ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం పరుగులతో పోటెత్తింది. గురువారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో లక్నో ఘనవిజయం సాధించింది. చెన్నై నిర్దేశించిన 211 పరుగుల భారీ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో ఛేదించింది. లక్నో ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ 40, డికాక్ 61 పరుగులతో రాణించారు. వీళ్లిద్దరూ అవుటైనా.. వన్‌డౌన్‌లో వచ్చిన మనీష్ పాండే (5) విఫలమైనా లక్నోకు తిరుగులేకుండా పోయింది. దీనికి కారణం విండీస్ ఆటగాడు ఎవిన్ లూయిస్. అతడు 23 బంతుల్లో 55 పరుగులు చేశాడు. ఇందులో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. మరోవైపు ఆయూష్ బదోని 9 బంతుల్లో 18 పరుగులు చేశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగడంతో లక్నో టార్గెట్‌ను తేలికగా ఛేదించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 210 పరుగులు చేసింది. కాగా చెన్నై టీమ్‌కు టోర్నీలో ఇది వరుసగా రెండో పరాజయం.