CM Jagan Birthday: సీఎం జగన్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan Birthday: ఏపీ సీఎం జగన్ ఈరోజు 50వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలో వైసీపీ నేతలు కేక్ కట్ చేసి తమ అభిమాన నేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీఎం జగన్‌కు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలే కాకుండా ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా సోషల్ మీడియా ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
‘బర్త్ డే గ్రీటింగ్స్ టు వైఎస్ జగన్’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ట్విట్టర్లో విషెస్ పోస్ట్ చేశారు. ‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ పవన్ పేర్కొన్నారు. ఆ భగవంతుడు జగన్‌కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నట్లు పవన్ ఆకాంక్షించారు. అటు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ బర్త్ డే వేడుకల కోలాహలం నెలకొంది. అక్కడ జరిగిన వేడుకల్లో సీఎం జగన్‌తో మంత్రులు, అధికారులు కేక్ కట్ చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, తానేటి వనిత, విడదల రజని, జోగి రమేష్, రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలిపి ఆయనకు కేక్ తినిపించారు.
Also Read
- Veera Siva Reddy: కడప రాజకీయాల్లో సంచలనం.. చంద్రబాబు, లోకేష్‌పై బీజేపీ నేత హాట్ కామెంట్స్!
- Kakinada Municipal Corporation Elections: కాకినాడ కౌంటింగ్‌పై ఎస్ఈసీ కీలక ఆదేశాలు.. వారికి నో ఎంట్రీ!
- AP Panchayat Elections 2026: రేపే రెండో విడత పల్లె పోరు.. బరిలో 10,295 మంది సర్పంచ్ అభ్యర్థులు.. నిఘా నీడలో పోలింగ్..!
- Delimitation Bill: డీలిమిటేషన్ బీజేపీ రాజకీయ కుట్ర.. ఏపీకి 25 ఎంపీ సీట్ల నష్టం..!
Birthday greetings to @ysjagan.
— N Chandrababu Naidu (@ncbn) December 21, 2022
https://twitter.com/JanaSenaParty/status/1605479450174296064
తాజావార్తలు
-
AA23: బన్నీ మూవీలో క్రేజీ రైటర్.. లోకీ మాస్టర్ ప్లాన్!
-
Tollywood Movies: స్టార్ హీరోలతో డైరెక్టర్ల ప్రయోగం సక్సెస్.. కానీ?
-
Jr NTR: త్రివిక్రమ్, అనిల్ రావిపూడి.. ఎన్టీఆర్ సినిమా ఎవరితో?
-
Hockey India: హాకీ ఇండియా ఎన్నికలకు సుప్రీంకోర్టు పచ్చజెండా.. డిసెంబర్ 5నే పోలింగ్..
-
Bronson Reed: రెజ్లింగ్ ప్రపంచంలో తీవ్ర విషాదం.. ప్రముఖ WWE స్టార్ కన్నుమూత..
ట్రెండింగ్
-
Viral Video: గూస్ బంప్స్ గ్యారెంటీ.. స్విట్జర్లాండ్ వేదికపై మార్మోగిన ‘బ్రహ్మమొక్కటే’..!
-
402 కి.మీ. రేంజ్, 218 hp పవర్ తో కరీనా కపూర్ చేతుల మీదుగా కొత్త Mini Cooper SE లాంచ్..! ధర ఎంతంటే.?
-
IND vs NZ: ముగిసిన రెండో రోజు ఆట.. కివీస్ పేసర్ల దెబ్బకు టీమిండియా కుదేలు..!
-
Yashasvi Jaiswal: పరుగులతోనే కాదు.. డకౌట్‌తో కూడా రికార్డు సృష్టించిన యశస్వి..!
-
Coorgi Roti Recipe: ఇంట్లో అన్నం మిగిలిపోయిందా? పారేయకుండా ఈ టేస్టీ రొటీలు ట్రై చేయండి!