బీహార్ రాష్ట్రంలోని గయాలో నివసించే ఆ కుటుంబానికి పక్షులను పెంచుకోవడం అంటే చాలా ఇష్టం. పక్షులను కూడా సొంత బిడ్డల తరహాలో అపురూపంగా చూసుకుంటారు. అయితే కొన్నిరోజులుగా శ్యామ్‌దేవ్ ప్రసాద్ గుప్త, సంగీత గుప్త దంపతులు పెంచుకుంటున్న చిలుక కనిపించకుండా ఎటో వెళ్లిపోయింది. దీంతో ఆ కుటుంబం నానా హైరానా పడుతోంది. తాము అనేక రకాలుగా ప్రయత్నించినా చిలుక కనపడలేదని శ్యామ్‌దేవ్ ప్రసాద్ గుప్త దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ చిలుక కనిపించడం […]
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి పాలైంది. 208 పరుగుల లక్ష్యంతో ఛేదనకు దిగిన హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 186 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. నికోలస్ పూరన్(62), మార్‌క్రమ్(42) రాణించినా రన్‌రేట్ పెరిగిపోవడంతో సన్‌రైజర్స్‌కు మరో ఓటమి తప్పలేదు. ఢిల్లీ బౌలర్లలో ఖలీల్ అహ్మద్ 3 వికెట్లు, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు […]
అమరావతిలోని యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్లతో విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గురువారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. మంగళగిరిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో నెలకొన్న పరిస్థితులను మంత్రి బొత్స అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. యూనివర్సిటీలు స్వయం ప్రతిపత్తిని కాపాడుకుంటూనే ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో పని చేయాలని సూచించారు. తాను విద్యా శాఖ మంత్రిగా ఉండటం ఒక గౌరవం అని అభిప్రాయపడ్డారు. ఏపీలో సీఎం జగన్ సంక్షేమంతో […]
యూజర్లకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అందిస్తున్న వాట్సాప్ మరో ఫీచర్‌ను త్వరలో అందుబాటులోకి తేనుంది. ఈ ఫీచర్ సహాయంతో గ్రూప్ అడ్మిన్లుగా ఉన్న వ్యక్తులు గ్రూప్ సభ్యులు షేర్ చేసే మెసేజ్‌లను సులువుగా తొలగించవచ్చు. గ్రూప్‌లో ఎవరైనా తప్పుడు సమాచారాన్ని షేర్ చేస్తే గ్రూప్ అడ్మిన్ సదరు మెసేజ్‌ను డిలీట్ చేయవచ్చు. దీంతో గ్రూప్ సభ్యులకు అడ్మిన్ తమ మెసేజ్‌ను డిలీట్ చేసినట్లు చాట్ స్క్రీన్‌పై కనిపించనుంది. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే […]
శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో గురువారం నాడు హుండీలను లెక్కించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో పటిష్ట బందోబస్తు మధ్య సిబ్బంది, శివసేవకులు ఉభయ దేవాలయాలతో పాటు నిత్యాన్నదానం హాలులోని హుండీలను లెక్కించారు. గత 27 రోజులుగా స్వామి, అమ్మవార్లకు రూ.3,09,52,777 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో లవన్న తెలిపారు. అంతే కాకుండా 267 గ్రాముల బంగారం, ఐదు కిలోలకు పైగా వెండి ఆభరణాలు, 323 యూఎస్ డాలర్లు, 197 సౌదీ రియాల్స్, 137 […]
ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియం వేదికగా ఈరోజు ఐపీఎల్‌లో 50వ మ్యాచ్ జరిగింది. సన్‌రైజర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి ముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. అందరూ అనుకున్నట్లే ఢిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన పాత టీమ్ సన్‌రైజర్స్‌పై చెలరేగి ఆడాడు. మరో ఓపెనర్ మన్‌దీప్ సింగ్ డకౌట్‌గా వెనుతిరిగినా వార్నర్ మాత్రం కళ్లు చెదిరేలా బ్యాటింగ్ చేశాడు. 58 బంతుల్లో 12 […]
టీడీపీ అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. రుషికొండ వెళ్లకుండా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. గతంలో రుషికొండలోని హరిత రిసార్టును జగన్ సర్కారు కూల్చివేసింది. దీంతో ఆధునీకరణ పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారంటూ చంద్రబాబు రుషికొండ పర్యటనకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే తనను రుషికొండ వెళ్లకుండా ప్రభుత్వం అడ్డుకోవడంపై చంద్రబాబు మండిపడ్డారు. తాళ్లవలసలో బహిరంగ సభలో ఆయన జగన్ సర్కారుపై నిప్పులు చెరిగారు. 2029 నాటికి దేశంలో ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలని తాను ప్రణాళికలు […]
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దేశవ్యాప్తంగా పలు శాఖలను మూసివేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. కొన్నేళ్లు ఈ బ్యాంక్ ఒడిదొడుకులకు లోను కావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 13 శాతం బ్రాంచీలు అంటే దేశవ్యాప్తంగా సుమారు 600 బ్రాంచీలు మూతపడే అవకాశాలున్నాయి. ఒకవేళ శాఖలను మూసివేయడం […]
కేరళలో వెలుగు చూసిన షిగెల్లా బ్యాక్టీరియా వల్ల దేశంలో తొలి మరణం సంభవించింది. కేరళలో 16 ఏళ్ల అమ్మాయి దేవానంద షిగెల్లా బ్యాక్టీరియా బారినపడి చనిపోయింది. ఓ ఫుడ్ స్టాల్ వద్ద షవర్మాను తినడం వల్ల ఆమెలో బ్యాక్టీరియా సోకిందని కుటుంబీకులు ఆరోపిస్తు్న్నారు. షవర్మా తిన్న రెండు రోజులకే తమ కుమార్తె మరణించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ కేసును కేరళ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతోంది. కాగా షిగెల్లా బ్యాక్టీరియా సోకడం అనేది […]
ఏపీలో ప్రభుత్వాస్పత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అసలు పాలన ఉందా అని ఆయన ప్రశ్నించారు. రోజురోజుకు మానవత్వం మసకబారిపోతోందని.. తమవారిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నవారికి చేతనైన సహాయం అందించాల్సింది పోయి అక్కడ కూడా డబ్బులు, రూల్స్ అంటూ వైద్య సిబ్బంది ప్రవర్తించడం దారుణమని సోము వీర్రాజు మండిపడ్డారు. తిరుపతిలో కాలువలో పడి మృతిచెందిన 10 సంవత్సరాల బాలుడిని ఇంటికి తీసుకెళ్లడానికి తండ్రి నానా అవస్థలు […]