ఏపీ దేవాదాయ శాఖలో డిప్యుటేషన్ పేరుతో రెవెన్యూ అధికారుల పెత్తనానికి బ్రేకులు పడనున్నాయ్. ప్రధాన ఆలయాలకు ఈవోలుగా డిప్యూటీ కలెక్టర్లను నియమించే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకనుంది. నిబంధనలు ఉల్లంఘించి చేపట్టిన నియమకాలపై సుదీర్ఘంగా న్యాయ వివాదం జరగ్గా చివరకు దేవాదాయ శాఖ ఉద్యోగులకు ఊరట లభించింది. రాష్ట్రంలో 8 ప్రధాన ఆలయాలు దేవాదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి. వీటిలో సింహాచలం, కాణిపాకం, ద్వారకా తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి ముఖ్యమైనవి. ఈ ఆలయాలకు వచ్చే భక్తుల […]
గురువారం రాత్రి చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలి ఓవర్లోనే డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే రోహిత్ శర్మ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్ ఐపీఎల్‌లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు ఐపీఎల్‌లో మొత్తం 14 సార్లు రోహిత్ డకౌట్ అయ్యాడు. రోహిత్ తర్వాత అత్యధికంగా 13 సార్లు డకౌట్ అయిన ఆటగాళ్లలో పీయూష్ చావ్లా, హర్భజన్, మన్‌దీప్ సింగ్, పార్థివ్ పటేల్, రహానే, అంబటి […]
గుడివాడలో అధికార పార్టీకి చెందిన మట్టి మాఫియా చెలరేగిపోతోంది. మండలంలోని మోటూరు గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై మైనింగ్ మాఫియా దాడికి దిగింది. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో గత కొన్ని రోజులుగా రాత్రిళ్ళు జరుగుతున్న మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించడంతో తవ్వకాలను అడ్డుకున్న ఆర్ఐ అరవింద్‌పై దాడికి దిగారు. మోటూరు గ్రామంలోని కాలువల వెంట మట్టి తవ్వకాలు జరుగుతుండగా తన సిబ్బందితో కలిసి ఆర్ఐ అరవింద్ అడ్డుకోవడంతో ఎదురుతిరిగిన […]
ఏపీలో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కారు గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీస్‌ను వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాల ఉన్నత, సాంకేతిక విద్య, న్యాయ విభాగం, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ మత్స్య శాఖ, యువజన సర్వీసులు, రెవెన్యూ, పంచాయతీరాజ్, సాధారణ పరిపాలన, హోం, ప్లానింగ్, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం, ఇన్సూరెన్స్, మెడికల్ సర్వీసెస్ విభాగాలలోని కాంట్రాక్ట్ […]
★ నేడు ఒంగోలులో ఏపీ సీఎం జగన్ పర్యటన.. మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం మూడో విడత నిధులను జమ చేయనున్న సీఎం జగన్ ★ నేడు ఉదయం 11 గంటలకు తెలంగాణ, ఏపీ అధికారులు, ఈఎన్సీలతో జీఆర్ఎంబీ సమావేశం.. గెజిట్ నోటిఫికేషన్ అమలు, ప్రాజెక్టుల డీపీఆర్‌లపై చర్చ ★ శ్రీకాకుళం: నేడు ఆముదాలవలస మున్సిపాలిటీలో స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటన ★ అనంతపురం నగరంలో నేడు మాంగళ్య బట్టల దుకాణాన్ని ప్రారంభించనున్న సినీ నటులు […]
తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురంలో గ్రాసిం ఇండస్ట్రీ కోర్ ఆల్కలీ యూనిట్‌ను బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార మంగళం బిర్లాతో కలిసి సీఎం జగన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రాసిమ్ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.2,700 కోట్లు పెట్టుబడులు వచ్చాయని వివరించారు. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 1,300 మందికి, పరోక్షంగా 1,150 మందికి ఉపాధి లభిస్తుందని సీఎం జగన్ తెలిపారు. 75 శాతం స్థానికులకు ఉపాధి కల్పించేలా ఇప్పటికే […]
స్టేషన్ ఘన్‌పూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య తమ్ముడు తాడికొండ సురేష్ వివాదంలో చిక్కుకున్నాడు. తనను తాటికొండ సురేష్ లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ జనగామ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. జంగింటి విజయలక్ష్మీ, రమేష్ దంపతులు తమ కుటుంబ సభ్యుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిలో ఇంటి నిర్మాణం కోసం చాలా ఏళ్ల క్రితమే బేస్‌మెంట్ వరకు నిర్మించారు. అయితే వాళ్ల పనులకు స్థానిక సర్పంచ్ తాటికొండ సురేష్ అడ్డుపడుతున్నట్లు బాధితులు ఆరోపించారు. దీంతో […]
కస్టమర్లను ఆకర్షించడానికి వ్యాపారులు అనేక మార్గాలను అన్వేషిస్తూ ఉంటారు. అందుకోసం బంపర్ ఆఫర్లను ప్రకటిస్తుంటారు. ప్రస్తుతం పెట్రోల్, నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ నేపథ్యంలో యూపీలోని ఓ షాప్ యజమాని వినూత్నంగా ఆలోచించాడు. దీంతో కస్టమర్లను ఆకట్టుకునేలా అదిరిపోయే ఆఫర్‌ను ప్రకటించాడు. సెల్‌ఫోన్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలను ఉచితంగా ఇస్తానని ఆఫర్ ఇచ్చాడు. వివరాల్లోకి వెళ్తే… యూపీలోని వారణాసికి చెందిన మొబి వరల్డ్ షాప్ అనే స్టోర్ యజమాని తమ స్టోర్‌లో రూ.10వేలకు పైగా విలువైన […]
ఏపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శలు చేశారు. అన్నదాతల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గుంటూరు జిల్లాలో వారం రోజుల్లో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమన్నారు. రైతులకు భరోసా ఇచ్చేందుకే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ వివరించారు. ఈనెల 23న పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో పవన్ కళ్యాణ్ పర్యటిస్తారని ఆయన తెలిపారు. రైతుల కుటుంబాలకు ధైర్యం చెప్పేందుకు త్వరలో గుంటూరు జిల్లాలో కూడా పవన్ […]
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాలులో మంత్రి హోదాలో శాప్‌పై మంత్రి రోజా తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే శాప్ సమావేశంలో రోజా సెల్‌ఫోన్స్ గురించి ప్రస్తావించిన సమయంలో.. ఆమె సెల్‌ఫోన్ చోరీకి గురికావడం స్థానికంగా కలకలం రేపింది. కాగా మంత్రి రోజా సెల్‌ఫోన్ చోరీ చేసిన వ్యక్తి ఎవరన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా శాప్ సమీక్ష సమావేశంలో మంత్రి రోజా మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర […]