Ratan Tata: రతన్‌టాటాకు భారతరత్న ఇవ్వాలన్న పిటిషన్‌పై హైకోర్టు అసహనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటాకు భారత రత్న అవార్డు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఓ వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జీవితాంతం అవిశ్రాంతంగా సేవలను అందిస్తున్న రతన్‌టాటా భారతరత్న అవార్డుకు అర్హుడంటూ సామాజిక కార్యకర్త రాకేష్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. అయితే ఈ పిటిషన్‌ను విచారించేందుకు హైకోర్టు తిరస్కరించింది. ఓ వ్యక్తికి దేశ అత్యున్నత అవార్డు భారతరత్న ఇవ్వాలని ప్రభుత్వ అధికారులను తాము ఆదేశించలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
అయినా అసలు ఇదేం పిటిషన్ అంటూ ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఓ వ్యక్తికి భారత రత్న ఇవ్వాలని కోర్టు ఆదేశాలిస్తుందా అంటూ పిటిషన్‌దారుడిని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. అయితే కనీసం ప్రభుత్వానికి విజ్ఞప్తి అయినా చేయాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని అభ్యర్థించాడు. దీనిపై తాత్కాలిక చీఫ్ జస్టిస్ విపిన్ సంఘీ స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి కోర్టు ఎక్కడ జోక్యం చేసుకోవాలని ప్రశ్నించారు. ఈ పిల్‌ను కొట్టి పారేస్తామని ఆయన ప్రకటించడంతో పిటిషనర్ తరఫు న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు కోర్టుకు తెలియజేశారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!