ఐపీఎల్‌లో ఈరోజు సూపర్ మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఈ రోజు మ్యాచ్ జరగబోతోంది. మరి ఈ రెండు సూపర్ జట్లలో విజయం ఏ జట్టును వరిస్తుందో చూడాలి. టాస్ విషయానికి వస్తే కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒక మార్పుతో లక్నో జట్టు బరిలోకి దిగుతోంది. గత మ్యాచ్‌లో ఆడిన మోషిన్ స్థానంలో ఆండ్రూ టై జట్టులోకి వచ్చాడు. మరోవైపు రవీంద్ర జడేజా నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం ఏకంగా మూడు మార్పులను చేసింది. ముగ్గురు న్యూజిలాండ్ ప్లేయర్లను తప్పించింది. ఆడమ్ మిల్నే, కాన్వే, శాంట్నర్ స్థానంలో ముఖేష్ చౌదరి, మొయిన్ అలీ, ప్రిటోరియస్‌లను తీసుకుంది.
జట్ల వివరాలు:
చెన్నై సూపర్ కింగ్స్: రవీంద్ర జడేజా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, రాబిన్ ఊతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ధోనీ, శివం దూబె, డ్వేన్ బ్రావో, ప్రిటోరియస్, తుషార్ దేశ్‌పాండే, ముఖేష్ చౌదరి
లక్నో సూపర్‌జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), డికాక్, లూయీస్, మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బదోనీ, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీరా, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్