★ నేడు ఒంగోలులో ఏపీ సీఎం జగన్ పర్యటన.. మహిళలకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం మూడో విడత నిధులను జమ చేయనున్న సీఎం జగన్
★ నేడు ఉదయం 11 గంటలకు తెలంగాణ, ఏపీ అధికారులు, ఈఎన్సీలతో జీఆర్ఎంబీ సమావేశం.. గెజిట్ నోటిఫికేషన్ అమలు, ప్రాజెక్టుల డీపీఆర్‌లపై చర్చ
★ శ్రీకాకుళం: నేడు ఆముదాలవలస మున్సిపాలిటీలో స్పీకర్ తమ్మినేని సీతారాం పర్యటన
★ అనంతపురం నగరంలో నేడు మాంగళ్య బట్టల దుకాణాన్ని ప్రారంభించనున్న సినీ నటులు అను ఇమ్మాన్యుయేల్, నభా నతేష్, డీజే టిల్లు ఫేం సిద్దూ జొన్నలగడ్డ
★ అనంతపురం: నేటి నుంచి గుంతకల్లు రైల్వే డివిజన్‌లో కదిరేపల్లి – తిరుపతి మధ్య తిరిగే ప్యాసింజర్ రైళ్లను పాక్షికంగా రద్దు చేసిన అధికారులు
★ విశాఖ: నేడు గాజువాక నుంచి సింహాచలం వరకు మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ పాదయాత్ర.. పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలకు నిరసనగా బాదుడే బాదుడు పేరుతో పాదయాత్ర
★ ఖమ్మం: నేడు సాయి గణేష్ సంతాప సభ.. కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చౌక్‌లో సంతాప సభలో పాల్గొననున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
★ ఢిల్లీ: నేడు ప్రధాని మోదీతో యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ సమావేశం
★ ఢిల్లీ: నేడు సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ సమావేశం.. ఎన్నికల వ్యూహాలపై మరోసారి ప్రజంటేషన్ ఇవ్వనున్న పీకే
★ ఐపీఎల్ 2022: నేడు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న రాజస్థాన్ రాయల్స్.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్