మాజీ మంత్రి, బీజేపీ నేత రావెల కిషోర్‌బాబు తిరిగి టీడీపీ గూటికి చేరతారనే వార్తలు వినిపిస్తున్నాయి. గుంటూరులో మంగళవారం నాడు టీడీపీ అధినేత చంద్రబాబును రావెల కిషోర్‌బాబు కలిసి మంతనాలు జరిపారు. దీంతో ఆయన టీడీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసి రావెల ఓటమి పాలయ్యారు. ఎన్నికల తర్వాత రావెల జనసేనకు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. అయితే కొంతకాలంగా ఆయన మళ్లీ టీడీపీలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. […]
ఈనెల 21న ఏపీ సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూల్‌ను సీఎంవో కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరనున్న సీఎం జగన్ ఉదయం 10:50 గంటలకు బలభద్రపురంలోని గ్రాసిం పరిశ్రమ ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఉదయం 11:05 గంటలకు పరిశ్రమ ప్లాంట్‌కు చేరుకుని 15 నిమిషాలపాటు పరిశ్రమను పరిశీలించనున్నారు. ఉదయం 11:25 గంటలకు పరిశ్రమను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:25 గంటలకు తిరిగి హెలిప్యాడ్‌కు చేరుకుని […]
★ నేడు ఏలూరు జిల్లాలో చంద్రబాబు పర్యటన.. ఆగిరిపల్లి మండలం నెక్కలం గొల్లగూడెంలో పర్యటించనున్న చంద్రబాబు.. అడవినెక్కలం అంబేద్కర్ నగర్ నుంచి నెక్కలం గొల్లగూడెం వరకు పాదయాత్ర.. అనంతరం రచ్చబండ కార్యక్రమం.. ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న చంద్రబాబు.. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేయనున్న బాబు ★ నేడు విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ VCICపై కేంద్రం సమీక్ష.. హాజరుకానున్న కేంద్ర పరిశ్రమల శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాష్ ★ తిరుపతి: పుంగనూరు అంజుమన్ షాది మహల్‌లో […]
టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమానికి అన్ని వైపుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. తాజాగా కోయంబత్తూరులోని ప్రఖ్యాత ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు ఎంపీ సంతోష్ కుమార్‌ను మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో కలిశారు. సద్గురు ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవ్ సాయిల్’ ఉద్యమానికి మద్దతివ్వాలని ఎంపీ సంతోష్‌ను ఈశా ఫౌండేషన్ ప్రతినిధులు ప్రసాద్, శైలజ, రాఘవ కోరారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. పుడమి పచ్చదనం పెంచడమే లక్ష్యంగా […]
విశాఖ పర్యటనలో సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. అనకాపల్లి, విశాఖ పార్లమెంట్ అధ్యక్షులను మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీకి అవకాశం కల్పిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ఎయిర్ పోర్టులో నేరుగా ఈ విషయాన్ని అవంతి, ధర్మశ్రీకి జగన్ చెప్పారు. ఇటీవల కేబినెట్‌లో స్థానం లభిస్తుందని ధర్మశ్రీ, రెండోసారి అవకాశం లభిస్తుందని అవంతి శ్రీనివాస్ భావించారు. కానీ ఆ అవకాశం దక్కకపోవడంతో వారిద్దరి సేవలను విశాఖ, అనకాపల్లి పార్లమెంట్ […]
ఏపీలో పదో తరగతి పరీక్షలు ఈనెల 27 నుంచి మే 9 వరకు జరగనున్నాయి. ఈ మేరకు పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్లను సిద్ధం చేశామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు దేవానందరెడ్డి వెల్లడించారు. హాల్‌టిక్కెట్లను bse.ap.gov.in వెబ్‌సైట్‌లో పెట్టామని.. అన్ని స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు వీటిని డౌన్‌లోడ్ చేసి వాటిపై సంతకాలు చేసి విద్యార్థులకు అందజేయాలని ఆయన కోరారు. విద్యార్థుల ఫోటోలు సరిగ్గా లేకపోతే సరైనవి అంటించి వాటిపై సంతకాలు చేసి ఇవ్వాలన్నారు. ఈ వివరాలను ప్రభుత్వ […]
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌పై టీడీపీ ఎమ్మెల్యే, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీ గవర్నర్ ఉత్సవ విగ్రహంలా మారారని ఆరోపించారు. వచ్చిన ప్రతి ఫైలుపై గవర్నర్ గుడ్డిగా సంతకం పెట్టేస్తున్నారని.. ఇది సరికాదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. కాగ్ నివేదికలు గవర్నర్ వద్దకు వెళ్తే.. వాటి గురించి ప్రభుత్వాన్ని ఆయన ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. శ్రీలంక పరిస్థితులు ఏపీలోనూ కనిపిస్తున్నాయని విమర్శించారు. మరోవైపు ఏపీని వైసీపీ […]
ఐపీఎల్‌లో సోమవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ హోరాహోరీగా సాగింది. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా ఓపెనర్ అరోన్ ఫించ్ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే కోల్‌కతా ఇన్నింగ్స్ 9వ ఓవర్‌లో రెండు బౌండరీలు కొట్టి ఊపు మీద ఉన్న ఫించ్‌ను రాజస్థాన్ బౌలర్ ప్రసిధ్ కృష్ణ అవుట్ చేశాడు. దాంతో సహనం కోల్పోయిన ఫించ్ ప్రసిధ్ కృష్ణపై నోరు పారేసుకున్నాడు. పెవిలియన్‌కు వెళ్తూ సూటిపోటి మాటలతో కవ్వించాడు. ఈ నేపథ్యంలో ప్రసిధ్ […]
ఏపీలో మంత్రివర్గంలో శాఖలు మారుస్తారని జరుగుతున్న ప్రచారంపై మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. మంత్రివర్గంలో శాఖలు మారుస్తారన్న సమాచారం తమకు లేదని వివరణ ఇచ్చారు. తనకు అప్పగించిన మున్సిపల్ శాఖ బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షలు కూడా ప్రారంభించామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. వారి కుటుంబంలో జరుగుతున్న వివాహ పనుల్లో బిజీగా ఉండటం వల్ల కొంత జాప్యం జరిగిందన్నారు. ప్రకాశం జిల్లాలో సీఎం […]
తమిళనాడు సీఎం స్టాలిన్, ఆయన అల్లుడు శబరీశన్‌పై మాజీ డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి జయరామన్ వేసిన పరువు నష్టం కేసు విచారణపై మద్రాసు హైకోర్టు స్టే విధించింది. కోయంబత్తూరు జిల్లా పొల్లాచ్చి ప్రాంతంలో మహిళలను, విద్యార్థినులను లైంగిక వేధింపులకు గురి చేసి, వీడియోలను తీసి బెదిరించిన ఘటనల్లో జయరామన్ కు సంబంధాలు ఉన్నాయంటూ సీఎం స్టాలిన్, శబరీశన్ విమర్శించినట్టు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన పరువుకు భంగం కలిగించారంటూ మాజీ డిప్యూటీ […]