Team India: సూర్యకుమార్ టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేయబోతున్నాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: టీమిండియా మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం టీ20 క్రికెట్లో దుమ్మురేపుతున్నాడు. ఐసీసీ ర్యాంకుల్లోనూ నంబర్‌వన్‌గా కొనసాగుతున్నాడు. బంతి ఎటువైపు వేసినా సూర్యకుమార్ సిక్సర్లు దంచుతున్నాడు. వినూత్నమైన షాట్లతో అలరిస్తున్నాడు. అతడి స్ట్రైక్‌రేట్‌తో పాటు యావరేజ్ కూడా ఎక్కువగానే ఉంటోంది. టీ20 క్రికెట్ తరహాలో సూర్యకుమార్ వన్డేల్లోనూ తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో త్వరలోనే అతడు టెస్టుల్లో అరంగేట్రం చేస్తాడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మిడిలార్డర్లో అతడికి అవకాశం ఇస్తారని అంటున్నారు.
Read Also: Raviteja: రవితేజ నోటి దూల.. ఆ డైరెక్టర్ ను కల్లు తాగిన కోతి అంటూ
Also Read
- Babar Azam: ‘శనగలు అమ్మడానికి వచ్చావా..?’ పాపం బాబర్ ఆజం పరువుపోయిందిగా..
- Mohammed Siraj: కెప్టెన్‌గా మహ్మద్ సిరాజ్ ఎంపిక.. అక్టోబర్ 11న తొలి మ్యాచ్..
- Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
- Sahil Chauhan: 27 బంతుల్లో సెంచరీ.. టీ20 క్రికెట్లో ప్రపంచ రికార్డు.. అతడికి ఇండియాతో సంబంధం ఏంటి..?
అయితే టెస్ట్ క్రికెట్‌లో ప్రస్తుతం పోటీ బాగానే ఉంది. పుజారా, కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్‌లతో మిడిలార్డర్ పటిష్టంగానే కనిపిస్తోంది. మరి సూర్యకుమార్ ఎంట్రీ ఇస్తే ఎక్కడ ఆడిస్తారు అని అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే సూర్యకుమార్ టెస్ట్ క్రికెట్ ఎంట్రీకి ఇంకా సమయం ఉందని.. కోహ్లీ, పుజారాలలో ఒకరు తప్పుకున్న తర్వాతే సూర్యకుమార్ టెస్టు జట్టులోకి వస్తాడని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం రంజీ ట్రోఫీలోనూ సూర్యకుమార్ అదరగొడుతున్నాడు. హైదరాబాద్ జట్టుపై 80 బంతుల్లో 15 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 90 పరుగులు చేశాడు.
మరోవైపు వెస్టిండీస్‌తో 7 టీ20ల సిరీస్ నుంచి దూకుడు మొదలు పెట్టిన సూర్యకుమార్ యాదవ్.. టీ20 ప్రపంచకప్ వరకు తన ఫామ్ కొనసాగించాడు. ఆసియా కప్‌లోనూ అదరగొట్టాడు. ప్రతీ సిరీస్‌లో మెరిసిన సూర్య.. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ ఏడాది భారత క్రికెట్‌కు కలిసి రాకున్నా.. సూర్యకు మాత్రం బాగా కలిసొచ్చింది.
తాజావార్తలు
-
Inverter Safety : ఇంట్లో ఇన్వర్టర్ ఉందా? దాని పక్కన ఈ వస్తువులు ఉంచితే పేలుడే..!
-
Lift Accident : లిఫ్ట్‌లో అడుగు పెట్టగానే మృత్యు ఉచ్చు.. గంటన్నరపాటు హైడ్రా రెస్క్యూ!
-
IPS Transfers: ఏపీలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. వివరాలిలా..
-
Vidya Balan: నెల్సన్ మార్క్ సర్ప్రైజ్.. ‘జైలర్ 2’లోకి విద్యాబాలన్ మాస్ ఎంట్రీ! ఫస్ట్ లుక్ వీడియో చూశారా?
-
Virat Curve 5G: 3డీ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 6000mAH బ్యాటరీ.. రేపు మధ్యాహ్నం 12 గంటలకు మార్కెట్లోకి విడుదల..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!