HIV: కండోమ్ లేకుండా శృంగారం.. దేశంలోనే ఏపీ నంబర్‌వన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఎక్కడ చూసినా విచ్చలవిడిగా శృంగారం చేస్తున్నారు. ఒకరి కంటే ఎక్కువ మందితో శృంగారం చేసే విషయంలో చాలా మంది కండోమ్ లేకుండా ఈ కార్యంలో పాల్గొంటున్నారు. దీంతో హెచ్‌ఐవీ అనేది కామన్ డిసీజ్‌గా మారిపోయింది. దేశవ్యాప్తంగా అరక్షిత లైంగిక సంపర్కంతో గత పదేళ్లలో 17.08 లక్షల మంది హెచ్‌ఐవీ బారిన పడినట్లు తాజాగా ఎయిడ్స్ నివారణ సంస్థ వెల్లడించింది. ఎయిడ్స్ కేసులకు సంబంధించి మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్రశేఖర్ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త అడిగిన ప్రశ్నకు ఎయిడ్స్ నివారణ సంస్థ ఈ మేరకు బదులిచ్చింది.
గడిచిన పదేళ్లలో అంటే 2011-21 మధ్య కాలంలో భారత్‌లో 17 లక్షల 8 వేల 777 మందికి హెచ్ఐవీ సోకినట్లు ఎయిడ్స్ నివారణ సంస్థ తెలిపింది. అయితే దశాబ్ద కాలంగా ఎయిడ్స్ బారిన పడేవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నట్లు సదరు సంస్థ వివరించింది. అరక్షిత లైంగిక సంపర్కం కారణంగా 2011-12లో 2.4లక్షల మందికి హెచ్ఐవీ సోకగా.. 2020-21లో ఆ సంఖ్య 85,268గా ఉన్నట్లు తెలిపింది. గత పదేళ్లలో రాష్ట్రాల వారీగా నమోదైన హెచ్‌ఐవీ కేసులను పరిశీలిస్తే దేశంలోనే ఏపీ నంబర్‌వన్ రాష్ట్రంగా కనిపిస్తోంది. గత పదేళ్లలో కండోమ్ వాడకపోవడం వల్ల ఏపీలో 3,18,814 మందికి హెచ్ఐవీ సోకింది. ఈ జాబితాలో ఏపీ తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర (2,84,577 కేసులు), కర్ణాటక (2,12,982 కేసులు), తమిళనాడు (1,16,53 కేసులు), ఉత్తరప్రదేశ్ (1,10,911 కేసులు), గుజరాత్ (87,440 కేసులు) ఉన్నాయి.
Also Read
- Nepal Floods: నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులపై మంత్రి లోకేష్ సమీక్ష.. ముగ్గురి ఆచూకీ కోసం ముమ్మర ప్రయత్నాలు!
- Gold Theft: ట్రావెల్స్ బస్సులో భారీ చోరీ.. రూ.50 లక్షల విలువైన బంగారం మాయం!
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
తాజావార్తలు
-
TVS Jupiter Dual Tone Spectral లాంచ్.. రూ.89,825కే.. అదిరిపోయే మైలేజ్, ఫీచర్లు..!
-
MOTN Survey 2026: మళ్లీ బీజేపీదే అధికారం.. ఇప్పుడే ఎన్నికలు జరిగితే ఎన్డీయేకు 326 సీట్లు..
-
Nepal Floods: వేళ్లన్నీ డ్రాగన్ వైపే.. విలయానికి చైనా నిర్మాణాలే కారణమా?
-
Government Action : వనపర్తిలో బుల్డోజర్ యాక్షన్.. రూ.52 కోట్ల బకాయిలపై ఉక్కుపాదం
-
Nepal Floods: నేపాల్‌కు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!