దీర్ఘకాలంగా వెన్నెముక సమస్యలతో బాధపడుతున్నారా? అయితే మీకు గుడ్‌న్యూస్.. ఏషియన్ స్పైన్ ఆస్పత్రి వారు భారతదేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో సమగ్ర స్పైన్ అండ్ పెయిన్ కేర్ కోసం జూబ్లీహిల్స్‌లో ఎండోస్కోపిక్ స్పైన్ సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఈ మేరకు ఈ సెంటర్‌ను ఏఐజీ హాస్పిటల్స్ ఫౌండర్, ఛైర్మన్ డి.నాగేశ్వరరెడ్డి ప్రారంభించారు. రోగులకు నాణ్యమైన, ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి ఏషియన్ స్పైన్ సెంటర్ కట్టుబడి ఉందని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. వెన్నెముక సమస్యలతో బాధపడేవారి సంరక్షణకు […]
దేశంలో చాలా మంది ఆడపిల్లలు పుట్టకూడదని కోరుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని గట్టిగా నమ్ముతారు. ఈ కోవలోకే ఓ ఫ్యామిలీ వస్తుంది. మహారాష్ట్ర షెల్గావ్‌లోని ఓ కుటుంబం అప్పుడే పుట్టిన ఓ ఆడపిల్లను హెలికాప్టర్‌లో ఇంటికి తీసుకువెళ్లి ఘనస్వాగతం పలికింది. హెలికాప్టర్ నుంచి దిగిన తర్వాత పాపకు పూల మాలలు వేసి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. ఆడపిల్ల పుట్టిందని సదరు ఫ్యామిలీ మాములుగా సంబరాలు చేయలేదు. ఈ వేడుకలను చూసేందుకు […]
ఏపీలో కొత్తగా 13 జిల్లాలు ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కొత్త జిల్లాల అంశాన్ని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రస్తావించారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ప్రతి జిల్లాలో ఓ కేంద్రీయ విద్యాలయం ఉండాలనే విషయాన్ని ఆయన రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ఏపీలో ఏర్పడిన కొత్త జిల్లాలకు కేంద్రీయ విశ్వవిద్యాలయాలను మంజూరు చేయాలని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర […]
ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ బిజీబిజీగా ఉన్నారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో జగన్ సమావేశమయ్యారు. ప్రధానితో భేటీ సందర్భంగా ఏపీకి రుణపరిమితులు, పెండింగ్ బిల్లులు, పోలవరం ప్రాజెక్టు నిధులు, రాష్ట్ర విభజన సమస్యలు, జాతీయ ఆహార భద్రతా చట్టం అర్హుల ఎంపికలో హేతుబద్ధత వంటి అంశాలను జగన్ చర్చించారు. ప్రధానితో భేటీ గంటకు […]
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరింత ముదిరింది. దీంతో ఐపీఎల్ ప్రసారాలు కూడా నిలిచిపోయాయి. ప్రసార హక్కుదారులకు చెల్లించేందుకు డబ్బుల్లేక అక్కడ ఐపీఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసే యుప్ టీవీ, ఎస్ఎల్ఆర్సీ, డయలాగ్ టీవీ, పియో టీవీ ఛానల్‌లు క్యాష్ రిచ్ లీగ్ ప్రసారాలను నిలిపివేశాయి. దేశంలో ఎమర్జెన్సీ నెలకొన్న నేపథ్యంలో ప్రజలు ఐపీఎల్ మ్యాచ్‌లను ఎంజాయ్ చేసే మూడ్‌లో లేరని.. అందుకే ఐపీఎల్ టెలికాస్ట్‌పై అంతగా ఫోకస్ పెట్టలేదని అక్కడి మీడియా వెల్లడించింది. ఐపీఎల్‌లో శ్రీలంక ఆటగాళ్లు […]
ఐపీఎల్ 2022 సీజన్‌లో రాజస్థాన్ ఆటగాడు జాస్ బట్లర్ మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన బట్లర్.. మంగళవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లోనూ రాణించాడు. బట్లర్ ఆట వల్లే రాజస్థాన్ చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించకపోవడంతో రాజస్థాన్ బ్యాటర్స్ తొలుత పరుగులు చేసేందుకు ఇబ్బంది […]
మంగళగిరిలో జనసేన విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. తాము ఎవరి పల్లకీలను మోయడానికి లేమని స్పష్టం చేశారు. ప్రజలను పల్లకిలోకి ఎక్కించేందుకే జనసేన ఉందన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న అరాచకాలు, అన్యాయాలు చూసి భరించలేక వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పానని.. దానికి వైసీపీ నేతలు ద్వంద్వర్థాలు తీస్తున్నారని పవన్ ఆరోపించారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదని చాలా ఆలోచించే అన్నాను. వైసీపీ చేస్తోన్న […]
గత నెలలో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తరువాత దేశంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ముద్ర గతంలో ఎన్నడూ లేనంత అల్ప స్థాయికి పడిపోయింది. దాంతో 135 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పురాతన రాజకీయ పార్టీ తన జాతీయ ప్రాముఖ్యతను కోల్పోతోందని అనిపిస్తోంది. ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ వంటి పార్టీల విస్తరణతో దశాబ్దాలుగా భారత రాజకీయాలపై గల తన ఆధిపత్య శక్తిని కోల్పోతోంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ […]
శ్రీకాకుళం జిల్లాలో విచిత్రం చోటు చేసుకుంది. కంచిలి మండలం జడిపుడి గ్రామంలో జామి ఎల్లమ్మ ఆలయంలో సోమవారం రాత్రి ఓ వ్యక్తి దొంగతనానికి వెళ్లాడు. పొరుగు గ్రామానికి చెందిన పాపారావు అనే వ్యక్తి ఆలయంలో చోరీకి ప్రయత్నించాడు. తొలుత అతడు గోడకు ఓ వైపున చిన్న రంధ్రం పెట్టి గుడిలోకి ప్రవేశించాడు. అయితే గుడి లోపలకు బాగానే వెళ్లిన దొంగ.. హుండీలో కానుకలు, అమ్మవారి నగలు దొంగతనం చేసి బయటకు మాత్రం రాలేకపోయాడు. తిరిగి వస్తూ అతడు […]
ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు. సుమారు గంటకు పైగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను మోదీతో జగన్ మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరారు. 2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55,548.87 కోట్లుగా నిర్ధారించిందని.. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి […]