అక్షయ తృతీయ కావడంతో తెలుగు రాష్ట్రాల్లో బంగారం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కరోనా ప్రభావంతో గత రెండేళ్లు అక్షయ తృతీయ కళ తప్పగా.. ఈ ఏడాది మాత్రం బంగారం విక్రయాలు పెరిగాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం బంగారం ధర కూడా తక్కువగా ఉండటంతో ప్రజలు బంగారం కొనుగోలు చేయడానికి మక్కువ చూపిస్తున్నారు. దీంతో ఏపీ, తెలంగాణలోని జ్యువెలరీ షాపులు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. అయితే సందట్లో సడేమియా లాగా పలు షాపుల్లో యజమానులు అక్రమాలకు పాల్పడుతున్నారు. […]
ఏపీలో 52 మంది అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ అడిషనల్ డీసీపీగా సి.జయరామరాజు, అనంతపురం అడిషనల్ ఎస్పీగా ఇ.నాగేంద్రుడు, తూర్పుగోదావరి అడిషనల్ క్రైమ్ ఎస్పీగా జి.వెంకటేశ్వరరావు, ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీగా బి.నాగభూషణ్‌రావు, మెరైన్ అడిషనల్ ఎస్పీగా జీబీఆర్ మధుసూదన్‌రావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీగా జి.స్వరూపరాణి, అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా వెంకట రామాంజనేయులు, విజిలెన్స్ అండ్ […]
దేశంలో హిందీ భాషా వివాదం నడుస్తోంది. కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ మధ్య మొదలైన హిందీ భాషా వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తాజాగా హిందీ భాషా వివాదంపై సీనియర్ నటి సుహాసిని స్పందించారు. నటులు అన్న తర్వాత అన్ని భాషలు నేర్చుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. హిందీ భాష అనేది మంచి లాంగ్వేజ్ అని.. అది కూడా నేర్చుకోవాలని.. అది ముఖ్యమని వ్యాఖ్యానించారు. హిందీ మాట్లాడే వాళ్ళు మంచి వాళ్లు […]
ఐపీఎల్‌లో ఈరోజు మరో ఆసక్తికర సమరం జరగనుంది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో పంజాబ్ కింగ్స్ జట్టు తలపడనుంది. ఆడేది తొలి సీజన్ అయినా గుజరాత్ టైటాన్స్ అద్భుత ఆటతీరు కనపరుస్తోంది. హార్డిక్ పాండ్యా నేతృత్వంలోని ఆ జట్టు ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్ జట్టు ఇప్పటివరకు టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలు సాధించి 16 పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. మరో రెండు పాయింట్లు సాధిస్తే […]
చాన్నాళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఐపీవో మే 4 నుంచే ప్రారంభం కానుంది. దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా ఎల్‌ఐసీ ప్రవేశించనుంది. ఈ మేరకు ఎల్‌ఐసీ ఒక్కో ఈక్విటీ షేర్‌ను కేంద్ర ప్రభుత్వం రూ.902 నుంచి 949గా నిర్ణయించింది. అయితే పాలసీదారుల కోసం ఎల్‌ఐసీ ఐపీవోలోని ప్రతి షేరుపై రూ.60 తగ్గింపును కల్పించనున్నట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. రిటైల్‌తో పాటు ఇతర పార్టిసిపెంట్ల కోసం మే 4 నుంచి మే […]
తిరుపతిలో ప్రసిద్ధి చెందిన శ్రీగోవిందరాజస్వామి ఆలయంలో ఈనెలలో విశేష ఉత్సవాలు జరగనున్నాయి. ఈ మేరకు విశేష ఉత్సవ వివరాలను ఆలయ అధికారులు వెల్లడించారు. మే 5న తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శ్రీ భాష్యకార్లువారి శాత్తుమొర కార్యక్రమం ఉంటుందన్నారు. మే 5న ఉదయం 7 గంటలకు శ్రీభాష్యకార్లు స్వామి, సాయంత్రం 5:30 గంటలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి, శ్రీ భాష్యకార్లు స్వామి ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తారని తెలిపారు. అటు మే […]
రంజాన్ సందర్భంగా దేశవ్యాప్తంగా ఘనంగా ఈద్ సంబరాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు కూడా ఈద్ సంబరాలను నిర్వహించింది. ఈ క్రమంలో చెన్నై సూపర్‌కింగ్స్ కెప్టెన్ ఎం.ఎస్.ధోనీ, మొయిన్ అలీ, డ్వేన్ బ్రావో, రాబిన్ ఉతప్ప, అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్ వంటి ఆటగాళ్లు ఈద్ సంబరాల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్‌కింగ్స్ యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియోలో కొంతమంది చిన్నారులతో ధోనీ సరదాగా గడపడం […]
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి చెందిన ఓ నైట్ క్లబ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నేపాల్ రాజధాని ఖాట్మండులోని ఓ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ పక్కన ఓ మహిళ ఉండటంపై విమర్శల వర్షం కురుస్తోంది. బీజేపీ జాతీయ ఐటీ విభాగం చీఫ్ మాళవియా రాహుల్ వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేసి ఆమె రాహుల్ గాంధీకి చురకలు అంటించారు. సొంతపార్టీలో రచ్చ నడుస్తుంటే ఆయన మాత్రం నైట్ క్లబ్‌లో […]
టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్‌ను కొనుగోలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే ఎలన్ మస్క్ ట్విట్టర్ అకౌంట్‌కు సంబంధించి ఆసక్తికర అంశం వెల్లడైంది. మస్క్ ట్విటర్ ఫాలోవర్లలో సగానికి సగం మంది ఫేక్ అని వెల్లడైంది. ట్విటర్ ఆడిటింగ్ టూల్ స్పార్క్‌టోరో ప్రకారం రీసెర్చ్ ఆడిట్ సమయానికి మస్క్‌కు ఉన్న 8.79 కోట్ల ఫాలోవర్లలో 48 శాతం మంది ఫేక్ అని తేలినట్లు టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. ఈ ఖాతాల్లో […]
విశాఖలోని సింహాద్రి ఎన్టీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. నాలుగు యూనిట్లలో ఒకేసారి గ్రిడ్ వైఫల్యం చెందడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. అయితే ఈ ఘటనపై ఎన్టీపీసీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. భారీగా వీచిన ఈదురుగాలులు, వర్షం కారణంగా గాజువాక, కాలపాకలో సబ్‌స్టేషన్లు ట్రిప్ అయ్యాయని ఎన్టీపీసీ వెల్లడించింది. దీంతో సింహాద్రిలోని నాలుగు యూనిట్లలోనూ ట్రిప్ అయి 2వేల మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిందని పేర్కొంది. ప్రస్తుతం నేషనల్ గ్రిడ్ నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని […]