గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఐపీఎల్‌లో సరికొత్త రికార్డును నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నో ఆటగాడు దీపక్ హుడాను అవుట్ చేయడం ద్వారా ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా బ్రావో చరిత్ర సృష్టించాడు. దీంతో ఇప్పటివరకు మలింగ పేరిట ఉన్న రికార్డును బ్రావో బద్దలు కొట్టాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు బ్రావో 171 వికెట్లు తీసి అగ్రస్థానానికి చేరుకున్నాడు. అతడి తర్వాత స్థానంలో ఉన్న మలింగ […]
2019 ఎన్నికలకు ముందు సీఎం జగన్ ఇచ్చిన హామీలు, ప్రస్తుతం చేస్తున్న పనులను ఉదహరిస్తూ టీడీపీ నేత నారా లోకేష్ సెటైరికల్ వీడియోను ట్వీట్ చేశారు. వైసీపీ ప్రొడక్షన్స్ సమర్పించు అత్యద్భుతమైన సినిమా ‘జనం చెవిలో జగన్ పూలు’ ఏప్రిల్ 1న విడుదల అని లోకేష్ ఈ వీడియోకు క్యాప్షన్ పెట్టారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు, మద్యనిషేధం, ప్రత్యేక హోదా, సన్నబియ్యం పంపిణీపై ఇచ్చిన హామీలను ఇప్పుడు తుంగలో తొక్కారని.. ప్రజలను జగన్ ఏప్రిల్ పూల్ […]
ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశంసలు కురిపించారు. గురువారం పార్లమెంట్ సెంట్రల్ హాలుకు వచ్చిన సీఎం స్టాలిన్‌ను పలువురు వైసీపీ ఎంపీలు కలిశారు. స్టాలిన్‌ను కలిసిన వారిలో వైసీపీ ఎంపీలు మార్గాని భరత్, గోరంట్ల మాధవ్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, మోపిదేవి వెంకటరమణ, విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, రెడ్డప్ప, లావు శ్రీకృష్ణదేవరాయలు, వంగా గీత, తలారి రంగయ్య ఉన్నారు. వీరిని డీఎంకే ఎంపీ కనిమొళి సీఎం స్టాలిన్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా […]
ప్రియమణి, సన్నీలియోన్ తమ స్కేరీ లుక్స్‌తో భయపెడుతున్నారు. వివేక్ కుమార్ కన్నన్ తీస్తున్న ‘కొటేషన్ గ్యాంగ్’ మూవీలో ప్రియమణి, సన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్‌లో వారిద్దరితో పాటు జాకీ ష్రాఫ్, సారా అర్జున్ లుక్స్ కూడా రక్తపు మరకలతో భయానకంగా ఉండటం విశేషం. ఇందులో ప్రియమణి శకుంతలగా, సన్నీలియోన్ పద్మగా, జాకీ ష్రాఫ్ ముస్తఫాగా, సారా ఇరాగా కనిపించనున్నారు. తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రాబోతున్న ఈ […]
భీమ్లానాయక్ సినిమా తర్వాత రాజకీయాలపైనే దృష్టి పెట్టిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఉగాది పండగ తర్వాత మళ్లీ మేకప్ వేసుకుని రంగంలోకి దిగనున్నారు. వరుస సినిమాలతో ఆయన బిజీగా గడపనున్నారు. హరిహరవీరమల్లు సినిమాతో పాటు పలు కొత్త సినిమాల షూటింగ్‌లకు శ్రీకారం చుట్టనున్నారు. తొలుత క్రిష్ దర్శకత్వం వహిస్తున్న హరిహరవీరమల్లు సినిమా కొత్త షెడ్యూల్‌లో పవన్ పాల్గొననున్నారు. ఈ సినిమా ఇప్పటికే 50 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ కోసం ఇటీవల ఆర్ట్ డైరెక్టర్ […]
న్యూజిలాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఇంగ్లండ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో తొలి సెమీస్‌లో వెస్టిండీస్‌పై గెలిచిన ఆస్ట్రేలియాతో తుది సమయంలో ఇంగ్లండ్ తలపడనుంది. ఆదివారం నాడు ఈ రెండు జట్ల మధ్య క్రైస్ట్ చర్చ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే లీగ్ దశలో వరుసగా మూడు ఓటములతో సెమీస్ చేరడమే కష్టం అనుకున్న తరుణంలో ఇంగ్లండ్ అదరగొట్టింది. భారత్ […]
ఉగాది పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి మొత్తం ఐదు ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. సికింద్రాబాద్-తిరుపతి, మచిలీపట్నం-తిరుపతి, కాకినాడ-తిరుపతి, కాకినాడ-వికారాబాద్, తిరుపతి-మచిలీపట్నం మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. ప్రత్యేక రైళ్ల వివరాలు: ★ సికింద్రాబాద్-తిరుపతి (రైలు నం: 07597) రైలు ఏప్రిల్ 1న రాత్రి 8:15 గంటలకు బయలుదేరుతుంది ★ మచిలీపట్నం-తిరుపతి (రైలు నం: 07095) […]
దేశంలో సామాన్యుడికి షాక్ మీద షాక్ తగులుతోంది. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతుండగా.. తాజాగా మరోసారి గ్యాస్ సిలిండర్ ధర పెరిగింది. అయితే మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలనే పెంచాయి. ఈ మేరకు 19 కేజీల గ్యాస్ సిలిండర్ ధర రూ.250 పెరిగింది. దీంతో కమర్షియల్ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర రూ.2,253కు చేరింది. హైదరాబాద్‌లో అయితే ఈ సిలిండర్ ధర రూ. 2,186 నుంచి రూ. 2,460కి పెరిగింది. […]
ఉగాది పండగ సందర్భంగా ఏప్రిల్ 2వ తేదీని సెలవుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారి ముత్యాలరాజు నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలో ఏప్రిల్ 2న కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా ఉగాది సెలవు లేదని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ప్రభుత్వ ఉద్యోగుల నుంచి పలు విజ్ఞప్తులు రావడంతో అధికారులు సమీక్షించి కొత్త జిల్లాల ఏర్పాటును రెండు రోజుల పాటు వాయిదా వేశారు. కాగా కొత్త జిల్లాల ఏర్పాటు […]
దేశంలో గత 10 రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. శుక్రవారం కూడా చమురు ధరలు పెరిగాయి. ఏపీ, తెలంగాణలో పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 90 పైసలు పెరిగింది. దీంతో లీటర్ పెట్రోల్ రూ.115.42కి చేరింది. లీటర్ డీజిల్ ధర 87 పైసలు పెరిగి 101.58గా నమోదైంది. వరంగల్‌లో లీటర్ పెట్రోల్ 91 పైసలు పెరిగి రూ.114.93గా, లీటర్ డీజిల్ 87 పైసలు పెరిగి రూ.101.10గా ఉన్నాయి. మరోవైపు […]