ఏపీ వ్యాప్తంగా రేపటి నుంచి వాలంటీర్లకు అధికారులు అవార్డుల సన్మాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లో వాలంటీర్లకు అవార్డులు ప్రదానం చేయనున్నారు. కనీసం సంవత్సర కాలంగా సేవలు అందిస్తున్న వాలంటీర్లకు మూడు కేటగిరీల్లో పురస్కారాలు అందజేయనున్నారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర క్యాటగిరిల్లో వాలంటీర్లకు అవార్డులను ఇవ్వనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,33,333 మంది వాలంటీర్లకు పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. వాలంటీర్లకు పురస్కారాల కోసం రూ.258.74 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుంది. […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలురైతుల ఆత్మహత్యలపై పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు హయాంలో రైతుల ఆత్మహత్యలు జరిగితే పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. చంద్రబాబు రైతులకు ఏం చేశారని పవన్ అప్పుడు మౌనం వహించారన్నారు. తమ ప్రభుత్వం తరహాలో రైతులకు వడ్డీ లేని రుణం ఇచ్చారా? వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చారా అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం సునిశితంగా పరిశీలించి కౌలు […]
కరోనా సంక్షోభంతో దేశంలోని అన్ని రాష్ట్రాలు పెట్టుబడుల విషయంలో అల్లాడుతున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం విదేశీ పెట్టుబడులు పెరిగాయి. తాజాగా ఇన్వెస్ట్ ఇండియా వెలువరించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల్లో ఏపీ అగ్రస్థానంలో నిలవడంతో ఈ విషయం బహిర్గతమైంది. 2019 అక్టోబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు రాష్ట్రంలో 451 అమెరికన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) ఏపీకి వచ్చాయిని ది నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలియేషన్ ఏజెన్సీ ఆఫ్ ది గవర్నమెట్ […]
ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో ఈసారి జాతీయ పార్టీ జెండా ఎగురుతుందా? కానీ టీఆర్‌ఎస్ పార్టీని చిత్తు చేసే సత్తా ఎవరికి ఉంది? గులాబీ దళాన్ని మట్టికరిపించే దమ్ము తమకే ఉందని చెప్పుకుంటున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు కాంపిటీషన్‌గా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంట్రీ ఇస్తోంది. ఇటీవల పంజాబ్‌లో పాగా వేసిన ఆమ్ ఆద్మీ ఇప్పుడు తెలంగాణపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయం సంక్లిష్టంగా ఉంది. అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థి ఎవరు […]
జిల్లాల విభజనతో ఏపీ భౌగోళిక స్వరూపం మారిపోయింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రభుత్వం ప్రకటించడంతో పాత జిల్లాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్రలో జిల్లాల సంఖ్య పెరిగింది. ఒకప్పుడు అతి పెద్ద జిల్లాగా ఉన్న విశాఖ ఇప్పుడు చిన్న జిల్లాగా మారిపోయింది. మరోవైపు రాయలసీమలో ఎన్నడూ ఊహించని మార్పులు జరిగాయి. జిల్లాల విభజన జరిగిన తర్వాత రాయలసీమ పరిధిలోకి సముద్రతీరం రావడం కూడా ఆశ్చర్యపరుస్తోంది. గతంలో నెల్లూరు జిల్లాలో తీరప్రాంతం ఉన్న […]
ఏపీ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల విభాగంలో 4,775 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఈ నియామకాలను అధికారులు కాంట్రాక్ట్ పద్ధతిలో చేపట్టనున్నారు. ఈ ఖాళీలకు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 7న ప్రారంభం అవుతుందని నోటిఫికేషన్‌లో వెల్లడించారు. దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 16వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు […]
టీమిండియా స్టార్ ఆటగాడు రోహిత్ శర్మను మరో రికార్డు ఊరిస్తోంది. బుధవారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో 54 పరుగులు చేస్తే.. టీ20 ఫార్మాట్‌లో 10వేల పరుగులు బాదిన ఆటగాడిగా రోహిత్ ఘనత దక్కించుకుంటాడు. విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 ఫార్మాట్‌లో 10వేల పరుగులు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే ఓవరాల్‌గా చూసుకుంటే టీ20 ఫార్మాట్‌లో 10వేల పరుగులు […]
హైదరాబాద్‌లో పబ్ వ్యవహారం ఇంకా నడుస్తూనే ఉంది. ఇటీవల బంజారాహిల్స్‌లోని రాడిసన్ హోటల్ పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో డ్రగ్స్ దొరకడంతో పోలీసులు సమగ్ర స్థాయిలో విచారణ చేపట్టారు. అయితే అదే పబ్‌లో నిహారిక ఉండటంతో విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో ట్రాన్స్‌జెండర్, బిగ్‌బాస్ కంటెస్టెంట్ తమన్నా సింహాద్రి స్పందించారు. ఎవరో ఒకరు తప్పుచేస్తే పబ్‌కి వెళ్లిన అందరిని దొంగల్లాగా చూస్తున్నారని తమన్నా సింహాద్రి మండిపడ్డారు. పబ్‌కు వెళ్లడమే తప్పు అనే విధంగా నిహారికపై తప్పుడు ప్రచారం […]
ఏపీలో ఇటీవల ప్రభుత్వం 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలతో కలిపి ఏపీలో జిల్లాల సంఖ్య 26కి చేరింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్‌జీడీ) కోడ్‌లను కేటాయించింది. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749, […]
ఏపీలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఏపీ కేబినెట్ విస్తరణ నేపథ్యంలో గవర్నర్‌తో సీఎం జగన్ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై గవర్నర్‌కు సీఎం జగన్ వివరించనున్నారు. ఈనెల 11న కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్సవానికి గవర్నర్ అపాయింట్‌మెంట్‌ను జగన్ కోరనున్నారు. మరోవైపు ఈనెల 7న ప్రస్తుత కేబినెట్‌తో […]