ఒంగోలులో ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్‌పై ఏపీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. సీఎం కాన్వాయ్ కోసమంటూ తిరుమల వెళ్తున్న ఓ కుటుంబాన్ని ఆపి వాహనాన్ని తీసుకెళ్లిన ఉదంతంపై చర్యలు చేపట్టారు. వాహనాలను ఆపిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం రాత్రి వినుకొండ నుంచి తిరుమల వెళ్తున్న ఓ కుటుంబం టిఫిన్ కోసం ఒంగోలులో ఆగింది. అక్కడికి వచ్చిన ఓ కానిస్టేబుల్ సీఎం జగన్ పర్యటనకు కాన్వాయ్ కావాలంటూ వాహనాన్ని, […]
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వ్యవహారంపై గురువారం ఉదయం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై వాదోపవాదాలు జరిగాయి. ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎంతకాలం కొనసాగిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రెండేళ్లకు మించి సస్పెన్షన్ చేయకూడదన్న నిబంధనలు గమనించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన నిర్దేశాలు కోరామని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. సస్పెన్షన్ కొనసాగించేందుకు నిర్దేశాలు కోరినట్లు […]
విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వాస్పత్రిలో పనిచేస్తున్న ప్రియుడిని కలిసేందుకు వెళ్లిన వాంబే కాలనీ అమ్మాయిపై తన స్నేహితులతో కలిసి ప్రియుడు అత్యాచారం చేయడం స్థానికంగా కలకలం రేపింది. ప్రియుడితో పాటు అతడి ఇద్దరి స్నేహితులు కలిసి ఆస్పత్రిలోనే యువతిపై గ్యాంగ్ రేప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తన కుమార్తెపై విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారని ఎన్టీవీతో బాధితురాలి తల్లి వెల్లడించింది. […]
అమరావతి సచివాలయంలో నూతన వ్యవసాయ శాఖ మంత్రిగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రూ.1,395 కోట్లతో 3.75 లక్షల ఎకరాలకు మైక్రో ఇర్రిగేషన్ అవకాశం కల్పించే ఫైలుపై మొదటి సంతకం చేశారు. అంతేకాకుండా 3500 ట్రాక్టర్లను వైఎస్ఆర్ యంత్ర పథకం కింద ఇచ్చే ఫైలుపై రెండో సంతకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ మంత్రిగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 43 వేల […]
ఈరోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులంటే అందరికీ చులకన భావనే ఉంటుంది. సమయానికి ఉద్యోగానికి రాని ఉద్యోగులను ఎంతో మందిని చూస్తుంటాం. అయితే సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లోని డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కాలేజీకి రంగులు వేయించడానికి నిధులు లేకపోవడంతో స్వయంగా ఆయనే పెయింట్ బ్రష్ చేతపట్టుకుని రంగులు వేస్తున్నారు. దీంతో నెటిజన్‌లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గురువారం ఉదయం స్థానికులు హుజూర్ నగర్ జూనియర్ కాలేజీ, డిగ్రీ కళాశాల గ్రౌండ్‌కు వాకింగ్‌కు వెళ్లగా అక్కడ ఆశ్చర్యపోయే సీన్ […]
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. ఈ మేరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా బోరిస్ జాన్సన్‌కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో బోరిస్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భారత్- బ్రిటన్ మధ్య వాణిజ్య, ప్రజా సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్రకటన చేయనున్నారు. ఈ సమావేశం […]
తిరుమలలో ప్రస్తుతం భక్తుల రద్దీ తగ్గింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో మూడు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. శ్రీవారి సర్వదర్శనానికి మూడు గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ వెల్లడించింది. కంపార్టుమెంట్లలోని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నప్రసాదం, పాలు, తాగునీటి సరఫరా చేస్తున్నట్లు వివరించింది. శ్రీవారిని బుధవారం నాడు 66,745 మంది భక్తులు దర్శించుకున్నారని.. 30,780 మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించింది. హుండీ ద్వారా స్వామివారికి రూ.5.14 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ పేర్కొంది. మరోవైపు […]
వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం విండీస్ జట్టుకు వన్డే కెప్టెన్‌గా ఉన్న పొలార్డ్ 15 ఏళ్లుగా తన దేశానికి ఆడుతున్నందుకు గర్వంగా ఉందని పేర్కొన్నాడు. విండీస్ జట్టుకు కెప్టెన్‌గా ఉండటం తన జీవితంలో మరపురాని అనుభూతిగా పొలార్డ్ అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా టీ20, టీ10 లీగ్‌లకు అందుబాటులోనే ఉంటానని తెలిపాడు. అయితే ఐపీఎల్ జరుగుతున్న వేళ పొలార్డ్ తన ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ను ప్రకటించడం క్రికెట్ వర్గాలను […]
ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెం గ్రామంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన గ్రామ సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తనకు మాట్లాడే అవకాశం కల్పించాలంటూ గ్రామ సభకు వచ్చిన వైసీపీ ఎంపీటీసీ కాజా రాంబాబు విజ్ఞప్తి చేశారు. తాను వైసీపీలోనే ఉంటూ గ్రామంలో జరిగిన రూ.75 లక్షల అవినీతిపై పోరాడుతున్నట్లు రాంబాబు చెప్పడంతో చంద్రబాబు ఆయనకు మాట్లాడే అవకాశం కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకా ప్రతాప్ తనయుడు అవినీతికి పాల్పడ్డాడంటూ చంద్రబాబుకు […]