గురువారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. చివరి 4 బంతుల్లో చెన్నై జట్టు 16 పరుగులు చేయాల్సిన స్థితిలో వరల్డ్ బెస్ట్ ఫినిషర్ ధోనీ మరోసారి తనదైన శైలిలో ఆడి మ్యాచ్‌ను గెలిపించాడు. వరుసగా 6, 4, 2, 4 సాధించాడు. దీంతో తనలో పవర్ తగ్గలేదని ధోనీ చాటిచెప్పాడు. అయితే ధోనీ ఇన్నింగ్స్‌పై మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం […]
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని యువతిపై ముగ్గురు వ్యక్తులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడటం పెద్ద దుమారం రేపింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు నున్న పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న సీఐ హనీష్, సెక్టార్ ఎస్సై శ్రీనివాసులుపై సస్పెన్షన్ వేటు విధించారు. తమ కుమార్తె కనిపించలేదన్న బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంపై ఉన్నతాధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. మరోవైపు శుక్రవారం ఉదయం విజయవాడ ప్రభుత్వాస్పత్రి వద్ద టెన్షన్ వాతావరణం […]
ఏపీ సీఎం జగన్ త్వరలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. సీఎం హోదాలో జగన్ తొలిసారి అధికారికంగా విదేశీ పర్యటన చేయబోతున్నారు. సీఎం అయిన తరువాత జగన్ లండన్, అమెరికా వెళ్లినా అది పూర్తిగా వ్యక్తిగత పర్యటనగానే పరిమితమైంది. అయితే ఇప్పుడు సీఎం హోదాలో జగన్ దావోస్ వెళ్లనున్నారు. ఏపీకి పెట్టుబడులను ఆకర్షించేందుకు దావోస్ కేంద్రంగా జరిగే వరల్డ్ ఎకానమిక్ ఫోరం సమ్మిట్‌లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారవేత్తలతో భేటీ కానున్నారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను […]
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రస్తుత అధికార పక్షం సభ్యులు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇమ్రాన్ ప్రధానిగా ఉన్నప్పుడు పలు అక్రమాలకు పాల్పడ్డారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వానికి అందిన కానుకల విషయంలో కేవలం 20 శాతం డబ్బు కట్టి రూ. 5.7కోట్లను ఇమ్రాన్ సొమ్ము చేసుకున్నారని మండిపడుతున్నారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్‌కు సంబంధించి మరో దుబారా ఖర్చును ప్రభుత్వ నేతలు బహిర్గతం చేశారు. ఇమ్రాన్ తన ప్రభుత్వ హయాంలో ప్రధాని నివాసం నుంచి బానీగాలాలోని ప్రైవేటు […]
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరతారని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహాలపై ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేయాలని.. ఏపీలో మాత్రం వైసీపీతో పొత్తు పెట్టుకోవాలని ప్రశాంత్ కిషోర్ సూచించినట్లు ఓ వార్త షికారు చేస్తోంది. మరోవైపు ఏపీలో వైసీపీతో కలిసి పీకే పనిచేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌తో పొత్తు విషయాన్ని వైసీపీ […]
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఎఫ్ 3 మూవీ నుంచి మరో సాంగ్‌ను చిత్ర యూనిట్ శుక్రవారం ఉదయం విడుదల చేసింది. ‘ఊ .. ఆ .. అహ అహ’ అంటూ ఈ పాట సాగుతుంది. నీ కోర మీసం చూస్తుంటే.. నువ్వుట్టా తిప్పేస్తుంటే.. అంటూ సాంగ్ ప్రారంభంలో లిరిక్స్ వినిపిస్తున్నాయి. మంచి రొమాంటిక్‌గా కనిపిస్తున్న ఈ పాటను వెంకటేష్-తమన్నా, వరుణ్ తేజ్ – మెహ్రీన్ జంటలపై చిత్రీకరించారు. ఈ పాటను కాసర్ల శ్యామ్ […]
క్రెడిట్ కార్డుల జారీని భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరింత కట్టుదిట్టం చేసింది. కస్టమర్ల సమ్మతి తీసుకోకుండా క్రెడిట్ కార్డులు ఇవ్వడం లేదా ప్రస్తుత కార్డును అప్‌గ్రేడ్ చేయడం వంటివి చేయొద్దని అన్ని బ్యాంకులు, కంపెనీలను ఆర్‌బీఐ ఆదేశించింది. ఈ విషయాన్ని ఉల్లంఘిస్తే కస్టమర్ నుంచి వసూలు చేసిన బిల్లుకు రెట్టింపు మొత్తాన్ని జరిమానా విధిస్తామని ఆర్‌బీఐ హెచ్చరికలు జారీ చేసింది. అంతేకాకుండా క్రెడిట్ కార్డులకు సంబంధించి రుణాల వసూలు కోసం సంస్థలు కస్టమర్లపై వేధింపులు, బెదిరింపులకు దిగరాదని […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తెలుగు ఇండస్ట్రీలోనే అత్యధిక వసూళ్లను ఈ సినిమా సొంతం చేసుకుంది. విడుదలైన అన్ని భాషల్లోనూ హాలీవుడ్ సినిమా స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇంత భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సినిమాను ఓటీటీలో చూడాలని మెగా, నందమూరి అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ5 సంస్థ కొనుగోలు చేసింది. హిందీ మినహా అన్ని […]
ఏపీలో పరీక్షలకు సిద్ధమవుతున్న పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ శుభవార్త అందించింది. గురువారం పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై మంత్రి బొత్స సత్యనారాయణ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ మేరకు పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చని ఆర్టీసీ ప్రకటన చేసింది. పరీక్షల సమయంలో విద్యా కేంద్రం నుంచి పరీక్షా కేంద్రానికి వెళ్లి పరీక్ష రాసిన అనంతరం మళ్లీ తిరుగు ప్రయాణం ఉచితంగా చేయవచ్చని సూచించింది. ఉచిత ప్రయాణం చేయాలంటే […]