టీడీపీ 40 వసంతాల వేడుకలను హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు హాజరై కీలక ప్రసంగం చేశారు. ఆనాడు పార్టీ ప్రకటన కోసం ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు అతికొద్దిమందితోనే ఎన్టీఆర్ వచ్చారని.. కానీ ఎన్టీఆర్ నుంచి ప్రకటన రాగానే వేలాది మంది తరలివచ్చారని చంద్రబాబు వెల్లడించారు. ఆనాడు ఎన్టీఆర్ ప్రారంభించిన టీడీపీ ఇటు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయాల్లోనే ఓ బెంచ్ మార్కును సృష్టించిందని తెలిపారు. 40 ఏళ్ల […]
ఉక్రెయిన్‌పై రష్యా దాడి రెండో నెలలోకి ప్రవేశించింది. ఐదు వారాలుగా ఎడతెరపి లేకుండా సాగుతున్న దాడులకు ఉక్రెయిన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించటం పెద్ద కష్టం కాదు. జరుగుతున్న రక్తపాతానికి ఉక్రెయిన్ ప్రజలు హడలిపోతున్నారు. పిల్లలకు స్కూళ్లు లేవు. వైద్యం లేదు. ముఖ్యంగా వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశంలో ఏ ప్రాంతం కూడా సురక్షితం అని చెప్పలేని పరిస్థితి నెలకొంది. రాజధాని కీవ్‌లో దాదాపు కోటి మంది సురక్షిత ప్రాంతాలను వెతుక్కోవటానికి ఇల్లు వీడి వెళ్లిపోయారు. […]
సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ ఎప్పటికప్పుడు తన స్థానాన్ని పదిలపరుచుకుని యూజర్లకు మంచి ఆఫర్లను ప్రకటిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ ఫీచర్ సహాయంతో 2జీబీ వరకు ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం యూజర్లకు వాట్సాప్ అందించనుంది. ప్రస్తుతానికి 100 ఎంబీ కన్నా ఎక్కువ సైజ్ ఉన్న ఫైల్స్ షేర్ చేసుకునేందుకు వాట్సాప్‌లో అవకాశం లేదు. దీంతో పెద్ద సైజ్ ఫైల్స్ షేర్ చేసుకునే అవకాశం లేకుండా పోతుందని […]
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీపై టీమిండియా స్పిన్నర్ చాహల్ సంచలన ఆరోపణలు చేశాడు. ఈ ఏడాది మెగా వేలంలో తనను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిందని.. కానీ ఈ హామీని ఆర్సీబీ తుంగలో తొక్కిందని చాహల్ విమర్శలు చేశాడు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాహల్ ఈ ఆరోపణలు చేశాడు. తాను ఆర్‌సీబీ టీమ్‌లో ఉండాలంటే ఎక్కువ డబ్బులు డిమాండ్ చేశాననే వార్తలు పూర్తిగా అవాస్తవమని క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్‌లో తాను ఆర్సీబీని వీడి మరో […]
ఏపీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం కాకపోతే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. 2024 ఎన్నికల్లో 160 స్థానాలు గెలుస్తామని టీడీపీ అంటోందని.. అంటే తాము గాజులు తొడుక్కుని కూర్చుంటామా అని ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు. టీడీపీ నేత అచ్చెన్నాయుడు కామెంట్లకు వైసీపీ నేతలు భయపడాల్సిన అవసరం […]
తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982లో ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారు. పార్టీ స్థాపించిన 9 నెలలకే ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు. ఇది అప్పట్లో ఓ రికార్డు. ఎందుకంటే పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలో ఎవరూ అధికారంలోకి వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఇప్పట్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత టీడీపీకి కలిసొచ్చింది. ఆ సమయంలో బీజేపీ ఉన్నా ఆ పార్టీకి బలం లేదు. దీంతో ప్రజలకు ప్రత్యామ్నాయంగా కనిపించిన ఏకైక పార్టీ తెలుగు దేశం పార్టీ. ఆవిర్భావం […]
ఇండియాలో ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 3 నుంచి 5 వరకు బెన్నెట్ భారత్‌లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ఈ పర్యటన వాయిదా పడిందని ఇజ్రాయెల్ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బెన్నెట్ ఐసోలేషన్‌లో ఉన్నారని.. ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నారని వారు తెలిపారు. తమ ప్రధాని భారత్‌లో పర్యటించే కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు కాగా ప్రధాని మోదీ […]
తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏపీ, తెలంగాణలో టీడీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ టీడీపీతో పాటు ఆ పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ పేరును ప్రస్తావించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించి తెలుగు ప్రజలకు ఆత్మగౌరవాన్ని సంపాదించిపెట్టిన ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా టీడీపీ 40 వసంతాల పండుగ జరుపుకుంటున్న విషయాన్ని కూడా ఆయన […]
టీమిండియా మాజీ ఆటగాడు, స్టార్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కెరీర్‌లో మార్చి 29వ తేదీకి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఎందుకంటే సెహ్వాగ్ తన తొలి ట్రిపుల్ సెంచరీని సాధించింది ఈరోజే. ఈ ట్రిపుల్ సెంచరీ సెహ్వాగ్‌కే కాదు టీమిండియాకు కూడా తొలి ట్రిపుల్ సెంచరీ. పాకిస్థాన్‌లోని ముల్తాన్ వేదికగా మార్చి 29, 2004న ట్రిపుల్ సెంచరీ నమోదు చేసిన సెహ్వాగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాకుండా మళ్లీ […]
నెల్లూరు జిల్లాలో అతిపెద్ద మద్యం స్కాం బయటపడింది. జిల్లాలోని పలు ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లు విచ్చలవిడిగా కనిపిస్తున్నాయి. నకిలీ స్టిక్కర్లతో ప్రభుత్వ వైన్ షాపులకు గోవా లిక్కర్ సరఫరా అవుతోంది. కొందరు అక్రమార్కులు గోవా నుంచి నెల్లూరు జిల్లా మైపాడుకు తారు ట్యాంకర్ల ద్వారా మద్యం సరఫరా చేస్తున్నారు. గోవాలో 25 రూపాయలకు క్వార్టర్ బాటిల్ కొనుగోలు చేసి నెల్లూరు జిల్లాలో 100 రూపాయలకు వాటిని విక్రయిస్తున్నారు. అయితే ఈ స్కాం […]