ఏపీలో పాఠశాలలకు మే 6 నుంచి జూలై 3 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సెలవులు టీచర్లకు వర్తించవు అని.. మే 20 వరకు టీచర్లు పాఠశాలలకు రావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అంశంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా స్పందించారు. టీచర్లకు సెలవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. టీచర్లకు సెలవులు వేసవి కాలంలో కాకుండా వర్షాకాలంలో ఇస్తారా అంటూ ఎద్దేవా […]
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేయాలంటూ విజయవాడలో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో విజయవాడలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. తమ ప్రభుత్వం అవకాశం ఉన్నంతవరకు ప్రతి అంశాన్ని పరిష్కరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. సమస్యలను పరిష్కరించడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, సీపీఎస్ విధానంపై సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి బొత్స తెలిపారు. విద్యా శాఖలో సంస్కరణలు దశలు వారీగా వస్తాయన్నారు. […]
దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 11 వారాల పాటు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన తర్వాత మూడు వారాలుగా కేసులు క్రమంగా మళ్లీ పుంజుకుంటున్నాయి. గత వారంతో పోలిస్తే కేసుల సంఖ్య రెట్టింపు అయ్యింది. తాజాగా దేశంలో గత 24 గంటల్లో 2,541 కరోనా కేసులు వెలుగు చూశాయి. కరోనాతో మరో 30 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 16,522గా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు […]
విజయవాడలో మరోసారి కలకలం రేగింది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ఓ లాడ్జీలో ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో వెంటనే బాధితులను ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మచిలీపట్నంకు చెందిన జూపూడి వెంకటేశ్వరరావు కుటుంబం ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. అప్పుల వాళ్లు బాకీలు ఇవ్వాలని పోరు పెడుతుండటంతో ఏం చేయాలో తెలియక వెంకటేశ్వరరావు కుటుంబం విజయవాడకు వచ్చి లాడ్జీలో ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పురుగుల మందు తాగి […]
ఈ సీజన్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఆదివారం రాత్రి వాంఖడే స్టేడియం వేదికగా ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 36 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 132 పరుగులే చేయగలిగింది. ముంబై జట్టు ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ వైఫల్యం ముంబై జట్టుపై భారీగా […]
రాష్ట్రంలో విద్యుత్ రంగంలో నెలకొన్న సమస్యలపై విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో ఆదివారం సాయంత్రం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. బొగ్గు కొరత వల్ల దేశంలోని అనేక రాష్ట్రాలు విద్యుత్ సమస్యలతో సతమతం అవుతున్నాయని తెలిపారు. ఏపీలో విద్యుత్ సమస్యలకు కూడా దేశంలోని బొగ్గు కొరత కారణమని వెల్లడించారు. అటు కరోనా సంక్షోభం, భారీ వర్షాలు బొగ్గు ఉత్పాదనను ప్రభావితం చేశాయని తెలిపారు. అంతేకాకుండా రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధ ప్రభావం […]
2024 ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తులు ప్రారంభించాయి. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు 2024 ఎన్నికలపై త్వరలోనే కార్యాచరణ సిద్ధం చేస్తామని ప్రకటించారు. తాజాగా వైసీపీ అధినేత, సీఎం జగన్ కూడా ఈ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 27న తాడేపల్లిలో జగన్ కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు హాజరుకానున్నారు. కాగా మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీతో […]
భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. దేశానికి, సమాజానికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నందుకు ప్రధాని మోదీకి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డును నిర్వాహకులు ప్రదానం చేశారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మోదీకి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉషా మంగేష్కర్, ఆశాభోంస్లే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర […]
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. దీంతో ముంబై ముందు 169 పరుగుల టార్గెట్ నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ఆరంభంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే ఓపెనర్ కేఎల్ రాహుల్ మాత్రం వన్ మ్యాన్ షో చేశాడు. 62 బంతుల్లో 103 నాటౌట్‌తో జట్టుకు […]
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ హింస కేసులో ప్రధాన నిందితుడు, కేంద్రమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కోర్టులో లొంగిపోయాడు. లఖింపూర్‌లో వ్యవసాయ చట్టాలపై శాంతియుతంగా పోరాడుతున్న రైతులపైకి కారుతో వేగంగా దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు సహా ఆ తర్వాత జరిగిన అల్లర్లలో మరో నలుగురు సహా మొత్తం 8 మంది మృతికి కారకుడయ్యాడంటూ ఆశిష్ మిశ్రాపై తీవ్ర అభియోగాలు వచ్చాయి. దీంతో ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆశిష్ మిశ్రాపై […]