కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. శనివారం ఆయన ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. అయితే రాహుల్ ఓయూ పర్యటనకు యూనివర్సిటీ అధికారులు అనుమతి నిరాకరించారు. దాంతో కాంగ్రెస్ ఇప్పటి వరకు రెండు సార్లు హైకోర్టును ఆశ్రయించింది. అయినా ఫలితం లేకపోయింది. రాహుల్ ఓయూ సందర్శనకు అనుమతించాలని ఓయూ వీసీని ఆదేశించేందుకు రాష్ట్ర అత్యున్న న్యాయస్థానం నిరాకరించింది. […]
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శనపై టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. జడేజాను కెప్టెన్‌గా చేయడమే చెన్నై టీమ్ చేసిన పెద్ద తప్పు అని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. ధోనీ స్థానంలో జడేజాకు కెప్టెన్సీ ఇవ్వాలని మేనేజ్‌మెంట్ భావించినప్పుడు ఈ సీజన్ మొత్తానికి జడేజానే కొనసాగించాల్సిందని సెహ్వాగ్ అన్నాడు. అయితే టోర్నీ మధ్యలో మళ్లీ కెప్టెన్సీని ధోనీకి అప్పగించడం సరికాదని పేర్కొన్నాడు. అటు తుది జట్టులోని 11 మంది ఆటగాళ్లను పదే పదే మార్చుతుండటాన్ని […]
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూక్ మాండవీయకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. నీట్ పీజీ-2022 పరీక్షలు వాయిదా వేయాలని లేఖలో కోరారు. కోవిడ్ కారణంగా గతేడాది నీట్ పరీక్ష నిర్వహణ, కౌన్సెలింగ్ ఆలస్యం కావడం వల్ల తదుపరి సెషన్‌కు అభ్యర్థులు సిద్ధంగా లేరని లోకేష్ తన లేఖలో ప్రస్తావించారు. తెలుగు రాష్ట్రాల్లో మెడికల్ విద్యార్థుల ఏడాది ఇంటర్న్ షిప్ పూర్తి కాకపోవడంతో వారు నీట్ పీజీ పరీక్షకు అర్హత సాధించే అవకాశం […]
ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాలలో ఈ సాయంత్రం పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆయా జిల్లాలలో రైతులు వెంటనే పొలాల నుంచి ఇంటికి చేరుకోవాలని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు, గొర్రెల కాపరులు చెట్ల కింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన […]
విశాఖ పర్యటనలో టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన క్రియాశీలక సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లే బాధ్యత టీడీపీ కార్యకర్తల భుజస్కంధాలపై ఉందన్నారు. పార్టీలో పని చేసే వాళ్ళకే పదవులు, ప్రజలతో ఉన్న వాళ్ళకే నాయకత్వ అవకాశం దక్కుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే 30 ఏళ్లు అధికారంలో ఉండేలా ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు. పార్టీలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు పార్టీలో […]
ఏపీ రాజకీయాల్లో ఆసక్తి రేకెత్తించిన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్ అధ్యక్ష పదవి వైసీపీ ఖాతాలో చేరింది. ఎంపీటీసీల పరంగా చూసుకుంటే ప్రతిపక్ష టీడీపీకి మెజారిటీ ఉన్నా తాజా పరిణామాలతో పరిస్థితి తారుమారైంది. ఈ మేరకు దుగ్గిరాల ఎంపీపీగా వైసీపీకి చెందిన ఎంపీటీసీ సంతోషి రూపారాణి ఎన్నికయ్యారు. ఆమె ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని అధికారులు ప్రకటించారు. దుగ్గిరాల ఎంపీపీ పదవి బీసీ మహిళకు రిజర్వ్ కాగా… ఆ వర్గానికి చెందిన ఎంపీటీసీలు టీడీపీలో ఎవరూ లేరు. […]
ఏపీలో పదో తరగతి పరీక్షల పేపర్లు వరుసగా లీక్ అవుతుండటంపై సీఎం జగన్ స్పందించారు. పదో తరగతి పరీక్ష పేపర్లను నారాయణ, చైతన్య స్కూల్ నుంచి లీక్ చేయించారని.. రెండు పేపర్లు నారాయణ స్కూల్ నుంచి లీక్ అయ్యాయని.. మూడు పేపర్లు శ్రీచైతన్య స్కూల్ నుంచి లీక్ అయ్యాయని జగన్ ఆరోపించారు. వీళ్ళే పేపర్ లీక్ చేసి ఏదో జరిగిపోయిందని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దొంగే దొంగ అన్నట్లుగా ప్రచారం చేశారని.. వాట్సాప్ ద్వారా పేపర్‌లను బయటకు […]
ఐపీఎల్‌లో ఈరోజు ఆసక్తికర సమరం జరగనుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తలపడనుంది. అయితే గతంలో 9 ఏళ్ల పాటు సన్‌రైజర్స్ జట్టులో ఆడిన డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. 9 ఏళ్ల పాటు సన్‌రైజర్స్ జట్టుతో ఆడటం వల్ల ఆ జట్టుతో వార్నర్‌కు మంచి అనుభవం ఉంది. కానీ గత ఏడాది అవమానకర రీతిలో వార్నర్‌కు తుదిజట్టులో కూడా చోటు దక్కలేదు. మేనేజ్‌మెంట్‌తో తారాస్థాయికి చేరిన విభేదాల […]
తెలంగాణలో ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండ ప్రకాష్ రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణలో ఓ రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది. ఈ మేరకు ఉప ఎన్నిక నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు షెడ్యూల్ విడుదల చేసింది. మే 12న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. నామినేషన్‌ల దాఖలుకు చివరి తేదీ మే 19గా ఉంటుంది. మే 30న ఉప ఎన్నిక జరగనుంది. ఆ రోజు […]