ఏపీలో కేబినెట్ పునర్‌వ్యవస్థీకరణ సందర్భంగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతల్లో విభేదాలు బయటపడుతున్నాయి. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అభినందన సభలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఆరోపణలు చేశారు. మూడేళ్లుగా జిల్లాలో ఇరిగేషన్‌కు సంబంధించి ఆశించిన మేర అభివృద్ధి జరగలేదంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆనం వ్యాఖ్యలకు తాజాగా అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో రూ.3 వేల కోట్లతో నీటిపారుదల పనులు జరుగుతున్నాయని […]
వైసీపీలో మంత్రి పదవి దక్కని నేతల్లో అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు. తాజాగా అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కోటవురట్లలో సోమవారం వాలంటీర్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. కేబినెట్‌లో చోటు విషయంపై తనకు ముమ్మాటికీ అన్యాయం జరిగిందన్నారు. మంత్రి పదవి ఇవ్వకుండా అధిష్టానం దెబ్బకొట్టిందని.. తానూ అవకాశం వచ్చినప్పుడు దెబ్బకొడతానని అన్నారు. వైఎస్ఆర్ చనిపోయిన తరువాత హింసావాదంతో తాను జగన్ ఏర్పాటు చేసిన వైసీపీలో జాయిన్ […]
కళ్యాణదుర్గంలో తన ర్యాలీలో ఓ చిన్నారి మృతి పట్ల మంత్రి ఉషశ్రీచరణ్ స్పందిస్తూ.. చిన్నారిని అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. వైసీపీ ప్రభంజనానికి భయపడి శవరాజకీయం చేస్తున్న వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నానని.. వారిని ఆంజనేయస్వామే చూసుకుంటాడని వ్యాఖ్యలు చేశారు. అయితే మంత్రి ఉషశ్రీచరణ్ వ్యాఖ్యలకు టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తండ్రి చనిపోతే మూడేళ్ల పాటు శవ రాజకీయాలు చేసింది జగన్మోహన్‌రెడ్డి అని జేసీ ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. తాడిపత్రికి […]
చిత్తూరు జిల్లా కుప్పంలో రెండు రోజుల క్రితం అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారిని సోమవారం నాడు పోలీసులు అడవిలో గుర్తించారు. కుప్పం మండలం కంగుంది పంచాయతీ శివారు నక్కలగుంట గ్రామానికి చెందిన మణి, కవిత కుమార్తె జోషిక (4) శనివారం సాయంత్రం ఇంటి నుంచి ఆడుకుంటూ బయటకు వెళ్లి కనిపించకుండా పోయింది. చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పలమనేరు డీఎస్పీ గంగయ్య నేతృత్వంలో పోలీసులు చిన్నారి ఆచూకీ కోసం […]
ఐపీఎల్‌లో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు మంచి వినోదాన్ని అందించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ చాహల్ తన ఐపీఎల్ కెరీర్‌లో తొలిసారి హ్యాట్రిక్ సాధించాడు. ఓవరాల్‌గా మాత్రం ఐపీఎల్ చరిత్రలో చాహల్ నమోదు చేసింది 21వ హ్యాట్రిక్ కావడం విశేషం. చాహల్ కంటే ముందు పలు ఆటగాళ్లు హ్యాట్రిక్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. అటు రాజస్థాన్ తరఫున హ్యాట్రిక్ నమోదు చేసిన బౌలర్లలో చాహల్ 5వ ఆటగాడు. […]
తెలంగాణ హైకోర్టులో వివిధ క్యాటగిరీలకు చెందిన ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో 779 అదనపు పోస్టులకు మంజూరు ఇస్తూ ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరైన పోస్టుల్లో రిజిస్ట్రార్ (ఇన్‌ఫ్రాస్ట్రక్చర్) 1, జాయింట్ రిజిస్ట్రార్ 3, డిప్యూటీ రిజిస్ట్రార్ 5, అసిస్టెంట్ రిజిస్ట్రార్ 4, సెక్షన్ ఆఫీసర్స్/స్క్రూటినీ ఆఫీసర్స్ 96, కోర్టు మాస్టర్స్/పీఎస్ టు జడ్జెస్ 59, డిప్యూటీ సెక్షన్ ఆఫీసర్స్/ట్రాన్స్‌లేటర్ 78, కంప్యూటర్ ఆపరేటర్ 12, […]
ఏపీకి భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శుభవార్త అందించింది. ఏటా జూన్ నుంచి మొదలయ్యే నైరుతి రుతుపవనాల సీజన్‌లో దేశ వ్యాప్తంగా ఈ ఏడాది సాధారణ వర్షాలు కురుస్తాయని చెప్పిన ఐఎండీ.. ఏపీలో మాత్రం సాధారణం కంటే అధికంగా వర్షాలు పడతాయని తెలిపింది. గడిచిన మూడేళ్లుగా ఏపీలో అటు నైరుతి, ఇటు ఈశాన్య రుతుపవనాల సీజన్‌లో మంచి వర్షాలే పడుతున్నాయి. ఫలితంగా పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటున్నాయి. గత ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే […]
అమెరికా వెళ్లి చదువుకోవాలని భావిస్తున్న విద్యార్థులకు శుభవార్త అందింది. విద్యార్థి వీసా స్లాట్ల సంఖ్యను అమెరికా భారీగా పెంచింది. దీంతో పాటు వెయిటింగ్ సమయాన్ని కూడా భారీగా తగ్గించింది. ఇటీవల ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అమెరికా వీసా స్లాట్ల కోసం సుమారు మూడేళ్ల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కాన్సులేట్ కార్యాలయం పరిధి నుంచి అమెరికా వెళ్లే విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వెయిటింగ్ సమయాన్ని అమెరికా […]
నేడు ఏపీ సీఎం జగన్ విశాఖ వెళ్లనున్నారు. విశాఖలో ఆయమన హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో సమావేశం కానున్నారు. సుమారు రెండు గంటల పర్యటన కోసం సీఎం జగన్ విశాఖకు వెళ్తున్నారు. ఉ.11:10 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న ఆయన అక్కడ సుమారు గంటల పాటు జిల్లా నాయకులతో భేటీ కానున్నారు. అనంతరం రుషికొండలోని పెమా వెల్‌నెస్ సెంటర్‌కు వెళ్లి అక్కడ నేచురోపతి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న హర్యానా సీఎంను కలవనున్నారు. మధ్యాహ్నం 1:20 గంటలకు జగన్ తాడేపల్లికి […]
★ విశాఖలో నేడు సీఎం జగన్ పర్యటన.. నేడు హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌తో భేటీ కానున్న సీఎం జగన్ ★ విశాఖ: నేటి నుంచి రెండు రోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన.. పద్మనాభం మండలం పాండ్రంగిలో అల్లూరి సీతారామరాజు స్వస్థలం, ఇంటిని సందర్శించనున్న వెంకయ్య.. సాయంత్రం ప్రేమ సమాజం వేడుకల్లో పాల్గొననున్న ఉపరాష్ట్రపతి ★ గుంటూరు: చెరుకుపల్లిలో నేడు గ్రామ వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం.. హాజరుకానున్న రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు ★ శ్రీకాకుళం: […]