MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
- MG కొత్త ADAPT ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరణ.
- ప్లగ్-ఇన్, స్ట్రాంగ్ హైబ్రిడ్, EV మోడళ్లకు ఇదే బేస్.
- 43% థర్మల్ ఎఫిషియెన్సీ కలిగిన కొత్త హైబ్రిడ్ ఇంజిన్.
- నాలుగు రెట్లు వేగంగా స్పందించే DHT ట్రాన్స్మిషన్.
- నాలుగు డ్రైవింగ్ మోడ్లతో 10-ఇన్-1 డ్రైవ్ యూనిట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MG Motors: MG మోటార్స్ ఇండియా కార్ల నిర్మాణంలో సంచలనానికి తెర తీసింది. తన కొత్త ప్లాట్‌ఫామ్ అయిన ‘అడ్వాన్స్డ్ డ్రైవ్ ఆర్కిటెక్చర్ ప్లాట్‌ఫామ్ టెక్నాలజీ’ (ADAPT)ను తొలిసారిగా వెల్లడించింది. ఈ NEV (న్యూ ఎనర్జీ వెహికల్) ఆర్కిటెక్చర్ ద్వారా రాబోయే తన ప్లగ్-ఇన్ హైబ్రిడ్ (PHEV), స్ట్రాంగ్ హైబ్రిడ్, రేంజ్-ఎక్స్టెండర్ హైబ్రిడ్, EV మోడళ్లకు నిర్మించనుంది. న్యూ ఏజ్ కార్లను ఎంజీ తీసుకురాబోతోంది. అయితే, పెట్రోల్-డీజిల్‌పై పూర్తిగా ఆధారపడే ICE (ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్) మోడళ్లకు ఈ ప్లాట్ ఫామ్ అందుబాటులో ఉండవని తెలుస్తోంది.
43% థర్మల్ ఎఫిషియెన్సీతో కొత్త హైబ్రిడ్ ఇంజిన్

Also Read
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Aprilia SXR GT 125: Aprilia నుంచి కొత్త మ్యాక్సీ స్కూటర్లు.. SXR GT 125, SXR GT 175 విడుదల.. ధరలు ఇవే!
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
ADAPT ఆధారిత హైబ్రిడ్ ఆఫర్లలో కొత్త నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది తక్కువ ఇంధన వినియోగం, 43 శాతం వరకు థర్మల్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా పెట్రోల్ ఇంజన్లు 20-35 శాతం పరిధిలో థర్మల్ సామర్థ్యాన్ని అందిస్తాయని పరిగణనలోకి తీసుకుంటే, ఇది చాలా ఆకట్టుకునే విషయం. ఈ హైబ్రిడ్-కేంద్రీకృత ఇంజన్ యొక్క డిస్ప్లేస్మెంట్, సిలిండర్ల సంఖ్య, పవర్ అవుట్‌పుట్ వంటి వివరాలను MG వెల్లడించలేదు, కానీ ఈ ఇంజన్‌ను DHT (డెడికేటెడ్ హైబ్రిడ్ ట్రాన్స్మిషన్)తో జత చేస్తారని క్లారిటీ ఇచ్చింది.
ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈ-క్లచ్ DHT

కొత్త DHTలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఈ-క్లచ్‌ను ఉపయోగించారు. ఇది సంప్రదాయ హైబ్రిడ్ సిస్టమ్‌లతో పోలిస్తే నాలుగు రెట్లు వేగంగా స్పందిస్తుందని MG తెలిపింది.సాధారణ e-CVT వ్యవస్థలకు భిన్నంగా ఇందులో మెకానికల్ గేర్లు కూడా ఉండటంతో మెరుగైన టార్క్ డెలివరీ, సహజమైన డ్రైవింగ్ అనుభూతి లభిస్తుందని కంపెనీ చెబుతోంది.
10-ఇన్-1 డ్రైవ్ యూనిట్

ఇందులో పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్, 2-స్టేజ్ రిడక్షన్ గేర్‌బాక్స్‌ను ఏకీకృతం చేసే 10-ఇన్-1 డ్రైవ్ యూనిట్ కూడా ఉంది. ఇది ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్ యొక్క అవుట్‌పుట్‌లను నిర్వహించి, వాటిని చక్రాలకు అందిస్తుంది. ఇంటెలిజెండ్ ఎనర్జీ మేనేజ్మెంట్ సిస్టమ్ డ్రైవింగ్ పరిస్థితులను బట్టి 4 మోడ్లలో పనిచేస్తుంది. ఇవి ప్యూర్ ఎలక్ట్రిక్ డ్రైవ్, సిరీస్ హైబ్రీడ్ డ్రైవ్, పారలల్ హైబ్రీడ్ డ్రైవ్, ఇంజన్ డైరెక్ట్ డ్రైవ్.
ఒకే ప్లాట్‌ఫామ్ 4 రకాల కార్లు:
ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా ఎంజీ నాలుగు రకాల వాహనాలను నిర్మించబోతోంది. పూర్తి ఎలక్ట్రిక్ మోడల్, ఎలక్ట్రిక్ మోటార్+ఇంజన్ కలిగిన హైబ్రిడ్ మోడల్, ఫ్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్, రేంజ్ ఎక్స్టెండర్ హైబ్రిడ్ మోడళ్లను తీసుకురాబోతోంది. ఒకే ఫ్లాట్‌ఫామ్‌పై నాలుగు రకాల కార్లను నిర్మిస్తూ, మిగతా ఆటోమేకర్లకు సవాల్ విసురుతోంది.
* వివరంగా చెప్పాలంటే పూర్తి ఎలక్ట్రిక్ మోడల్ కారులో ఎలక్ట్రిక్ మోటార్, బ్యాటరీ ప్యాక్ ఉంటుంది.
*ఇక స్ట్రాంగ్ హైబ్రీడ్ మోడల్లో ఇంజన్, మోటార్, బ్యాటరీ ప్యాక్ ఉంటాయి. అయితే, పరిస్థితుల్ని బట్టి ఇంజన్, మోటార్లకు కార్ స్విచ్ అవుతుంటుంది. బ్యాటరీని ప్రత్యేకంగా ఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు.
*ఇక ఫ్లగ్ ఇన్ హైబ్రిడ్ మోడల్ కారులో ఇంజన్, మోటార్, బ్యాటరీ ఉంటుంది. ఇందులో బ్యాటరీని సపరేట్గా ఛార్జింగ్ చేయాల్సి ఉంటుంది.
*రేంజ్ ఎక్స్టెండర్ హైబ్రిడ్ మోడల్లో ఇంజన్, మోటార్, బ్యాటరీ ఉంటాయి. అయితే, ఇందులో ఇంజన్ నేరుగా కారును నడిపించదు. బ్యాటరీ పర్సంటేజ్ తక్కువ అయిన సందర్భంలో ఒక జనరేటర్‌గా పనిచేస్తూ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది.
తాజావార్తలు
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
-
Pan IIT Summit : చంద్రబాబు చూపు ఈవీపై.. ఏపీకి కొత్త టెక్నాలజీ ప్లాన్..
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!