హైదరాబాద్ నగర ప్రయాణికులకు మెట్రోరైలు అధికారులు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఈ మేరకు సూపర్ సేవర్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్డుతో రోజంతా మెట్రోరైలులో ప్రయాణం చేయవచ్చని తెలిపారు. ఈ కార్డు ధర రూ.59గా మెట్రో అధికారులు వెల్లడించారు. ఉగాది రోజు నుంచి సూపర్ సేవర్ కార్డులను విక్రయిస్తామని మెట్రోరైలు ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు. ఈ కార్డుతో నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా రోజంతా తిరగవచ్చన్నారు. కరోనా తర్వాత మళ్లీ మెట్రో సేవలను ప్రయాణికులకు […]
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఐసీయూలో భీమారంకు చెందిన రోగి శ్రీనివాస్ కాళ్లు, చేతులను ఎలుకలు కొరికాయి. దీంతో రోగికి తీవ్రంగా రక్తస్రావం జరిగింది. ప్రస్తుతం రోగి శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సీరియస్ అయ్యారు. తక్షణమే విచారణకు ఆదేశించారు. అధికారులు సమర్పించే నివేదిక ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మరోవైపు వరంగల్ అడిషనల్ కలెక్టర్ […]
ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండటంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ స్పందించారు. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో విద్యుత్ ఛార్జీలను పెంచలేదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకాలను చంద్రబాబు తీసివేయలేదా అని నిలదీశారు. గతంలో విద్యుత్ ఛార్జీలను పెంచి ప్రజలపై భారం వేసింది తెలుగుదేశంపార్టీనే అని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రజలను ఏదో విధంగా దృష్టి మరల్చడమే టీడీపీ లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. […]
ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు శుభవార్త అందింది. ఈ జట్టు స్టార్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో పలు కారణాలతో తొలి మ్యాచ్ ఆడలేదు. అయితే అతడు గురువారం నాడు జట్టుతో చేరిపోయాడు. దీంతో శుక్రవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో పంజాబ్ కింగ్స్ ఆడనున్న మ్యాచ్‌లో బెయిర్ స్టో ఆడనున్నట్లు జట్టు యాజమాన్యం ధ్రువీకరించింది. ఇంగ్లండ్ జట్టు వెస్టిండీస్ పర్యటన సందర్భంగా బెయిర్ స్టో జట్టులో చేరడం ఆలస్యమైనట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఐపీఎల్‌లో మయాంక్ అగర్వాల్ నేతృత్వంలోని […]
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అసోం, మణిపూర్, నాగాలాండ్‌లో వివాదాస్పదంగా మారిన సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని కుదిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. AFSPA (ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్) పేరుతో ఈ చట్టాన్నిఈశాన్య రాష్ట్రాలలో తిరుగుబాటు దారుల అణిచివేత కోసం కేంద్ర ప్రభుత్వం గతంలో తీసుకొచ్చింది. అయితే భద్రతా దళాలు ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చట్టం పరిధిలోని ప్రాంతాలను […]
కోర్టు ధిక్కరణ కేసులో 8 మంది ఐఏఎస్ అధికారులకు ఏపీ హైకోర్టు రెండు వారాల పాటు జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారులు క్షమాపణలు కోరడంతో జైలుశిక్షను తప్పించి సేవా కార్యక్రమాలు చేపట్టాలని హైకోర్టు ఆదేశించింది. ఏడాది పాటు సంక్షేమ హాస్టళ్లల్లో ప్రతి నెలలో ఒకరోజు సేవ చేయాలని తీర్పు ఇచ్చింది. ఒక రోజు పాటు కోర్టు ఖర్చులు భరించాలని ఐఏఎస్‌లను ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాలల్లో గ్రామ సచివాలయాల ఏర్పాటు చేయవద్దన్న […]
ఏపీలో కరెంట్ ఛార్జీల పెంపుపై ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్‌రెడ్డి స్పందించారు. 2024లో జగన్మోహన్ రెడ్డికి ప్రజలే పెద్ద షాక్ ఇస్తారని ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుతం ఫ్యాన్ స్విచ్ వేసే పరిస్థితిలో సామాన్య ప్రజలు లేరన్నారు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారని ఆరోపించారు. చంద్రబాబు మీద కోపంతో రాష్ట్రాన్ని సీఎం జగన్ సర్వనాశనం చేస్తున్నారని విమర్శలు చేశారు. ఏపీని అవినీతి ప్రదేశ్, అంధకారప్రదేశ్‌గా మారుస్తున్న గొప్ప వ్యక్తి జగన్ అంటూ ఏపీ బీజేపీ […]
పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు వంట గ్యాస్ ధరల పెరుగుదలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన తెలియజేశాయి. ఈ మేరకు గ్యాస్ సిలిండర్‌కు దండలు వేసి డప్పులు కొడుతూ కాంగ్రెస్ నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. గత 10 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం […]
బుధవారం రాత్రి బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పరాజయం పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. సాధించింది తక్కువ పరుగులే అయినా కోల్‌కతా బాగానే పోరాడింది. తమ బౌలర్లు అద్భుతంగా రాణించారని.. అయితే బ్యాటింగ్ విభాగం నిరాశపరిచిందని కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వివరించాడు. బెంగళూరు బౌలర్ హసరంగాను ఆడటంతో తాము పొరపాటు చేశామని పేర్కొన్నాడు. అతడి ఆఫ్ స్పిన్‌ను ఆటడంలో ప్రణాళికలు అమలు చేయడంలో తమ బ్యాట్స్‌మెన్ విఫలమై […]
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వృద్ధులు, దివ్యాంగులకు అనుమతి ఇవ్వనున్నట్లు ఇటీవల టీటీడీ ప్రకటించింది. అందుకు సంబంధించి గురువారం నాడు దర్శన టికెట్లు జారీ చేయాల్సి ఉండగా.. సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో టోకెన్ల జారీని టీటీడీ ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. ఈ విషయాన్ని టీటీడీ స్వయంగా వెల్లడించింది. ఆయా టోకెన్‌లను ఏప్రిల్ 8వ తేదీ ఉ.11 గంటలకు టోకెన్లు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ ఉ.10 గంటలకు, […]