హైదరాబాద్ నగరంలో నేటి నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ జాయింట్ సీపీ ఏవీ రంగనాథ్ వెల్లడించారు. నగరంలో నాలాల మరమ్మతుల కారణంగా నేటి నుంచి జూన్ 4 వరకు సికింద్రాబాద్ సీటీవో జంక్షన్ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. రసూల్‌పురా నాలా మరమ్మతుల కారణంగా.. సీటీవో జంక్షన్ నుంచి రసూల్‌పురా వెళ్లే వాహనాలను హనుమాన్ దేవాలయం నుంచి ఎడమ వైపునకు మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా రసూల్‌పురా నుంచి కిమ్స్ ఆస్పత్రి మీదుగా […]
శ్రీశుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత బుతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, గురువారం.. రాశి ఫలాలు ఎలా ఉన్నాయి..? ఈ రోజు ఏ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు…? ఏ రాశివారు జాగ్రత్త వహించాలి..? ఏ రాశివారు ఏం చేస్తే మంచి ఫలితాలు రాబోతున్నాయి… ఈరోజు ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=GPQoaY6UKh0
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దులో ఉన్న శ్రీశైలం జలాశయానికి అంచనాలకు మించి వచ్చే వరద నీటిని మళ్లించడానికి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని నిపుణుల కమిటీ హెచ్చరించింది. లేకపోతే శ్రీశైలం డ్యామ్ భద్రతకే ముప్పు వాటిల్లుతుందని కమిటీ స్పష్టం చేసింది. కొత్తగా స్పిల్ వే నిర్మించడం లేదా డ్యాం ఎత్తు పెంచడం, కుడి కాల్వ, ఎడమ కాల్వల నుంచి నీటిని మళ్లించేందుకు ఏర్పాట్లు చేయడం వంటి అంశాలను పరిశీలించాలని నిపుణుల కమిటీ కీలక సూచనలు చేసింది. ప్లంజ్‌పూల్ సహా […]
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 115 పరుగులకే ఆలౌటైంది. జితేష్ శర్మ (32), మయాంక్ అగర్వాల్ (24) టాప్ స్కోరర్లు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, లలిత్ యాదవ్ తలో రెండు వికెట్లు తీశారు. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. అనంతరం […]
★ నేడు తూ.గో. జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. బలభద్రపురంలో గ్రాసిమ్ ఇండస్ట్రీ కంపెనీ యూనిట్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ ★ ఒంగోలులో నేడు బీజేపీ మహాధర్నా.. బీజేపీ కార్యకర్తలపై పెట్టిన కేసులకు నిరసనగా ధర్నా ★ నేడు గద్వాలకు చేరుకోనున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర.. ఈరోజు సాయంత్రం గద్వాల మైదానంలో బీజేపీ భారీ బహిరంగ సభ ★ సికింద్రాబాద్ సీటీవో జంక్షన్‌లో నేటి నుంచి జూన్ 4 వరకు […]
మీరు జియో ఫైబర్ వాడుతున్నారా.. అయితే జియో ఫైబర్ వినియోగదారుల కోసం రిలయన్స్ జియో సంస్థ కొత్త ప్లాన్‌లను ప్రకటించింది. ఈ మేరకు వినియోగదారులు నెలకు రూ.200 అదనంగా చెల్లిస్తే 14 ఓటీటీ యాప్స్‌ను ఉచితంగా సబ్‌స్క్రిప్షన్ చేసుకోవచ్చని జియో వెల్లడించింది. ఈ జాబితాలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5, సోనీ లివ్, ఊట్, సన్ నెక్ట్స్, డిస్కవరీ ప్లస్, ఎరోస్ నౌ, జియో సినిమా వంటి ప్రముఖ ఓటీటీ యాప్‌లు ఉన్నాయి. జియో ఫైబర్ పోస్ట్ […]
కరోనా లాక్‌డౌన్ హీరో సోనూసూద్ మంచి మనసు గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో అంకుర హాస్పిటల్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా సోనూసూద్ వ్యవహరిస్తున్నాడు. తెలుగు రాష్ట్రాల్లో తాజాగా తమ 12వ ఆస్పత్రిని అంకుర హాస్పిటల్స్ సంస్థ ప్రారంభించనుంది. ఈ ఏడాదిలోనే మరో నాలుగు ఆస్పత్రులను అంకుర సంస్థ ప్రారంభించనుంది. ఈ మేరకు తమ హాస్పిటల్స్ విస్తరణపై అంకుర యాజమాన్యం హైదరాబాద్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సోనూసూద్, అంకుర ఎండీ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ […]
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుపై చెత్తవాగుడు వాగేవారిని ఆయన హెచ్చరించారు. చంద్రబాబు కోసం 100 మందితో సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎవరైనా అనవసరంగా నోరు పారేసుకుంటే చంపడానికైనా, చావడానికైనా సూసైడ్ బ్యాచ్ సిద్ధంగా ఉందని తెలిపారు. వచ్చే రెండేళ్ల పాటు చంద్రబాబు కుటుంబంపై పిచ్చి వేషాలు చేసే వైసీపీ బ్యాచ్ […]
జగన్ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో రేషన్ బియ్యం బదులు ప్రజలకు నగదు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంలో కుట్ర కోణం దాగి ఉందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం పేదల జీవితాలతో ఆటలాడుతోందంటూ మండిపడ్డారు. నగదు బదిలీ విషయంలో ప్రజలపై బలవంతంగా ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోందని విమర్శలు చేశారు. ఈ అంశంపై అధికారులు సర్వే నిర్వహిస్తే ఎక్కువ మంది బియ్యమే కావాలని కోరుతున్నారని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. ఉదాహరణకు […]