రైతుల కోసం మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వ్యవసాయానికి సంబంధించి ఈనెల 25 నుంచి 30 వరకు దేశవ్యాప్తంగా ప్రచారం చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ‘కిసాన్ భగీదారీ ప్రాథమిక హమారీ’ పేరిట ప్రచారాన్ని నిర్వహించాలని తలపెట్టింది. వ్యవసాయానికి సంబంధించిన అన్ని సంస్థలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొననున్నాయి. రైతులకు మేలు చేయడమే లక్ష్యంగా ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. దేశంలో ఉన్న 720 కృషి విజ్ఞాన […]
టీడీపీ నేత బోండా ఉమా చేసిన వ్యాఖ్యలకు ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కౌంటర్ ఇచ్చారు. తనకు పబ్లిసిటీ పిచ్చి అని బోండా ఉమ ఆరోపణలు చేస్తున్నాడని.. మూడేళ్లుగా మహిళా కమిషన్ తరఫున పనిచేస్తున్నా ఏ రోజు కూడా పబ్లిసిటీ గురించి పట్టించుకోలేదని వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. బోండా ఉమ ఆకు రౌడీ అనుకున్నానని.. కాదు ఆయన చిల్లర రౌడీ అని ఎద్దేవా చేశారు. రాజకీయ నాయకుడి రూపంలో ఉన్న కాలకేయుడు అని.. […]
అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షించి పర్యటనలపై నేతలతో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వ తీరుపైనా చంద్రబాబు చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం తన అసమర్ధతకు బలి చేసిందని ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లు జగన్ ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టిందని నిలదీశారు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి […]
ఆదివారం రాత్రి లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో లక్నో ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. అసలు ఏం జరిగిందంటే.. లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ ఆటగాడు కీరన్ పొలార్డ్ వేగంగా ఆడలేకపోయాడు. 20 బంతుల్లో కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. చివరి ఓవర్‌లో ముంబై గెలవాలంటే 38 పరుగులు చేయాలి. ఈ దశలో లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ చివరి […]
ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ విరుచుకుపడ్డారు. విజయవాడ అత్యాచార బాధితురాలికి అండగా నిలవడమే తాము చేసిన తప్పా అని బోండా ఉమ ప్రశ్నించారు. తాము బాధితురాలిని కలవడానికి వెళ్తున్నామని తెలిసే.. వాసిరెడ్డి పద్మ అక్కడికి చేరుకుని ఓవరాక్షన్ చేశారని మండిపడ్డారు. ఘటన జరిగిన మూడు రోజుల ఆమె బాధితురాలిని కలిసి రాజకీయానికి తెరతీశారని ఆరోపించారు. బాధితురాలి కుటుంబాన్ని రోడ్డుకు లాగిందే వాసిరెడ్డి పద్మ అని తీవ్ర విమర్శలు చేశారు. […]
అమరావతిలో సహజ, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వంపై నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించింది. ప్రకృతి వ్యవసాయం కోసం ఏపీ సీఎం ఇప్పటికే అద్భుతమైన చర్యలు తీసుకున్నారని.. తాను ప్రత్యక్షంగా ఆర్బీకేలను పరిశీలించానని.. ఆర్బీకేలు అందిస్తున్న సేవలు నిజంగా అభినందనీయమంటూ నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు ఏపీ సీఎం జగన్ […]
ఉక్రెయిన్-రష్యా యుద్ధం తర్వాత అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిపిందు. అయితే ప్రస్తుతం ముడి చమురు ధరలు కాస్త కిందకు దిగొచ్చాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం ఇంకా ముగియకున్నా.. చైనాలో కరోనా కేసులు పెరుగుతున్నా.. ముడి చమురు దరలు మాత్రం తగ్గడం విశేషం. చైనా నుంచి డిమాండ్ తగ్గడంతో బ్యారెల్‌పై 3.12 శాతం మేర ధర తగ్గింది. దీంతో ప్రస్తుతం బ్యారెల్ ధర 99.67 డాలర్లుగా ఉంది. […]
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే తాజాగా ఓ ఇంటి వాడయ్యాడు. కాన్వే న్యూజిలాండ్ క్రికెటర్ అయినా అతడి సొంత దేశం దక్షిణాఫ్రికా. అక్కడే పుట్టి పెరిగాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్ మాత్రం న్యూజిలాండ్ తరఫున ఆడుతున్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్‌గా కాన్వే రాణిస్తుండటంతో చెన్నై సూపర్‌కింగ్స్ ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో రూ.కోటికి కోనుగోలు చేసింది. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. అయితే ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన […]
బాలాజీ జిల్లా శ్రీకాళహస్తి శివారులో సోమవారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. నాయుడుపేట-పూతలపట్టు రహదారిపై లారీ-ఆటో ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి చెందగా 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో క్షతగాత్రులను స్థానికులు వెంటనే సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. చంద్రగిరికి చెందిన 12 మంది ఆటోలో నాయుడుపేట సమీపంలోని కనువూరమ్మ అమ్మవారిని దర్శించుకుని తిరిగివస్తుండగా శ్రీకాళహస్తి సమీపంలోని అర్ధనారీశ్వరాలయం సమీపంలో లారీ ఢీకొట్టింది. అయితే ఈ ఘటనకు ప్రధాన కారణంగా లారీ డ్రైవర్ […]