ఆదివారం నాడు చెన్నై నగరంలో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. ఓ రైలు.. పట్టాలు తప్పి ఏకంగా మీటరు ఎత్తున్న ప్లాట్‌ఫారంపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో ప్లాట్‌ఫారం ధ్వంసమైంది. వివరాల్లోకి వెళ్తే.. చెన్నైలోని బీచ్ స్టేషన్‌లో సబర్బన్ రైలు పట్టాలు తప్పింది. షెడ్ నుంచి స్టేషన్‌కు వస్తున్న సమయంలో ఈ ఘటన సంభవించింది. అయితే ఈ రైలులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. చెన్నై వర్క్‌షాప్ నుంచి కోస్టల్ రైల్వేస్టేషన్ వైపు […]
ఐపీఎల్ 2022 సీజన్ చప్పగా ప్రారంభమైనా ప్రస్తుతం రంజుగా కొనసాగుతోంది. ఈ ఏడాది జట్ల సంఖ్య పెరిగినా మ్యాచ్‌ల సంఖ్య మాత్రం 74గానే ఉంది. వీటిలో 70 లీగ్ మ్యాచ్‌లు ఉండగా మిగతా నాలుగు మ్యాచ్‌లు ప్లే ఆఫ్స్ కిందకు వస్తాయి. కరోనా కారణంగా లీగ్ మ్యాచ్‌లను మహారాష్ట్రలోని నాలుగు స్టేడియాల్లో మాత్రమే బీసీసీఐ నిర్వహిస్తోంది. ప్రస్తుతం లీగ్ దశలో సగం మ్యాచ్‌ల సంఖ్య పూర్తి కావడంతో బీసీసీఐ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వేదికలను ఖరారు చేసింది. […]
టీఆర్ఎస్ పార్టీ త్వరలోనే జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై వివరించారు. తాను 8 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో పని చేశానని.. తర్వాత 8 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్ఎస్ పార్టీ పుట్టిందని.. అందుకే రాష్ట్రం ఆవిర్భవించిన రోజు కలిగిన తృప్తి, సంతోషంతో పోలిస్తే మిగతా విషయాలు సరితూగవన్నారు. […]
ఫార్మాట్ ఏదైనా విరాట్ కోహ్లీ వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో కోహ్లీకి ఏమైంది అంటూ అభిమానులు నిలదీస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ కోహ్లీ గోల్డెన్ డకౌట్‌గా వెనుతిరిగాడు. గత మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే కోహ్లీ అవుట్ కాగా.. శనివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఇదే పునరావృతం అయ్యింది. కోహ్లీ ప్రదర్శన చూసి అతడి అభిమానులు తెగ ఫీలైపోతున్నారు, ఎలా ఉండే […]
దేశంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా శృంగారం చేస్తున్నారు. ఒకరి కంటే ఎక్కువ మందితో శృంగారం చేసే విషయంలో చాలా మంది కండోమ్ లేకుండా ఈ కార్యంలో పాల్గొంటున్నారు. దీంతో హెచ్‌ఐవీ అనేది కామన్ డిసీజ్‌గా మారిపోయింది. దేశవ్యాప్తంగా అరక్షిత లైంగిక సంపర్కంతో గత పదేళ్లలో 17.08 లక్షల మంది హెచ్‌ఐవీ బారిన పడినట్లు తాజాగా ఎయిడ్స్ నివారణ సంస్థ వెల్లడించింది. ఎయిడ్స్ కేసులకు సంబంధించి మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన […]
కౌలు రైతుల విషయంలో వైసీపీ సర్కారుపై విమర్శలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ రైతుల గురించి మాట్లాడటం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. కౌలు రైతులకు ఈ ప్రభుత్వం చేసిన ప్రయోజనం ఇంతవరకు ఏ ప్రభుత్వమూ చేయలేదని మంత్రి అంబటి రాంబాబు వివరించారు. కానీ ఇవేవీ పవన్ కళ్యాణ్‌కు కనిపించకపోవడం మన దౌర్భాగ్యం అన్నారు. చంద్రబాబు కోసమే ఉద్భవించిన రాజకీయ పార్టీ జనసేన అని.. పవన్ […]
ప్రస్తుతం నిమ్మకాయ రేటు ఆకాశాన్ని అంటుతోంది. కేజీ నిమ్మకాయల ధర రూ.200పైగా పలుకుతోంది. దీంతో పలువురు వంటల్లో నిమ్మకాయ పులుపు చాలావరకు తగ్గించేశారు. చాలా చోట్ల రెస్టారెంట్లు, హోటళ్లలో ఉల్లిపాయతో పాటు నిమ్మకాయ ఇవ్వడం మానేశారు. అదేదో సినిమాలో వరంగల్‌లో నిమ్మకాయను ఏమంటారంటే నిమ్మకాయనే అంటారనే కామెడీ డైలాగ్ తరహాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో ఉల్లిపాయని నిమ్మకాయ అనాల్సి వస్తోంది. అదేంటి నిమ్మకాయను ఉల్లిపాయ అనడమేంటని అనుకుంటున్నారా? దీని కథేంటో పూర్తిగా తెలుసుకుందాం […]
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆరోపించారు. సినిమాల్లో నటించడం, కోట్లు సంపాదించడం మినహా పవన్ కళ్యాణ్‌కు వ్యవసాయం అంటే తెలియదని ఎద్దేవా చేశారు. అన్నీ పాములు ఆడితే ఏలిక పాము కూడా లేచి ఆడిందన్న చందంగా పవన్ కళ్యాణ్ వ్యవసాయం గురించి మాట్లాడటం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. కనీసం ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచే అర్హత కూడా పవన్ […]
జాతీయ పతాకానికి సంబంధించి పాకిస్థాన్ నెలకొల్పిన 18 ఏళ్ల రికార్డును భారత్ బద్దలుకొట్టింది. బీహార్ జగదీష్‌పూర్‌లో శనివారం నాడు సుమారు 77,900 మంది ప్రజలు ఒకేసారి భారత జాతీయ పతాకాలను చేతిలో పట్టుకుని గాలిలో ఊపుతూ రికార్డు సృష్టించారు. ఇది ఓ రికార్డు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని లెక్కించడానికి గిన్నిస్ రికార్డు సంస్థ ప్రత్యేకంగా కెమెరాలు కూడా ఏర్పాటు చేసింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ […]
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌లో టీమిండియా ఆల్‌రౌండన్ హార్డిక్ పాండ్యా నేతృత్వం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ద్వారా పాయింట్ల పట్టికలో ఆ జట్టు అగ్రస్థానంలో నిలిచింది. హార్డిక్ పాండ్యాను ముంబై ఇండియన్స్ వదిలేయడం గుజరాత్ టైటాన్స్‌కు కలిసొచ్చిందనే చెప్పాలి. మహా జట్లను తోసిరాజని టైటిల్ రేసులో గుజరాత్ టైటాన్స్ దూసుకుపోతుందంటే దానికి కారణం హార్డిక్ పాండ్యానే. బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్ ప్లేస్‌మెంట్లలోనూ అతడు తనదైన మార్క్ […]