నిర్మల్ జిల్లా పరిషత్ పాలన అదుపు తప్పుతోంది. నిర్మల్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్‌గా కొరిపెల్లి విజయలక్ష్మీ బాధ్యతలు చేపట్టారు. పేరుకు పదవి ఆమెదే అయినా మొత్తం యంత్రాంగాన్ని నడిపించేది ఆమె భర్త రాంకిషన్‌రెడ్డి. జెడ్పీ సీఈవోల నుంచి మండలాల్లో పనిచేసే ఎంపీడీవోలు సైతం తన ఆదేశాల మేరకు పనిచేయాలని రాంకిషన్‌రెడ్డి హుకుం జారీ చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. తనకు తెలియకుండా ఏదైనా ఫైల్ కదిలితే అధికారులపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్లు జిల్లా వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. […]
కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ తర్వాత వైసీపీ నేతల్లో అసమ్మతి బయటపడింది. పలు చోట్ల ఆ పార్టీ నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఈ జాబితాలో మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వంటి మాజీ మంత్రులతో పాటు గొల్ల బాబూరావు, పార్థసారథి, సామినేని ఉదయభాను వంటి కీలక నేతలు ఉన్నారు. ఈ అసమ్మతి వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో సీఎం జగన్ వెంటనే మేల్కొన్నారు. పార్టీలో వివాదాలను పరిష్కరించడంపై ఫోకస్ […]
టెన్నిస్ స్టార్ ప్లేయర్ మరియా షరపోవా తన అభిమానులకు శుభవార్త అందించింది. మంగళవారం నాడు ఆమె 35వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ గుడ్‌న్యూస్‌ను షేర్ చేసింది. తాను త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఈ మేరకు బీచ్‌లో నవ్వుతున్న ఫోటోను పోస్ట్ చేసింది. షరపోవాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4.2 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో ఆమె గుడ్ న్యూస్ చెప్పిన మరుక్షణమే ఈ వార్త వైరల్‌గా […]
ఏపీలో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈరోజు చంద్రబాబు 73వ పుట్టినరోజు. తన బర్త్ డే నుంచే ప్రజాక్షేత్రంలోకి చంద్రబాబు ఎంటర్ అవుతున్నారు. ఈ మేరకు ఈరోజు ఏలూరు జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగుడెం గ్రామంలో పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు. అడవినెక్కలం అంబేద్కర్ నగర్ నుంచి నెక్కలం గొల్లగూడెం వరకు చంద్రబాబు పాదయాత్ర […]
పంజాబ్‌లోని లుథియానాలో బుధవారం తెల్లవారుజామున విషాదం చోటుచేసుకుంది. ఓ ఇంట్లో చెలరేగిన మంటల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవ దహనం అయ్యారు. మరణించిన వారిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉన్నారని తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. లూథియానాలోని టిబ్బా రోడ్డులో మున్సిపల్ డంప్ యార్డుకు సమీపంలో గల గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున 3 గంటలకు గుడిసెకు నిప్పు అంటుకున్న విషయంపై […]
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మరింత తీవ్రరూపం దాలుస్తోంది. ఆయుధాలు వీడాలంటూ ఎన్ని అల్టీమేటంలు జారీ చేసినా తమ దారికి వచ్చేందుకు ఉక్రెయిన్ సైన్యం ససేమిరా అంటుండటంతో ఆగ్రహించిన రష్యా.. మంగళవారం నాడు ఉక్రెయిన్‌లోని అన్ని ప్రాంతాల్లో విచక్షణారహితంగా దాడులకు పాల్పడింది. రష్యాకు ఆనుకుని ఉన్న ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాలు, మరికొన్ని పట్టణాలపై క్షిపణుల వర్షం కురిపించింది. 24 గంటల వ్యవధిలో దాదాపుగా వెయ్యి ప్రాంతాల్లో దాడులు చేసినట్లు రష్యా ప్రకటించింది. తమ మధ్య యుద్ధంలో కొత్త దశ […]
ఏపీలో కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. అయితే సంక్షేమ పథకాలు పొందడానికి ఆధార్ కార్డులను అధికారులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో పాత జిల్లా పేర్ల స్థానంలో కొత్త జిల్లా పేర్లను చేర్చే విషయంపై అధీకృత సంస్థతో చర్చిస్తున్నామని ఏపీ సీసీఎల్‌ఏ కార్యదర్శి బాబు వివరించారు. ఆధార్ కార్డులో చిరునామా మార్పుపై మంగళవారం సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆధార్ కార్డులో మార్పు చేర్పులకు సంబంధించి పలు అంశాలపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు. మండలం, […]
ఐపీఎల్ 2022 సీజన్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ప్రదర్శన బాగానే ఉన్నా ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆట తీరే అభిమానులను అసంతృప్తికి గురిచేస్తోంది. ఆర్‌సీబీ ఫ్రాంచైజీ రూ.15 కోట్లు కుమ్మరించి కోహ్లీని రిటైన్ చేసుకుంది. అయితే అతడు మాత్రం పేలవ ఆటతీరుతో విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అంతర్జాతీయంగానూ కోహ్లీ విఫలమవుతున్నా.. ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన చేస్తాడని బెంగళూరు ఫ్రాంచైజీ నమ్మకం పెట్టుకుంది. కానీ ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కోహ్లీ బ్యాటింగ్ యావరేజ్ 23.80గా […]
బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధర ఆల్‌టైం గరిష్టానికి చేరుకుంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,840కి చేరుకుంది. మరోవైపు 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల ధర రూ.49,850గా నమోదైంది. వెండి రేటు కూడా బంగారం ధర మాదిరిగానే పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.75వేలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర గత రెండు వారాలుగా క్రమంగా […]
అమరావతిలోని తుళ్లూరు మండలం రాయపూడిలో మంగళవారం సాయంత్రం పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఓ వాహనాన్ని పోలీసులు ఆపారు. అయితే తాను ఎంపీ నందిగం సురేష్ బంధువును అని.. తన వాహనాన్నే ఆపుతారా అంటూ సుధీర్ అనే వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. వెంటనే ఎంపీ సురేష్‌కు అతడు ఫోన్ చేసి విషయం చెప్పాడు. దీంతో వాహన తనిఖీలు చేస్తున్న కానిస్టేబుల్‌ను తన ఇంటికి వచ్చి కలవాలని ఎంపీ సురేష్ ఆదేశాలు ఆరీ చేశారు. […]