ఐపీఎల్‌లో భాగంగా డీవై పాటిల్ స్టేడియం వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ స్వల్ప స్కోరు చేసింది. ఆరంభంలో అదరగొట్టిన ఆ జట్టు బ్యాటర్లు ఆ తర్వాత నెమ్మదిగా ఆడటంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. దీంతో 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 149 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఢిల్లీ జట్టు సాధించిన స్కోరులో ఓపెనర్ పృథ్వీ షా ఒక్కడే 61 పరుగులు చేశాడు. కెప్టెన్ పంత్ 39 నాటౌట్, సర్ఫరాజ్ ఖాన్ 36 […]
ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాడు (ఏప్రిల్ 8) నంద్యాలలో పర్యటించనున్నారు. ఎస్‌పీజీ గ్రౌండ్ నంద్యాలలో జగనన్న వసతి దీవెన పథకాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఉదయం 10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో నంద్యాలకు బయలుదేరనున్నారు. ఉదయం 11:10 గంటలకు నంద్యాల గవర్నమెంట్ డిగ్రీకాలేజీకి చేరుకుంటారు. ఉదయం 11:35- 12:35 గంటల మధ్య ఎస్‌పీజీ గ్రౌండ్‌కి చేరుకుని జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించి బహిరంగ సభలో […]
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు వరుస ఓటములపై టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎంతటి గొప్ప కెప్టెన్ అయినా సరైన ఆటగాళ్లు లేకపోతే ఏం చేయలేడని కైఫ్ అభిప్రాయపడ్డాడు. ముంబై ఇండియన్స్ హ్యాట్రిక్ పరాజయాలకు రోహిత్ శర్మ కెప్టెన్సీకి ఏం సంబంధం లేదని కైఫ్ అన్నాడు. తన దృష్టిలో రోహిత్ శర్మ గొప్ప సారథి అని స్పష్టం చేశాడు. సరైన ఆటగాళ్లు లేకుంటే జట్టులో ఎంతటి గొప్ప కెప్టెన్ ఉన్నా టీమ్‌ను […]
ఏపీలో మంత్రులందరూ రాజీనామాలు చేయడంతో కొత్త కేబినెట్‌లో ఎవరు ఉంటారన్న విషయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. కేబినెట్‌లో ఎవరిని కొనసాగించాలి, ఎవరిని సాగనంపాలి అనేది సీఎం జగన్ ఇష్టమని, ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. దేవుడి దయ ఉంటే మళ్లీ 24 మంది కేబినెట్‌లో తాను ఉంటానని బొత్స ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వైసీపీని […]
అమరావతి: మంత్రిగా తన చివరి మీడియా సమావేశంలో పేర్ని నాని పలు విషయాలపై చర్చించారు. అన్ని రంగాలను అభివృద్ధి చేసేందుకు జగన్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని పేర్ని నాని తెలిపారు. ముఖ్యంగా తమ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలే మారిపోయినట్లు వెల్లడించారు. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో చేరాలంటే ఆలోచించేవాళ్లు అని.. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు హౌస్‌ఫుల్ బోర్డులు పెడుతున్న ఘటనలు చూస్తున్నామన్నారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్‌పై పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ […]
దేశమంతా ఐపీఎల్ ఫీవర్ నెలకొని ఉంది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లు బెట్టింగ్ రాయుళ్లకు అడ్డాగా మారాయి. దీంతో హైదరాబాద్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ స్థావరాలపై విస్తృతంగా దాడులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న బుకీలను మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 18 మంది ఆర్గనైజర్‌లను, బుకీలను అదుపులోకి తీసుకున్నారు. ఏడుగురు బుకీలు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.1.06 కోట్ల నగదు, 5 బెట్టింగ్ బోర్డులు, 7 ల్యాప్ టాప్‌లు, […]
ఏపీ కేబినెట్ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమని సీఎం జగన్ రాజీనామా చేసిన మంత్రులతో వ్యాఖ్యానించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబును మళ్లీ ఓడించాలని జగన్ పిలుపునిచ్చారు. చంద్రబాబును మరోసారి ఓడించే బాధ్యత మీదేనని, మళ్లీ ఓడితే చంద్రబాబుకు రాజకీయ జీవితం ఉండదని రాజీనామా చేసిన మంత్రులతో జగన్ చెప్పారు. రెండున్నరేళ్లు మంత్రివర్గంలో కొనసాగారని, ఇక నుంచి పార్టీ కోసం సేవలు వినియోగించుకుంటానని చెప్పారు. అందరికీ జిల్లాల్లో పార్టీ […]
ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులందరూ రాజీనామాలు చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. కాగా అనుభవం రీత్యా కొంతమంది మంత్రులను కొనసాగిస్తున్నట్లు జగన్ చెప్పారని కొడాలి నాని వెల్లడించారు. కానీ ఎవరిని కొనసాగిస్తున్నారో చెప్పలేదన్నారు. ప్రస్తుతం ఉన్న ఐదారుగురు మంత్రులు కొత్త కేబినెట్‌లో ఉండే అవకాశం ఉందన్నారు. కొత్త కేబినెట్‌లో తాను ఉండే అవకాశం తక్కువ అని కొడాలి నాని పేర్కొన్నారు. జగన్ ఏ బాధ్యత […]
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. అసూయకు మందు లేదని.. ఇంత అసూయతో ఉంటే త్వరగా గుండెపోటు, బీపీలు వస్తాయన్న జగన్ వ్యాఖ్యలకు లోకేష్ కౌంటర్ ఇచ్చారు. అసూయకు అన్న లాంటి వాడు సీఎం జగన్ మోహన్ రెడ్డేనని. అందుకే నాన్న, బాబాయ్‌కు టికెట్ తీసి పంపేశాడని లోకేష్ ఆరోపించారు. మరోసారి సీఎం జగన్ అసూయతో గర్వం దాల్చాడని.. ఈ సారి గుండెపోటు తల్లికో.. చెల్లికో..? అంటూ […]
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. ఒకవైపు రాష్ట్రంలో కరెంట్ కోతలతో ప్రజలు అల్లాడుతుంటే వాలంటీర్లకు సన్మానం పేరుతో రూ.233 కోట్లతో తగలేస్తూ పండగ చేసుకుంటున్న ముఖ్యమంత్రిని నీరో అనక ఇంకేమనాలని చంద్రబాబు ప్రశ్నించారు. కరెంట్ కోతలతో ఏపీ చీకట్లోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. తీవ్రమైన విద్యుత్ కోతలతో జనం నరకం చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామాల్లో అనధికార విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారని.. విద్యుత్ సరఫరా […]