అజయ్ దేవగన్‌ను బాలీవుడ్‌లో చాలా మంది అజయ్ ఓ గన్ అంటూ ఉంటారు. యాక్షన్ హీరోగా జనాన్ని అలరించిన అజయ్ దేవగన్ ఒక్కో మెట్టూ ఎక్కుతూ తన అభినయంతోనూ ఆకట్టుకున్నారు. జాతీయ స్థాయిలో రెండు సార్లు ఉత్తమ నటునిగా నిలచి జనం మదిని గెలిచారు. ఓ నాటి అందాలతార కాజల్ పతిదేవునిగానూ అజయ్ దేవగన్ బాలీవుడ్‌లో పాపులర్. అయినా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న అజయ్ దేవగన్.. రాజమౌళి తాజా చిత్రం ‘ఆర్.ఆర్.ఆర్’లో వెంకట రామరాజు పాత్రలో […]
ప్రధాని మోదీ హత్యకు కొందరు దుండగులు కుట్ర పన్నారు. ఈ మేరకు ముంబైలోని ఎన్‌ఐఏ కార్యాలయానికి బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. మోదీ హత్యకు 20 మందితో స్లీపర్‌సెల్స్ రెడీగా ఉన్నట్లు ఈ-మెయిల్‌లో దుండగులు హెచ్చరించారు. 20 కేజీల ఆర్‌డీఎక్స్ కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. దీంతో వెంటనే కేంద్ర భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. బెదిరింపు ఈ-మెయిల్‌పై కేంద్ర హోంశాఖ అత్యున్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ-మెయిల్‌ను ఎవరు పంపారో కేంద్ర భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి.
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనలు చేపట్టాయి. టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో పలు చోట్ల కార్యకర్తలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు. పెంచిన విద్యుత్ ఛార్జీలు వెంటనే తగ్గించాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా తిరుపతి నాలుగు కాళ్ల మండపం వద్ద టీడీపీ నేతలు వినూత్నంగా నిరసన తెలిపారు. లాంతర్లు నెత్తిపై పెట్టుకుని విసనకర్రలతో విసురుకుంటూ బల్బులను మెడలో వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. చేతగాని సీఎం డౌన్ డౌన్ అంటూ […]
ఏపీలో ప్రభుత్వాస్పత్రిలో మహిళలు ప్రసవించిన అనంతరం సురక్షితంగా ఇంటికి చేరేందుకు వైఎస్ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు 500 వాహనాలను శుక్రవారం సీఎం జగన్ విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో అరకొరగా ఉన్న తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రారంభించామని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు అత్యాధునిక […]
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఖాతాలో మరో పెద్ద సంస్థ చేరింది. ప్రాసెస్ మైనింగ్ టెక్నాలజీలో అగ్రగామి సంస్థగా ఉన్న మినిట్‌ను భారీ మొత్తానికి కొనుగోలు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అయితే ఎంత మొత్తానికి కొనుగోలు చేసిన విషయం మాత్రం మైక్రోసాఫ్ట్ వెల్లడించలేదు. కాగా మినిట్ సంస్థ బిజినెస్ వ్యవహారాల్లో ఆపరేషన్స్ నిర్వహణలో మెరుగైన కార్యాచరణ సామర్థ్యం కోసం అవకాశాలను వెలికితీయడంలో ప్రసిద్ధి చెందింది. వ్యాపార ప్రక్రియ పూర్తి చిత్రాన్ని రూపొందించడం ద్వారా డిజిటల్‌గా రూపాంతరం చెందడానికి, […]
ఈ తరం వారికి దర్శకుడు శరత్ అంతగా తెలియకపోవచ్చు. కానీ శరత్ తెరకెక్కించిన సూపర్ హిట్స్ పేరు వింటే ఆయనా ఈ సినిమాలకు దర్శకుడు అని ఆశ్చర్యపోతారు. బాలకృష్ణతో పెద్దన్నయ్య, వంశానికొక్కడు వంటి సూపర్ హిట్స్ తీశారు. సుమన్‌తో బావ-బావమరిది, పెద్దింటి అల్లుడు, చిన్నల్లుడు వంటి విజయవంతమైన సినిమాలు రూపొందించారు. మహానటుడు ఏఎన్నార్ తో కాలేజీ బుల్లోడు, నటశేఖర కృష్ణతో సూపర్ మొగుడు లాంటి చిత్రాలు తీశారు. శరత్ మరణవార్త ఆయనతో పనిచేసిన వారికి దిగ్భ్రాంతి కలిగించింది. […]
రోజుకు రోజుకు ఎండలు పెరుగుతున్నాయి. వేసవి తాపంతో అటు చిన్నారుల నుంచి ఇటు వృద్ధుల వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో స్కూళ్లకు సంబంధించి ఒంటి పూట బడుల నిర్వహణపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక ప్రకటన చేశారు. ఏప్రిల్ 4 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. వేసవి తీవ్రత ఆధారంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 7:30 […]
టాలీవుడ్‌లో మరో విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు శరత్ శుక్రవారం ఉదయం అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. తెలుగులో ఆయన దాదాపు 20 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘డియర్’ అనే నవల ఆధారంగా ‘చాదస్తపు మొగుడు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి శరత్ పరిచయం అయ్యారు. బాలకృష్ణ, సుమన్ హీరోలుగా సినిమాలు తెరకెక్కించి భారీ విజయాలు సాధించారు. ఏఎన్నార్‌తో ‘కాలేజీ బుల్లోడు’, జగపతిబాబుతో ‘భలే బుల్లోడు’, బాలకృష్ణతో వంశానికొక్కడు, పెద్దన్నయ్య, […]
టాలీవుడ్‌లో మోస్ట్ టాలెంటెడ్ దర్శకుల్లో సుకుమార్ ఒకడు. ఆయన దర్శకత్వంలో నటించాలని అగ్ర హీరోలు వెయిట్ చేస్తున్నారు. ఇటీవల సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప-1 ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘనవిజయాన్ని సాధించింది. ప్రస్తుతం ఆయన పుష్ప-2 సినిమా ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం ఆయన మెగాస్టార్ చిరంజీవితో ఓ యాడ్ ఫిలింకు దర్శకత్వం వహించారు. శుభగృహ రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన ప్రకటనను తెరకెక్కించారు. […]