Andhra Pradesh: ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం.. మంత్రులకు ఇదే చివరి సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమరావతి: వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో గురువారం మధ్యాహ్నం సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో 36 అంశాలపై చర్చించనున్నారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం, మిల్లెట్ మిషన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలపనుంది. కొత్త రెవెన్యూ డివిజన్లలో మార్పులు, 12 పోలీస్ సబ్ డివిజన్లు, 16 పోలీస్ సర్కిళ్ల ఏర్పాటుపై కూడా మంత్రివర్గ చివరి భేటీలో చర్చించనున్నారు. వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలపై కూడా చర్చించనున్నారు.
అయితే ఈ సమావేశం మంత్రులందరికీ చివరిది కానుంది. కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత మంత్రులందరూ మూకుమ్మడిగా రాజీనామాలు చేయనున్నారు. అనంతరం వారి రాజీనామా పత్రాలను జీఏడీ అధికారులు గవర్నర్ దగ్గరకు తీసుకువెళ్లనున్నారు. చివరి కేబినెట్ సమావేశం కావడంతో మంత్రులతో జగన్ ప్రత్యేకంగా మాట్లాడనున్నారు. ఎవరెవర్నీ తీసేస్తున్నారు.. ఎందుకు తీస్తున్నారో వివరించి చెప్పనున్నారు. చాలా మంది మంత్రులకు మంత్రిగా ఇదే చివరి రోజు కావడంతో ఆయా ఛాంబర్లలో సందడి వాతావరణం కనిపించింది. చివరి నిమిషంలో పెండింగ్ ఫైళ్లపై మంత్రులు చకాచకా సంతకాలు చేసినట్టు తెలుస్తోంది. మంత్రులను కలిసేందుకు అధికారులు, సన్నిహితులు రావడంతో అక్కడ పండగ వాతావరణం కనిపించింది. అయితే సామాజిక సమీకరణాలు, జిల్లాల పరంగా కొత్తగా మంత్రి పదవి చేపట్టే వాళ్లు ఎవరో అనే ఉత్కంఠ మాత్రం రాజకీయ వర్గాల్లో కొనసాగుతోంది.
Also Read
- Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
- Andhra Pradesh: గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్.. మంత్రి కీలక వ్యాఖ్యలు..
- Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
- Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
https://ntvtelugu.com/delivery-between-cell-phone-lights-in-narsipatnam-government-hospital/
తాజావార్తలు
-
Amaravati: అమరావతి రైతులకు ప్లాట్ల కేటాయింపు.. ప్రొవిజనల్ సర్టిఫికెట్లు అందజేసిన అధికారులు..
-
PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
Thirukkural: పుతిన్‌కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
-
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
-
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?