Soaps Prices: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరిగిన సబ్బుల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అసలే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో అల్లాడుతున్న సామాన్యులకు మరో షాక్ తగిలింది. సబ్బుల ధరలను పెంచుతూ హిందూస్థాన్ యూనీలివర్ కంపెనీ నిర్ణయం తీసుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్‌ఫ్లవర్, పామాయిల్, సోయాబీన్ దిగుమతులపై ప్రభావం పడటంతో సబ్బుల తయారీ కంపెనీలకు నష్టం వాటిల్లుతోంది. ఈ మేరకు పలు సబ్బుల ధరలను 3 నుంచి 7 శాతం మేరకు హెచ్‌యూఎల్ పెంచింది. దీంతో సర్ఫ్ ఎక్సల్, వీల్, రిన్ వంటి డిటర్జెంట్ పౌడర్లతో పాటు డోవ్, లక్స్, పియర్స్, హమామ్, లిరిల్, రెక్సోనా వంటి ఒంటి సబ్బుల ధరలు కూడా పెరగనున్నాయి.
హెచ్‌యూఎల్ తాజా నిర్ణయంతో సర్ఫ్ ఎక్సల్ డిటర్జెంట్ కేజీ రూ.130 నుంచి రూ.134కు పెరిగింది. లక్స్ సోప్ (100 గ్రాములు 4) ఏకంగా 6.66 శాతం పెరిగి రూ.160కి చేరింది. పియర్స్ (75 గ్రాములు 3) సబ్బుల ధర సైతం 5.4 శాతం పెరిగి రూ.135కి చేరింది. కాగా త్వరలో ఇతర కంపెనీలు సైతం సబ్బుల ధరలు కూడా పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇప్పటికే బిస్కెట్ కంపెనీలు కూడా ధరలను పెంచిన సంగతి తెలిసిందే. బ్రిటానియా, పార్లె, డాబర్ ఇండియా వంటి సంస్థలు తమ ఉత్పత్తుల ధరలను పెంచేశాయి. మ్యారిగోల్డ్, గుడ్ డే వంటి బిస్కెట్ల తయారీ సంస్థ బ్రిటానియా తమ ఉత్పత్తుల ధరలను ఏడు శాతం పెంచుతామని చెప్పింది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?