మీకు భూములు ఉన్నాయా? భూముల పేరుతో బ్యాంకులో అప్పు తీసుకున్నారా? ఒకవేళ తీసుకోకపోతే.. మీ భూమి ఎవరి పేరుతో ఉంది..? బ్యాంకులో అప్పులు ఉన్నాయా అర్జెంటుగా ఒక్కసారి చెక్ చూసుకోండి. ఇదంతా ఎందుకంటారా..? ఎందుకంటే మీకు తెలియకుండానే కొందరు మోసగాళ్లు మీ పేరున లీజు అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదో కొత్త తరహా మోసం. లీజు అగ్రిమెంట్ ఆధారంగా బ్యాంకు నుంచి అప్పులు దర్జాగా పొందుతున్నారు. ఇప్పుడు తూ.గో. జిల్లాలోని కడియం ప్రాంతంలో ఈ తరహా మోసం […]
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి సంబంధించి పలు నివేదికలతో ఆయన విజయవాడ నుంచి భువనేశ్వర్ వెళ్లగా.. శుక్రవారం అక్కడి నుంచి ఢిల్లీ చేరుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు శనివారం నాడు ఢిల్లీలో ప్రధాని మోదీతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సమావేశం కానున్నారు. అయితే ఏపీ గవర్నర్ హరించందన్ మర్యాదపూర్వకంగానే ప్రధాని మోదీని కలుస్తున్నారని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కరోనా పరిస్థితుల కారణంగా చాలాకాలంగా ఆయన ప్రధానిని […]
దేశంలో కరెంట్ కోతలపై కేంద్ర విద్యుత్ శాఖ కొత్త నిబంధనలు జారీ చేసింది. ఈ మేరకు లక్ష, అంతకు మించి జనాభా ఉండే పట్టణాల్లో డిస్కంలు 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నిబంధనను తక్షణమే అమల్లోకి తెచ్చేలా ప్రతి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి సంబంధిత విద్యుత్ పంపిణీ సంస్థలకు ఆదేశాలివ్వాలని స్పష్టం చేసింది. దేశంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో లక్షకు పైగా జనాభా ఉండే పట్టణాల్లో డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని […]
నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించనున్నారు. తొలుత హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్న పవన్ కళ్యాణ్ అనంతరం రోడ్డు మార్గంలో కలపర్రు టోల్‌గేటు మీదుగా జానంపేట, అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా విజయరాయి, పెదవేగి, ధర్మాజీగూడెం, లింగపాలెంకు వెళ్లనున్నారు. అక్కడి నుంచి మళ్లీ ధర్మాజీగూడెం మీదుగా చింతలపూడికి వెళ్తారు. చింతలపూడికి చేరుకునే మధ్యలో పలు గ్రామాల్లో కొందరు కౌలు రైతుల కుటుంబాలను […]
శుక్రవారం రాత్రి జరిగిన ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగింది. అయితే చివరి ఓవర్‌లో హైడ్రామా నడిచింది. ఢిల్లీ విజయానికి 36 పరుగులు కావాల్సిన తరుణంలో రోవ్‌మెన్ పావెల్ చెలరేగి ఆడాడు. రాజస్థాన్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ వేసిన 20వ ఓవర్లో తొలి మూడు బంతులకు పావెల్ 3 సిక్సర్లు కొట్టాడు. అయితే మూడో బంతికి మెకాయ్ వేసిన ఫుల్ టాస్ బంతిని అంపైర్ సరైన బాల్‌గానే ప్రకటించడంతో ఢిల్లీ జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం […]
రాష్ట్రంలో నూతనంగా కాలుష్యరహిత ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువస్తామని రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ వెల్లడించారు. కోనసీమ జిల్లా మామిడికుదురులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల నుంచి తిరుపతికి నడిపేందుకు పైలట్ ప్రాజెక్టుగా 100 ఎలక్ట్రిక్ బస్సులను సిద్ధం చేస్తున్నట్లు మంత్రి విశ్వరూప్ తెలిపారు. అనంతరం దశల వారీగా విశాఖపట్నం, విజయవాడతో పాటూ ప్రధాన నగరాల మధ్య ఎలక్ట్రిక్ బస్సులను నడుపుతామని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో రవాణా వ్యవస్థను పటిష్టం […]
★ నేడు ఏలూరు జిల్లాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన.. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు భరోసా ఇవ్వనున్న పవన్.. ★ విశాఖ: నేటి నుంచి మూడురోజుల పాటు వైసీపీ ఆధ్వర్యంలో జాబ్ మేళా… ఈ జాబ్ మేళా ద్వారా 23,935 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ★ నేడు విశాఖ స్టీల్‌ప్లాంట్ గుర్తింపు సంఘం ఎన్నికలు.. 10,589 మంది ఓటర్ల కోసం 17 పోలింగ్ బూత్‌లు ఏర్పాటు.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్.. […]
ప్రకాశం జిల్లా ఒంగోలులో సున్నా వడ్డీ పథకం కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరుసగా మూడో ఏడాది సున్నా వడ్డీ పథకం కింద నిధులను ఆయన జమ చేశారు. అనంతరం సీఎం జగన్ మాట్లాడుతూ ప్రతిపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబుతో పాటు ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఉచిత పథకాలతో ఆర్థిక విధ్వంసమంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తాము రాక్షసులు, […]
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఈ మేరకు మళ్లీ ఆయన్ను సర్వీస్‌లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించినట్లు భావించొచ్చు. కాగా టీడీపీ హయాంలో అక్రమంగా నిఘా పరికరాలు కొనుగోలు చేసి గూఢచర్యం చేశారనే ఆరోపణల […]
విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన ప్రస్తుతం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో అత్యాచార బాధిత కుటుంబాన్ని శుక్రవారం మధ్యాహ్నం టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో ఓ యువతిపై సామూహిక అత్యాచారం చేయటం ఏపీకే అవమానం అని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ కరువైందని.. ఈ సంఘటన పట్ల ప్రభుత్వానికి సిగ్గుందో లేదో కానీ తాను మాత్రం సిగ్గుపడుతున్నానని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇంత జరిగినా […]