ఐపీఎల్‌లో భారీ అంచనాలతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు తడబడుతోంది. గత రెండు మ్యాచ్‌లలో ఓటమి పాలైన ఆ జట్టు మూడో మ్యాచ్‌లోనూ తడబడింది. కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌తో ఈ సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ రాణించడంతో చెప్పుకోదగ్గ స్కోరు చేసింది. ఓపెనర్లు రోహిత్ (3), ఇషాన్ కిషన్ (14) విఫలమైనా సూర్యకుమార్ (52), తెలుగు కుర్రాడు తిలక్ వర్మ (38 నాటౌట్), పొలార్డ్ (22 నాటౌట్) మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 4 వికెట్లు నష్టపోయి 161 పరుగులు చేసింది. పొలార్డ్ చివరి ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి మూడు సిక్సర్లు బాదాడు. కోల్‌కతా బౌలర్లలో కమిన్స్ 2 వికెట్లు తీయగా.. ఉమేష్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ సాధించారు. కోల్‌కతా ముందు 162 పరుగుల టార్గెట్ నిలిచింది.
https://www.youtube.com/watch?v=DFQmSRQjdyo