ఐపీఎల్ 2022 సీజన్ చప్పగా ప్రారంభమైనా ప్రస్తుతం రంజుగా కొనసాగుతోంది. ఈ ఏడాది జట్ల సంఖ్య పెరిగినా మ్యాచ్‌ల సంఖ్య మాత్రం 74గానే ఉంది. వీటిలో 70 లీగ్ మ్యాచ్‌లు ఉండగా మిగతా నాలుగు మ్యాచ్‌లు ప్లే ఆఫ్స్ కిందకు వస్తాయి. కరోనా కారణంగా లీగ్ మ్యాచ్‌లను మహారాష్ట్రలోని నాలుగు స్టేడియాల్లో మాత్రమే బీసీసీఐ నిర్వహిస్తోంది. ప్రస్తుతం లీగ్ దశలో సగం మ్యాచ్‌ల సంఖ్య పూర్తి కావడంతో బీసీసీఐ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు వేదికలను ఖరారు చేసింది. ఈ మ్యాచ్‌లు మాత్రం మహారాష్ట్రలో జరగడం లేదు.
ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను గుజరాత్‌లోని అహ్మదాబాద్, కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియాల్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా మే 24, 26 తేదీల్లో క్వాలిఫయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. మే 27న జరగనున్న క్వాలిఫయర్ 2తో పాటు.. మే 29న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌లకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లకు వంద శాతం ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతి ఇస్తామని బీసీసీఐ వెల్లడించింది. కాగా మే 22 వరకు జరిగే లీగ్ మ్యాచ్‌లకు కరోనా కారణంగా 50శాతం ప్రేక్షకులకు మాత్రమే బీసీసీఐ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.