ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ సరిహద్దులోని సాంబా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జమ్మూ కాశ్మీర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని మోదీ వ్యాఖ్యానించారు. ఈ మేరకు రూ.20వేల కోట్ల అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఢిల్లీ-అమృత్ సర్-కాత్రా ఎక్స్ ప్రెస్ వేకు ఆయన శంకుస్థాపన చేశారు. పల్లీ గ్రామంలో 500 కిలోవాట్ల సౌర విద్యుత్ […]
తెలంగాణ మంత్రి కేటీఆర్ మాట తీరు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ విషయంపై అయినా ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారు. ఆయన మాటల్లో చాలా క్లారిటీ ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీకి పీకే అవసరం ఉందా?, తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతపై ఉందా? రాష్ట్రంలో అధికారంలో ఉండి కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఢిల్లీలో ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది? కేంద్ర ప్రభుత్వం ఈడీ, ఐటీ దాడులు చేస్తే ప్రభుత్వ వ్యూహమేంటి? ఇలా పలు రకాల ప్రశ్నలకు […]
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మరో చేదు వార్త అందింది. మూలిగే నక్కపై తాడిపండు పడిన చందాన అసలే రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయి ఆ జట్టు నిరాశలో ఉండగా.. తాజాగా కెప్టెన్ పంత్‌కు జరిమానా పడింది. శుక్రవారం రాత్రి రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని నిరసిస్తూ ఆటగాళ్లను వెనక్కి రావాలని పిలిచిన రిషబ్ పంత్‌కు మ్యాచ్ ఫీజులో 100శాతం కోత పడింది. అంతేకాకుండా నిబంధనలకు విరుద్ధంగా మ్యాచ్ మధ్యలో గ్రౌండ్‌లోకి వెళ్లిన ఢిల్లీ క్యాపిటల్స్ […]
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ పదవి నుంచి రాజీవ్ కుమార్ వైదొలిగిన సంగతి తెలిసిన విషయమే. ఐదేళ్ల క్రితం నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్‌గా నియమితులైన రాజీవ్ కుమార్ శుక్రవారం రాజీనామా చేశారు. దీంతో రాజీవ్ కుమార్ స్థానంలో సుమన్ బెరీని కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాజీవ్ కుమార్ రాజీనామాను మంత్రివర్గం నియామకాల కమిటీ ఆమోదించిందని.. ఈ మేరకు ఆయన వారసుడిగా సుమన్ బెరీని నియమించినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ వెల్లడించింది. మే 1 నుంచి సుమన్ బెరీ […]
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు, ఆ జట్టు ఓపెనర్ జాస్ బట్లర్ ఈ ఐపీఎల్ సీజన్‌లో మంచి ఊపు మీద కనిపిస్తున్నాడు. ఇప్పటికే టోర్నీలో మూడు సెంచరీలు చేశాడు. శుక్రవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అయితే కేవలం 57 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో బట్లర్ 116 పరుగులు చేసి చివరి ఓవర్‌లో అవుటయ్యాడు. ఈ క్రమంలో బట్లర్ పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో దేవదత్ పడిక్కల్‌తో కలిసి 155 […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో గ్యాంగ్ రేప్ ఘటనపై టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడంపై ఆమె మండిపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మహిళా కమిషన్ తూతూ మంత్రంగా ఉందని ఆరోపించారు. బోండా ఉమ మహిళా కమిషన్ సుప్రీమా అంటున్నారని.. బోండా ఉమ లాంటి ఆకు రౌడీలకు మహిళా కమిషన్ సుప్రీమేనని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. చంద్రబాబుకు బాధితులను ఎలా పరామర్శించాలో కూడా […]
దేశంలో వరుసగా ఎలక్ట్రిక్ వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. వేసవిలో ఎండల కారణంగా బ్యాటరీలు వేడెక్కి ఎలక్ట్రిక్ వాహనాలు పేలుతున్నాయి. దీంతో ఆయా వాహనాల జోలికి వెళ్లాలంటేనే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తాజాగా విజయవాడలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. విజయవాడ సూర్యారావు పేటలోని గులాబీ తోటలో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. 40 శాతం గాయాలు కావడంతో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు చిన్నారులు కూడా తీవ్రంగా […]
ఆఫ్ఘనిస్తాన్‌లో వరుసగా ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా ఆ దేశం బాంబు పేలుళ్లతో దద్దరిల్లుతోంది. తాజాగా ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ ప్రావిన్స్‌లోని కుందూజ్ ఇమామ్ సాహిబ్ జిల్లాలోని ఓ ప్రార్థనా మందిరంలో శక్తివంతమైన బాంబు దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందగా.. మరో 43 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో చాలా మంది విద్యార్థులు ఉన్నారని తెలుస్తోంది. అయితే ఈ బాంబు దాడి వెనుక ఐఎస్ఎస్ పాత్ర ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. […]
స్మార్ట్ ఫోన్ వినియోగదారుల ప్రైవసీపై గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆండ్రాయిడ్ ఫోన్స్‌లో కాల్‌రికార్డింగ్ యాప్‌లను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు కొత్త నిబంధనలను ప్రవేశపెట్టనున్నట్లు గూగుల్ తెలిపింది. వీటిని మే 11 నుంచి అమల్లోకి తెస్తామని పేర్కొంది. కాల్ రికార్డింగ్‌కు ఫీచర్‌కు మొదటి నుంచి గూగుల్ వ్యతిరేకంగానే గళం వినిపిస్తోంది. తన సొంత డెయిలర్ అప్లికేషన్‌లో సైతం కాల్ రికార్డింగ్ చేసేటప్పుడు రికార్డ్ అవుతుంటే గూగుల్ ఒక శబ్దాన్ని పుష్ చేసేది. తర్వాత రికార్డింగ్ ఫీచర్‌ను […]
దేశంలోని మహిళలకు ఏమైందో అర్ధం కావడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తలను కూడా వివాహేతర సంబంధాల కోసం చంపేస్తున్నారు. మహిళల ఆలోచనా విధానంలో వస్తున్న మార్పులకు కారణమేంటి? ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతటా మహిళలు తమ భర్తలను చంపే కల్చర్ పెరిగిపోతోంది. ఇటీవల కర్నూలు జిల్లా కోడుమూరులోనూ ఓ మహిళ ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. పిల్లలను అనాధలను చేసింది. తాజాగా తెలంగాణలోని వనపర్తిలో కట్టుకున్న భర్తను సుపారీ ఇచ్చి మరీ ఓ […]