Viral Video: ఓ యువతి, యువకుడు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. ఈ నేపథ్యంలో తనను పెళ్లి చేసుకోవాలని అడిగిన ఓ యువతిని యువకుడు దారుణంగా చితకబాదాడు. ఆమెను కిందపడేసి బూటు కాళ్లతో పిచ్చకొట్టుడు కొట్టాడు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఓ గ్రామంలోని రోడ్డుపై యువ జంట నడుచుకుంటూ వెళ్తున్నారు. మాటల సందర్భంలో తనను పెళ్లి చేసుకోవాలని తన వెంట ఉన్న యువకుడిని యువతి కోరింది. దీంతో అతడు తీవ్ర ఆగ్రహం […]
Christamas: ఆదివారం క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏపీ ప్రజలకు సీఎం జగన్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం వంటి వాటిని క్రీస్తు తన జీవితం ద్వారా మానవాళికి అందించించిన గొప్ప సందేశాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు కరుణామయుడి ఆశీస్సులు, దీవెనలు లభించాలని జగన్ ఆకాంక్షించారు. మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, కరుణ, సేవలతో కూడిన శాంతియుత జీవన మార్గాన్ని ఏసు ఈ ప్రపంచానికి అందించారని […]
Botsa Satyanarayana: టీడీపీ అధినేత చంద్రబాబుపై విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. పార్టీని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు తెగ తాపత్రయ పడుతున్నాడని ఆయన ఆరోపించారు. ఆయనకు జవసత్వాలు అయిపోయాయని.. అందుకే వాటిని నిలుపుకోవడానికి పర్యటనలు చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. నిర్మాణాత్మకమైన అంశాలు చెబితే ప్రజలు దాని గురించి ఆలోచిస్తారని.. కానీ అసత్యాలు చెప్తే నమ్మరనే సంగతి గుర్తుపెట్టుకోవాలన్నారు. రాజాం, బొబ్బిలి సభలలో చంద్రబాబు అన్నీ అసత్యాలే చెప్పారని మంత్రి బొత్స మండిపడ్డారు. బొబ్బిలి రైతు […]
Pakistan: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీని సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 26 నుంచి న్యూజిల్యాండ్‌తో జరిగే టెస్టు సిరీస్ నుంచి కొత్త సెలెక్షన్ కమిటీ సేవలు అందుబాటులోకి వస్తాయని పీసీబీ ప్రకటించింది. ఇటీవల స్వదేశంలో జరిగిన రెండు టెస్టు సిరీసులను పాకిస్తాన్ ఓడిపోయింది. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను 3-0తో వైట్ వాష్‌కు గురైంది. ఇంగ్లండ్ చేతిలో వరుస […]
Andhra Pradesh: వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల్లో అత్యాధునిక హంగులతో నిర్మించిన నూతన బస్ టెర్మినల్‌ను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించారు. మూడు రోజుల పర్యటన కోసం వైఎస్ఆర్ కడప జిల్లాకు విచ్చేసిన సీఎం జగన్ శనివారం నాడు పులివెందులలో నూతనంగా నిర్మించిన బస్ టెర్మినల్ ను ప్రారంభించారు. అనంతరం బస్ టెర్మినల్ ను సీఎం జగన్ స్వయంగా పరిశీలించి, ఆర్టీసీ కార్యాలయం, కాంప్లెక్స్ నిర్మాణ శైలిని ప్రయాణికుల సదుపాయాలను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి ముందు సీఎం జగన్ […]
Central Government: నూతన సంవత్సరం కానుకగా దేశంలోని పేదలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో ఏడాది పాటు ఉచితంగా రేషన్ అందించాలని నిర్ణయించింది. మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలోని 81.5 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందనున్నారు. ఇంత పెద్ద సంఖ్యలో జనాభా ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని, వారికి ఏడాది పొడవునా ఆహార ధాన్యాలు ఉచితంగా అందిస్తామని తెలిపింది. కరోనా లాక్ డౌన్ సమయం నుంచి కేంద్రంలోని బీజేపీ […]
IND Vs BAN: మీర్పూర్ టెస్టులో స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి టీమిండియా ఆపసోపాలు పడుతోంది. బంగ్లాదేశ్ విధించిన 145 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి కేవలం 45 పరుగులు చేసింది. కీలక ఆటగాళ్లు కేఎల్ రాహుల్ (2), శుభ్‌మన్ గిల్ (7), పుజారా (6), విరాట్ కోహ్లీ (1) పెవిలియన్ చేరారు. క్రీజులో అక్షర్ పటేల్ (26), జైదేవ్ ఉనద్కట్ (3) ఉన్నారు. బంగ్లాదేశ్ బౌలర్లలో […]
Bigg Boss Revanth: బిగ్‌బాస్ 6 ఆరో సీజన్ గ్రాండ్ ఫినాలే ముగిసింది. బిగ్‌బాస్-6 విన్నర్‌గా రేవంత్ నిలిచాడు. గతంలో ఇండియన్ ఐడల్ విన్నర్‌గా నిలిచిన రేవంత్.. ఇప్పుడు మరోసారి బిగ్‌బాస్ విన్నర్‌గా నిలవడంతో అతడి అభిమానులు ఎంతో సంతోషించారు. అయితే అంచనాలకు భిన్నంగా బిగ్‌బాస్-6 ఫినాలే సాగింది. నాటకీయ పరిణాామాల కారణంగా విన్నర్ రేవంత్ కంటే రన్నరప్ శ్రీహాన్ అత్యధిక క్యాష్ ప్రైజ్ అందుకున్నాడు. రేవంత్ రూ.10 లక్షల నగదు మాత్రమే గెలుచుకోగా శ్రీహాన్ మాత్రం […]
CM Jagan: కడప జిల్లా పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు. గ్లాస్‌లో 75 శాతం నీళ్లు ఉన్నా నీళ్లు లేవని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మనకు ఓటు వేయని వారికి కూడా మంచి చేస్తున్నామని సీఎం జగన్ స్పష్టం చేశారు. గతంలో ఇదే రాష్ట్రమని.. ఇదే బడ్జెట్ […]
IND Vs BAN: మీర్పూర్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 70.2 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌటైంది. ఓవరాల్‌గా బంగ్లాదేశ్ 144 పరుగుల ఆధిక్యం సంపాదించింది. దీంతో టీమిండియా ముందు 145 పరుగుల టార్గెట్ నిలిచింది. లిటన్ దాస్ 73, జకీర్ హసన్ 51 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు. అశ్విన్, సిరాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనద్కట్ […]