గుడివాడలో అధికార పార్టీకి చెందిన మట్టి మాఫియా చెలరేగిపోతోంది. మండలంలోని మోటూరు గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలను అడ్డుకున్న రెవెన్యూ అధికారులపై మైనింగ్ మాఫియా దాడికి దిగింది. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో గత కొన్ని రోజులుగా రాత్రిళ్ళు జరుగుతున్న మట్టి తవ్వకాలపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించడంతో తవ్వకాలను అడ్డుకున్న ఆర్ఐ అరవింద్‌పై దాడికి దిగారు.
మోటూరు గ్రామంలోని కాలువల వెంట మట్టి తవ్వకాలు జరుగుతుండగా తన సిబ్బందితో కలిసి ఆర్ఐ అరవింద్ అడ్డుకోవడంతో ఎదురుతిరిగిన వైసీపీకి చెందిన మట్టి మాఫియా ఆయనపై దాడికి దిగడంతో రెవెన్యూ యంత్రాంగం నిర్ఘాంతపోయింది. గ్రామంలో జరుగుతున్న అక్రమ తవ్వకాలపై గతంలోనే దాడులు నిర్వహించి అక్రమ తవ్వకాలను నిలుపుదల చేసినట్లు అర్ఐ అరవింద్ తెలియజేశారు. తమకు అందిన సమాచారం మేరకు తిరిగి ప్రారంభమైన తవ్వకాలను అడ్డుకున్న తనపై మట్టి మాఫియా దాడి చేసినట్లు పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న ఉద్యోగ సంఘాల నాయకులు , ఆర్ఐపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Andhra Pradesh: కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్