కోర్టు ధిక్కరణ కేసులో ఐఏఎస్‌లకు జైలు శిక్ష బదులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఏపీ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఐఏఎస్ అధికారులు ఏయే జిల్లాలలోని హాస్టళ్లలో సంక్షేమ కార్యక్రమాలు చేయాలో హైకోర్టు తీర్పు కాపీలో స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఆయా జిల్లాల్లోని హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఓ రోజు ఏడాది పాటు సేవలందించి భోజన ఖర్చులు భరించాలని ఆదేశించింది. ఈ ప్రకారం 8 మంది ఐఏఎస్‌లకు 8 జిల్లాల కేటాయింపు జరిగింది.
★ గోపాలకృష్ణ ద్వివేది-కృష్ణా జిల్లా
★ గిరిజా శంకర్- ప్రకాశం జిల్లా
★ బుడితి రాజశేఖర్- శ్రీకాకుళం జిల్లా
★ చినవీరభద్రుడు- విజయనగరం జిల్లా
★ జే.శ్యామలరావు- అనంతపురం జిల్లా
★ శ్రీలక్ష్మీ- పశ్చిమ గోదావరి జిల్లా
★ విజయ్ కుమార్- కర్నూలు జిల్లా
★ ఎంఎం నాయక్- నెల్లూరు జిల్లా