Tirupathi: శాప్ సమీక్ష సమావేశంలో మంత్రి రోజా సెల్‌ఫోన్ చోరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాలులో మంత్రి హోదాలో శాప్‌పై మంత్రి రోజా తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే శాప్ సమావేశంలో రోజా సెల్‌ఫోన్స్ గురించి ప్రస్తావించిన సమయంలో.. ఆమె సెల్‌ఫోన్ చోరీకి గురికావడం స్థానికంగా కలకలం రేపింది. కాగా మంత్రి రోజా సెల్‌ఫోన్ చోరీ చేసిన వ్యక్తి ఎవరన్న విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సీసీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు.
కాగా శాప్ సమీక్ష సమావేశంలో మంత్రి రోజా మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో స్పోర్ట్స్‌ను ముందుకు తీసుకువెళ్లాలనేది సీఎం జగన్ ఆలోచనగా ఉందని తెలిపారు. ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా అభివృద్ధి చేస్తామని మంత్రి రోజా తెలిపారు. క్రీడల్లో సరైన ప్రోత్సాహం లేకపోవడంతో యువతీ యువకులు వెనుకబడి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రతి నియోజకవర్గంలో స్పోర్ట్స్ క్లబ్ అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు.
Also Read
- CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు సజీవదహనం..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
జీవితంలో స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యమని మంత్రి రోజా అభిప్రాయపడ్డారు. సెల్ ఫోన్స్ వల్ల చాలామంది స్పోర్ట్స్‌కు దూరం అవుతున్నారన్నారు. పిల్లలు చిన్న విషయాలకు డిప్రెషన్ అవుతున్నారని.. వాళ్లు చాలా సెన్సిటివ్‌గా మారుతున్నారని తెలిపారు. స్పోర్ట్స్ ఆడటం వల్ల మానసిక స్థైర్యం వస్తుందని మంత్రి రోజా అన్నారు. ఫైర్ అనేది ఇన్ బిల్ట్ అని.. చెడు మీద ఫైర్ అలాగే కొనసాగుతుందని పేర్కొన్నారు. తానెప్పుడూ సీఎం జగన్‌ను ఫాలో అవుతానని స్పష్టం చేశారు. మనం చేసే అభివృద్ధి పనులే మనల్ని విమర్శించే వాళ్లకు సమాధానం చెప్తాయని రోజా వ్యాఖ్యానించారు. అంతకుముందు తిరుపతి ఎస్వీయూ ఆవరణలోని వెంకటేశ్వరస్వామిని మంత్రి రోజా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు మంత్రి రోజాకు తీర్థప్రసాదాలు అందజేశారు.
Andhra Pradesh: ఒంగోలు ఆర్టీఏ అధికారుల ఓవరాక్షన్‌పై సీఎం జగన్ సీరియస్
తాజావార్తలు
-
Nayanthara: నయన్ రాజకీయాల్లోకి వస్తున్నారా? ఒక్క మాటతో తేల్చేసిన భర్త విఘ్నేశ్!
-
Jailer 2: టాలీవుడ్‌ను నెల్సన్ లైట్ తీసుకున్నారా?
-
CM Chandrababu: ఫిర్యాదుల స్వీకరణ నుంచి పరిష్కారం వరకు పర్యవేక్షణ.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Rahul Gandhi’s SIR Petition: SIRపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ.. సీఈసీ రాజీనామాకు విపక్షాల డిమాండ్
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!