టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొరిగే కుక్క కరవద అని.. చంద్రబాబు పరిస్థితి కూడా అంతేనని ఎద్దేవా చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న నాయకుడిపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబుకు పాఠం చెప్పారని.. వచ్చే 25 ఏళ్ళు చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి […]
వరంగల్‌లో రైతు సంఘర్షణ సభలో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి రైతు సమస్యలపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే ఏడాది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని ప్రకటించారు. తాము ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. కౌలు రైతులకు ఎకరానికి రూ.15వేల పెట్టుబడి సాయం అందిస్తామని పేర్కొన్నారు. అటు రైతు కూలీలకు ఏడాదికి […]
ఇటీవల గాయం కారణంగా క్రికెట్‌కు దూరమైన ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అదిరిపోయే రీతిలో రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం కౌంటీ క్రికెట్ ఆడుతున్న బెన్ స్టోక్స్ మైదానంలో తన విశ్వరూపం చూపించాడు. కౌంటీల్లో డుర్హామ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు 64 బంతుల్లోనే సెంచరీ చేసి తనలోని సత్తాను బయటపెట్టాడు. అంతేకాకుండా ప్రత్యర్థి జట్టు బౌలర్ వేసిన ఒకే ఓవర్‌లో 34 పరుగులు పిండుకున్నాడు. ఈ ఓవర్‌లో వరుసగా ఐదు సిక్సర్లు, ఫోర్ సాధించాడు. దీంతో […]
ఏపీలో నిరుద్యోగులకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గుడ్ న్యూస్ అందించారు. శని, ఆదివారాల్లో గుంటూరు-విజయవాడ జాతీయరహదారిపై నెలకొన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెండు రోజుల పాటు వైసీపీ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు జాబ్ మేళా ఏర్పాట్లను శుక్రవారం మధ్యాహ్నం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్సీలు, ఇతర వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. పశ్చిమ గోదావరి, కృష్ణా, […]
జగనన్న విద్యాదీవెన పథకం కింద 10.85 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం గురువారం నాడు డబ్బులు జమ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఏపీ ప్రభుత్వం ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఖాతాల్లో జమ అయిన ఈ సొమ్మును వారం, పది రోజుల్లో కాలేజీలకు విద్యార్థుల తల్లులు చెల్లించాలని ఆదేశించింది. ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు అందిన తర్వాత కూడా కాలేజీలకు చెల్లించకపోతే.. తదుపరి విడతలో నిధులను నేరుగా కాలేజీలకే జమ […]
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆకస్మిక మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. బొజ్జల వార్త తెలియగానే తాను ఆవేదనకు గురయ్యానని తెలిపారు. బొజ్జల మరణం అత్యంత బాధాకరమని చంద్రబాబు పేర్కొన్నారు. లాయర్‌గా వృత్తి జీవితం ప్రారంభించిన బొజ్జల ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చారన్నారని గుర్తుచేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు బొజ్జల ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవారని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. […]
ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ సెటైర్లు వేశారు. పోలవరం పనులపై మంత్రి అంబటి రాంబాబుకు శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. పోలవరం ప్రాజెక్ట్ గురించి ఎవరేం అడిగినా ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు రెండు చేతులు పైకెత్తి తనకేం తెలియదంటున్నారని ఎద్దేవా చేశారు. చేయాల్సిదంతా చేసేసి.. పోలవరం నిర్మాణం ఎప్పుడవుతుందో చెప్పలేం అని సీఎం జగన్ మంత్రి అంబటితో చెప్పిస్తున్నారని […]
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శలు చేశారు. ఎన్నికల్లో చంద్రబాబుకు సొంతంగా పోటీ చేసే ధైర్యం లేదని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పొత్తులతోనే చంద్రబాబు పోటీ చేస్తారని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఢీకొట్టే ధైర్యం చంద్రబాబుకు లేదని మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. అనైతిక పొత్తులతో పోటీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. అయితే ఏపీలో ప్రజలంతా వైసీపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు, […]
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (73) అనారోగ్యంతో గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. హైదరాబాద్‌లోని నివాసంలో అపస్మారక స్థితిలో ఉన్న ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో ఆయన తుది శ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా ఉరందూరులో 1949, ఏప్రిల్ 15న బొజ్జల గోపాలకృష్ణారెడ్డి జన్మించారు. ఆయన తండ్రి, శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే గంగా సుబ్బరామిరెడ్డి వారసుడిగా 1989లో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా ఐదుసార్లు […]
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా వంటనూనెల ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు ఇండోనేషియా వంటి దేశాలు పామాయిల్ దిగుమతులపై నిషేధం విధించడం కూడా వంటనూనెల ధరలకు రెక్కలు రావడానికి కారణమైంది. దీంతో మూడు నెలలుగా దాదాపు కిలో వంట నూనె ధర రూ.70 నుంచి రూ.100 పెరిగింది. అయితే త్వరలోనే వంట నూనెల ధరలు తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వంట నూనెల విషయంలో ఇండియా సుమారు 60 శాతం […]