2019లో జగన్ సీఎం అయ్యాక రెండున్నరేళ్ల అనంతరం కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ చేస్తానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఏపీ కేబినెట్ చివరి సమావేశం జరుగుతోంది. మంత్రులకు ఇదే చివరి సమావేశం. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎన్టీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. సీఎం జగన్‌వి ఉన్నత ప్రమాణాలు అని ప్రశంసించారు. సీఎం జగన్ లక్ష్యాలకు అనుగుణంగా పని చేయటానికి శాయశక్తులా పని చేశానని మంత్రి సురేష్ తెలిపారు. విద్యాశాఖ మంత్రిగా సీఎం తనకు గొప్ప అవకాశం […]
అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం మధ్యాహ్నం సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో 36 అంశాలపై చర్చించనున్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, మిల్లెట్ మిషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త రెవెన్యూ డివిజన్లలో మార్పులు, 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుపై కూడా మంత్రివర్గ చివరి భేటీలో చర్చించనున్నారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై కూడా చర్చించనున్నారు. అయితే ఈ సమావేశం మంత్రులందరికీ […]
బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాట్స్‌మెన్ నితీష్ రానాపై మ్యాచ్ రిఫరీ చర్యలు తీసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించడంతో పాటు మందలించారు. అయితే ఆ తప్పు ఏంటన్నది మ్యాచ్ రిఫరీ వెల్లడించలేదు. నితీష్ రాణా తన తప్పిదాన్ని అంగీకరించడంతో జరిమానాతో సరిపెట్టారు. లేకుంటే అతనిపై ఓ మ్యాచ్ నిషేధం పడేది. మరోవైపు ముంబై ఇండియన్స్ బౌలర్ బుమ్రా కూడా నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలుస్తోంది. […]
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో కరెంట్ కోతలు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎన్టీఆర్ ప్రభుత్వాస్పత్రిలో జనరేటర్ కూడా పనిచేయడం లేదు. దీంతో అర్ధరాత్రి 11 గంటల సమయంలో కృష్ణదేవిపేట నుంచి వచ్చిన ఓ గర్భిణీ పురిటినొప్పులతో బాధపడింది. కరెంట్ లేకపోవడంతో సెల్‌ఫోన్ లైట్ల మధ్యనే వైద్యులు ఆమెకు డెలివరీ చేశారు. ఆ సమయంలో గ్రామంలో ఆస్పత్రి స్టాఫ్‌కు కొవ్వొత్తులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ప్రసూతి విభాగంలో ఉన్న చంటిబిడ్డ తల్లులు, అప్పుడే పుట్టిన పిల్లలు […]
కోవై సరళ మాతృభాష మలయాళం. పుట్టిందేమో తమిళనాడు. చెలరేగింది తెలుగునాట. సరళ అభినయంలో అతి కనిపించినా, అది ఎందుకనో ‘అతికి’నట్టుగానే ఉంటుంది. అందుకే కోవై వినోదం చూసి జనం జేజేలు పలికారు. తెలుగును సైతం తనదైన పంథాలో పలికి, పసందైన పాత్రల్లో నవ్వులు పూయించారామె. అందుకే తెలుగువారి మదిలో చెరిగిపోని స్థానం సంపాదించారు కోవై సరళ. కోవై సరళ 1962 ఏప్రిల్ 7న కోయంబత్తూరులో జన్మించారు. చదువుకునే రోజుల నుంచీ సరళ ఎంతో చిలిపిగా ఉండేవారు. ఇతరులను […]
దేశంలో చోటుచేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలపై బుధవారం రాజ్యసభలో ఆయన లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. జెనీవాలోని ఇంటర్నేషనల్ రోడ్ ఫెడరేషన్ విడుదల చేసిన వరల్డ్ రోడ్ స్టాటిస్టిక్స్ (డబ్ల్యూఆర్‌ఎస్) 2018 ప్రకారం.. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన వారి సంఖ్య విషయంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. మరోవైపు రోడ్డుప్రమాదాల్లో క్షతగాత్రుల విషయంలో మాత్రం భారత్ మూడో స్థానంలో ఉందని తెలిపారు. 2020 సంవత్సరానికి 18 […]
ఏపీలో మండు వేసవిలో కరెంట్ కోతలు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అప్రకటిత కరెంట్ కోతలపై టీడీపీ నేతలు పలు చోట్ల ధర్నాలకు దిగారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని కురగల్లు గ్రామంలో బుధవారం రాత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటిస్తుండగా కరెంట్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆయన నేరుగా లాంతర్ చేతబట్టి నిరసన తెలిపారు. మరోవైపు ఏపీలో పెంచిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఆధ్వర్యంలో లాంతర్లు, కాగడాలతో టీడీపీ […]
ఐపీఎల్‌లో భారీ అంచనాలతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు తడబడుతోంది. గత రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన ఆ జట్టు మూడో మ్యాచ్‌లోనూ తడబడింది. కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌తో ఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ (3), ఇషాన్ కిషన్ (14) విఫలమైనా సూర్యకుమార్ (52), తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (38 నాటౌట్), పొలార్డ్ (22 నాటౌట్) మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో […]
దాదాపు మూడున్నర దశాబ్దాల తర్వాత వచ్చిన రియల్ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్.’. అలాంటి సినిమా తెలుగులో ఇప్పట్లో మరొకటి తెరకెక్కుతుందో లేదో తెలియదు. అయితే సీనియర్ స్టార్ హీరోలు యంగ్ హీరోలతో కలిసి కొన్ని మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్నారు. కానీ వాటిని ‘రియల్ మల్టీస్టారర్’ కేటగిరిలో వేయడానికి ట్రేడ్ వర్గాలు అంగీకరించడం లేదు. నిజానికి ఇప్పటికే హీరోగా రాణిస్తున్న విక్టరీ వెంకటేష్ యువ కథానాయకులు మహేష్ బాబు, రామ్, వరుణ్ తేజ్ వంటి వాళ్ళతో సినిమాలు చేశాడు. అందులో […]
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత తన భర్త విష్ణు ప్రసాద్‌తో కలిసి గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌లో తొలి యత్నంగా ‘షూట్ ఎట్ ఆలేర్’ వెబ్ సిరీస్ తీశారు. ఆ తర్వాత ఓటీటీ కోసం ‘సేనాపతి’ మూవీ చేశారు. ఇంత వరకూ కంటెంట్ ప్రధానంగా డిజిటల్ మీడియా కోసం వెబ్ సీరిస్, ఓటీటీ ఫిల్మ్ తీసిన సుస్మిత ఇప్పుడు ఫస్ట్ టైమ్ థియేట్రికల్ రిలీజ్ కోసం ఫీచర్ ఫిల్మ్ నిర్మిస్తున్నారు. అదే ‘శ్రీదేవి […]