బంగారం ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయ నెలకొన్న పరిస్థితుల కారణంగా బంగారం ధర ఆల్‌టైం గరిష్టానికి చేరుకుంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,840కి చేరుకుంది. మరోవైపు 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం 10 గ్రాముల ధర రూ.49,850గా నమోదైంది. వెండి రేటు కూడా బంగారం ధర మాదిరిగానే పెరుగుతూ వస్తోంది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.75వేలుగా ఉంది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర గత రెండు వారాలుగా క్రమంగా పెరుగుతూ వస్తోంది. గత వారంలో గోల్డ్ రేటు 1.37 శాతం పైకి చేరింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధ భయాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు వంటి అంశాలు బంగారం ధరకు రెక్కలు జోడించాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం మార్చి నెలలో 8.5 శాతానికి చేరింది. ఈ పరిణామాలతో 1981 నుంచి బంగారం ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. చూస్తుంటే త్వరలోనే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిపుణులు అంచనా వేస్తున్నట్లు రూ.60వేలకు చేరే అవకాశం కనిపిస్తోంది. అటు బంగారం ధర పెరుగుతుండటంతో కొనాలో, కొనకూడదో అన్న మీమాంశలో కొనుగోలుదారులు గందరగోళానికి గురవుతున్నారు.