]