★ నేడు విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద 500 వైఎస్ఆర్ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రారంభించనున్న సీఎం జగన్
★ ఏపీలో పెరిగిన టోల్‌ప్లాజా రేట్లు.. నేటి నుంచి అమలు
★ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నేడు ఏపీలోని అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో నిరసనలు, ధర్నాలు
★ తిరుమల: నేటి నుంచి ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి, రేపు శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
★ ప్రకాశం: మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా చేయాలంటూ నేడు ఒంగోలు కలెక్టరేట్ వద్ద జిల్లా సాధన జేఏసీ రిలే నిరాహారదీక్షలు
★ గుంటూరు: నేడు తెనాలి రావి సాంబయ్య బాయ్స్ హై స్కూలులో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించనున్న ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
★ అమరావతి: నేడు సీఎం జగన్‌తో భేటీ కానున్న రామోజీ రావు కుమారుడు, ఈనాడు ఎండీ కిరణ్.. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో భేటీ… తన కుమార్తె వివాహ వేడుకకు సీఎం జగన్‌ను ఆహ్వానించనున్న కిరణ్
★ నేటి నుంచి విశాఖ ఏజెన్సీలోని పర్యాటక కేంద్రాల్లో పాలిథీన్ వినియోగంపై నిషేధం
★ నేటి నుంచి యాదాద్రి కొండపైకి ఉచిత బస్సులు.. కొండపైకి ప్రైవేట్ వాహనాలు నిషేధం
★ ఐపీఎల్-2022: నేడు ముంబైలోని వాంఖడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ ఢీ.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్