సాధారణంగా మనం వంటల్లో ఎర్రకారంపొడిని వాడుతుంటాం. అయితే ఇకపై పచ్చకారంపొడి కూడా అందుబాటులోకి రానుంది. యూపీలోని వారణాసికి చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ పచ్చిమిర్చి పొడిని తయారుచేసే సాంకేతికతను అభివృద్ధి చేసింది. త్వరలోనే పచ్చ కారంపొడిని అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు ఈ కొత్త ఆకుపచ్చని కారానికి సంబంధించిన సాంకేతికతకు IIVR పేటెంట్ హక్కులను కూడా పొందింది. ఆకుపచ్చ కారంపొడిని ఎలా తయారుచేస్తారంటే… తొలుత పచ్చిమిరపకాయలను ప్రత్యేక పద్ధతుల్లో రంగు పోకుండా ఎండబెట్టి కారంపొడి […]
మంచిర్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామంలో ఓ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె ఆత్మహత్యకు ఓ యువకుడు పెట్టిన వాట్సాప్ స్టేటస్ కారణం అని తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే… అచ్చలాపూర్ పంచాయతీ పరిధిలోని కొమ్ముగూడకు చెందిన 17 ఏళ్ల యువతి హైదరాబాద్‌లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇటీవల ఉగాది పండగ సందర్భంగా ఆమె స్వగ్రామానికి వచ్చింది. ఈ సందర్భంగా స్థానికంగా ఉండే యువకుడు అజయ్ ఆమెతో […]
ఏపీలోని శ్రీసిటీలో భారీ పరిశ్రమ కొలువుదీరనుంది. జపాన్ ప్రపంచ నంబర్‌వన్ ఏపీ కంపెనీ డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణానికి చిత్తూరు జిల్లా శ్రీసిటీలో గురువారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సంస్థకు దేశంలోనే ఇది మూడో ప్లాంట్ కాగా.. దక్షిణ భారతదేశంలో మాత్రం మొదటిది కావడం విశేషం. దక్షిణాది రాష్ట్రాల్లో అమ్మకాలకు, ఎగుమతులకు ఆంధ్రప్రదేశ్ కీలక రాష్ట్రమని, దీర్ఘకాలిక వ్యాపారాభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఇక్కడ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు డైకిన్ సంస్థ వెల్లడించింది. భారీ […]
గుంటూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన పెదకాకాని ఆలయంలో అపచారం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఉన్న క్యాంటీన్‌లో మాంసాహారం వండటం వివాదాస్పదంగా మారింది. నిత్యం ఆలయానికి వచ్చే భక్తులకు ఇక్కడి నుంచే అల్పాహారం, అన్నదానానికి భోజనం సరఫరా అవుతాయి. అదే క్యాంటీన్‌లో మాంసాహారం వండటం విమర్శలకు దారితీసింది. ఇటీవల ఓ వ్యక్తి వేలంపాటలో క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను దక్కించుకున్నాడు. అతడి దగ్గర నుంచి అధికార పార్టీకి చెందిన ఎంపీటీసీ భర్త లీజుకుని తీసుకుని ఇప్పుడు ఈ క్యాంటీన్‌ను నడుపుతున్నట్లు […]
ఐపీఎల్ 2022లో కొత్తగా ప్రవేశించిన లక్నోసూపర్ జెయింట్స్ టీమ్ జోరు కొనసాగుతోంది. గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తద్వారా మూడో విజయాన్ని నమోదు చేసింది. తొలుత బౌలింగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను తక్కువ స్కోర్‌కే కట్టడి చేసిన లక్నో.. అనంతరం బ్యాటింగ్‌లో డికాక్ భారీ ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో గెలుపు అందుకుంది. డికాక్ 52 బంతుల్లో 9 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో 80 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో […]
ఏపీలో పరిశ్రమలకు కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. విద్యుత్ డిమాండ్ పెరిగిపోవడంతో ఎస్పీడీసీఎల్ పరిధిలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు అమలు చేస్తున్నట్లు ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు పేర్కొన్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో ఉన్న 253 ప్రాసెసింగ్ పరిశ్రమలు కేవలం 50 శాతం విద్యుత్ మాత్రమే వాడుకోవాలని సూచించారు. 1,696 పరిశ్రమలకు వారంలో ఒక రోజు పవర్ హాలీడే ప్రకటించినట్లు ఆయన చెప్పారు. వీక్లీ హాలీడేకు అదనంగా ఒక రోజు పవర్ హాలిడే పాటించాలని పరిశ్రమలను యాజమాన్యాలకు సీఎండీ కోరారు. […]
★ నేడు నంద్యాలలో సీఎం జగన్ పర్యటన ★ నేడు జగనన్న వసతి దీవెన రెండో విడత నిధుల విడుదల.. 10,68,150 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,024 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్ ★ తిరుమల: నేటి నుంచి టీటీడీ ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదల.. వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనం టిక్కెట్లను విడుదల చేయనున్న టీటీడీ.. ఏప్రిల్ నెల కోటా రోజుకు వెయ్యి చొప్పున విడుదల ★ ఏపీలోని అన్ని జిల్లాలలో నేటి […]
జనాన్ని కట్టి పడేయాలంటే వైవిధ్యాన్ని పట్టేసుకోవాలి.. మరీ చుట్టేసుకోవాలి. అల్లు అర్జున్ అదే పంథాలో పయనిస్తున్నారు. నటనతోనే కాదు, లుక్స్‌తో, వరైటీ కాస్ట్యూమ్స్‌తో, గెటప్స్‌తో స్టైలిష్ స్టార్‌గా జనం మదిలో నిలిచారు అల్లు అర్జున్. బన్నీ వైవిధ్యమే ఆయనను సక్సెస్ రూటులో సాగేలా చేస్తోందని చెప్పవచ్చు. అల్లు అర్జున్ 1982 ఏప్రిల్ 8న మద్రాసులో జన్మించారు. తాత అల్లు రామలింగయ్య మహా హాస్యనటుడు. తండ్రి అల్లు అరవింద్ నిర్మాతగా ఎంతో పేరున్నవారు. మరోవైపు మేనమామ చిరంజీవి అభినయం […]
ఏపీలో త్వరలో కొత్త కేబినెట్ ఏర్పడనుంది. ఈ మేరకు ప్రస్తుత కేబినెట్ సభ్యులు గురువారం రాజీనామాలు చేశారు. తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు సమర్పించారు. అయితే మొత్తం 24 మంది మంత్రుల రాజీనామాలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తనదైన శైలిలో సెటైర్లు వేశారు. జగన్ కేబినెట్‌లోని 24 మంది అసమర్థులు తమ మంత్రి పదవులకు రాజీనామాలు చేశారని ఆయన విమర్శలు చేశారు. అయితే మాజీ మంత్రి దేవినేని ఉమా ఓ […]
ఈనెల 17 నుంచి 24 వరకు కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రాణహిత పుష్కరాలు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లాలోని తుమ్మిడిహెట్టి వద్ద నిర్వహించనున్న ప్రాణహిత పుష్కరాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో గురువారం కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో ఆయన పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అదనపు ఎస్పీ అచ్చేశ్వర్ రావు, అదనపు కలెక్టర్ రాజేశం, వరుణ్‌రెడ్డి హాజరయ్యారు. ప్రాణహిత పుష్కరాలకు భక్తులకు ఎలాంటి […]