IPL 2022: ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్‌లో నోబాల్ వివాదం.. బ్యాటింగ్ ఆపేయాలని పంత్ సైగలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శుక్రవారం రాత్రి జరిగిన ఢిల్లీ-రాజస్థాన్ మ్యాచ్ చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగింది. అయితే చివరి ఓవర్‌లో హైడ్రామా నడిచింది. ఢిల్లీ విజయానికి 36 పరుగులు కావాల్సిన తరుణంలో రోవ్‌మెన్ పావెల్ చెలరేగి ఆడాడు. రాజస్థాన్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ వేసిన 20వ ఓవర్లో తొలి మూడు బంతులకు పావెల్ 3 సిక్సర్లు కొట్టాడు. అయితే మూడో బంతికి మెకాయ్ వేసిన ఫుల్ టాస్ బంతిని అంపైర్ సరైన బాల్‌గానే ప్రకటించడంతో ఢిల్లీ జట్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అది నోబాల్ అని వాదించింది. చెస్ట్ వరకు బాల్ ఫుల్‌టాస్ వచ్చిందంటూ పావెల్ వాదించగా అంపైర్ ఒప్పుకోలేదు.
దీంతో డగౌట్‌లో కూర్చున్న ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు. బ్యాటింగ్ చేయకుండా డగౌట్‌కు వచ్చేయాలంటూ క్రీజులో ఉన్న తమ ఆటగాళ్లకు సైగలతో సందేశాన్ని పంపాడు. దీంతో పావెల్, కుల్‌దీప్ యాదవ్ వెళ్లిపోవడానికి రెండు అడుగులు ముందుకు వేశారు. వెంటనే అంపైర్ నితిన్ మీనన్ వాళ్లకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. మరోవైపు ఢిల్లీ కెప్టెన్ పంత్ తమ టీమ్ అసిస్టెంట్ కోచ్ ప్రవీణ్ ఆమ్రేను బలవంతంగా మైదానంలోకి పంపాడు. క్రికెట్ నిబంధనల ప్రకారం ఇతర వ్యక్తులు ఆట జరిగేటప్పుడు మైదానంలోకి రాకూడదు. దీంతో అంపైర్ నితిన్ మీనన్ ఆమ్రేను బయటకు వెళ్లిపోవాలని ఆదేశించాడు.
Also Read
- WI Coach: వెస్టిండీస్ క్రికెట్‌ను కాపాడండి.. దయచేసి ఆర్థిక సాయం చేయండి.. హెడ్ కోచ్ డారెన్ సామీ ఆవేదన..
- Shai Hope: "మా 20 ఏళ్ల కల నెరవేరలేదు.. అయినా నేను ఫుల్ హ్యాపీ".. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ కీలక వ్యాఖ్యలు..
- IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలానికి ముహూర్తం ఖరారు.. ఈసారి వేదిక ఎక్కడో తెలుసా?
- Naman Dhir: యువరాజ్ సింగ్ 19 ఏళ్ల రికార్డు బ్రేక్.. 6 బంతుల్లోనే నమన్ ధీర్ విధ్వంసం..
అయితే కాసేపటికి ఈ వివాదం సద్దుమణిగింది. కానీ రిప్లేలో కూడా కాస్త నోబాల్‌లాగే కనిపించిందని కామేంటేటర్లు అనుమానం వ్యక్తం చేశారు. మొత్తానికి మ్యాచ్ మళ్లీ ప్రారంభం కావడంతో మెకాయ్ చివరి మూడు బంతులను కట్టుదిట్టంగా వేయడంతో రాజస్థాన్ 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. కానీ కెప్టెన్ పంత్ మ్యాచ్ జరిగే సమయంలో వేరే వ్యక్తిని మైదానంలోకి పంపడంతో అతడికి జరిమానా పడే అవకాశాలున్నాయి.
https://twitter.com/VinayShu1998/status/1517568521601175552
తాజావార్తలు
-
Poco X8s: 12GB RAM, Snapdragon 7 Gen 4 ప్రాసెసర్‌తో Poco X8s? లీకైన వివరాలు ఇవే!
-
Kiren Rijiju: ‘‘బంగ్లాదేశ్-ఫ్రాన్స్ తరహాలో భారత్‌లో కుట్ర’’.. సోరోస్ ప్లాన్ పనిచేయదన్న కిరెన్ రిజిజు..
-
Ayudha Pooja : ఆయుధ, సరస్వతీ పూజలకు ఇల్లు సిద్ధమవుతోందా?.. ఈ సింపుల్ టిప్స్‌తో మెరిపించేయండి!
-
Kilauea volcano: 55వ సారి కిలావుయా అగ్ని పర్వత విస్పోటనం..
-
Ferrari Luce: భారత్‌లోకి ఫెరారీ తొలి ఎలక్ట్రిక్ కారు.. 2.5 సెకన్లలో 100 km/h స్పీడ్!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!