ఐపీఎల్‌లో వరుస విజయాలతో జోరు మీదున్న గుజరాత్ టైటాన్స్ జట్టుకు పంజాబ్ కింగ్స్ బ్రేక్ వేసింది. డీవై పాటిల్ స్టేడియం వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 144 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు ఓపెనర్ శిఖర్ ధావన్ (62) మంచి ఆరంభం ఇచ్చాడు. మరో ఓపెనర్ బెయిర్ స్టో(1) త్వరగానే పెవిలియన్ చేరాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాజపక్స(40) ధావన్‌కు మంచి సహకారం అందించాడు. రాజపక్స అవుటైనా ఆఖర్లో లివింగ్ స్టోన్(30) మెరుపులు […]
సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మంగళవారం నాడు కీలక ప్రకటన చేసింది. కరోనా నివారణకు తీసుకునే కోవోవాక్స్ టీకా ధరను భారీగా తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ఇప్పటి వరకు కోవోవాక్స్ వ్యాక్సిన్ డోస్ ధర రూ.900 ఉండగా.. రూ.225కి తగ్గిస్తున్నట్లు సీరమ్ కంపెనీ తెలిపింది. అయితే జీఎస్టీ అదనంగా ఉంటుందని సూచించింది. ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ టీకాను తీసుకుంటే సర్వీస్ ఛార్జీగా రూ.150 వరకు వసూలు చేసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా కరోనా టీకా ధరను తగ్గించిన […]
అంతర్జాతీయ సినిమా రంగంలో ఆస్కార్ అవార్డులకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇదే తరహాలో కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ప్రదర్శితమయ్యే చిత్రాలకు కూడా అంతే గుర్తింపు ఉంటుంది. ఫ్రాన్స్‌లోని కేన్స్‌లో ఈ నెల 17 నుంచి 28 వరకు చలన చిత్రోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 75 వసంతాల స్వతంత్ర భారత్‌కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మార్కెట్‌లో అధికారిక దేశం హోదా కల్పించారు. దీంతో ఇండియాకు అరుదైన గౌరవం దక్కినట్లు అయ్యింది. కాగా […]
బరువు తగ్గడం కోసం ఇప్పుడు అందరూ సైకింగ్ చేస్తున్నారు. అయితే సైక్లింగ్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సైక్లింగ్ మీ శరీరం కోసమే కాదు, మీ మనసుకి కూడా ఉల్లాసాన్ని ఇస్తుంది. మీరు ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేయకపోయినా మెంటల్ హెల్త్‌కు సైక్లింగ్ ఎంతో ఉపయోగపడుతుంది.
పూణెలోని డీవై పాటిల్ స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. గుజరాత్ ఆటగాళ్లలో సాయి సుదర్శన్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. అతడు 50 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్సర్ సహాయంతో 64 పరుగులు చేసి తుదికంటా నాటౌట్‌గా నిలిచాడు. మిగిలిన బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లలో సాహా 21 పరుగులు, మిల్లర్ 11, రాహుల్ […]
శ్రీవిష్ణు, కేథరీన్ జంటగా నటించిన చిత్రం భళా తందనాన. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాణం సినిమా దగ్గర నుంచి దర్శకుడు చైతన్య దంతులూరిని చూస్తున్నానని.. ఎవరైనా చిన్న సినిమా చేస్తే చిన్న సినిమా చేస్తున్నట్లు, పెద్ద సినిమా చేస్తే పెద్ద సినిమా చేస్తున్నట్లు పనిచేస్తారని.. కానీ చైతన్య మాత్రం చిన్న సినిమా […]
వెస్టిండీస్ క్రికెట్ జట్టుకు ఎట్టకేలకు కొత్త కెప్టెన్ దొరికాడు. కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడంతో అప్పటి నుంచి వెస్టిండీస్ జట్టుకు సంబంధించి వన్డేలు, టీ20లకు కెప్టెన్‌గా ఎవరిని నియమించాలో తెలియక విండీస్ క్రికెట్ బోర్డు సతమతం అవుతోంది. అయితే తాజాగా వెస్టిండీస్ వన్డే, టీ20లకు కొత్త కెప్టెన్‌ను విండీస్ బోర్డు నియమించింది. కొత్త కెప్టెన్‌గా నికోలస్ పూరన్‌ను ఎంపిక చేసింది. 2023 వన్డే ప్రపంచకప్ వరకు నికోలస్ పూరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. నికోలస్ పూరన్ […]
ఏపీలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల్లో ప్రతిరోజూ పేపర్ లీక్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయితే అవి పేపర్ లీక్‌లు కాదని మాస్ కాపీయింగ్ జరుగుతోందని విద్యాశాఖ వివరణ ఇస్తోంది. ఈ నేపథ్యంలో పేపర్ లీక్, మాస్ కాపీయింగ్ లాంటి ఘటనలు చోటుచేసుకోకుండా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పదో తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ అరికట్టేలా చర్యలు చేపట్టింది. పదో తరగతి పరీక్షా కేంద్రాలను నో-ఫోన్ జోన్లుగా ప్రకటించింది. పాఠశాల చీఫ్ సూపరింటెండెంట్ల ఫోన్‌లను […]
ఉక్రెయిన్-రష్యా యుద్ధం త్వరలో ముగిసిపోయి తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొంటాయని భావిస్తున్న వారికి రాబోయే రోజుల్లో పెద్ద షాక్ తప్పకపోవచ్చు. వచ్చే ఆరు నెలల్లో ప్రపంచాన్ని చమురు ధరలు కమ్మేస్తాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ చమురు ధర 200 డాలర్లు దాటవచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది శరాఘాతం వంటిది. వాటిని ఆర్థిక సంక్షోభంలో పడేస్తుంది. చమురు ధరల భారాన్ని మోసే శక్తి చాలా దేశాలకు లేదు. అయితే రెండు దేశాలకు మాత్రం ఆ బాధ లేదు. […]
బీహార్‌లో ఆశ్చర్యకర సంఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణికులను ఓ లోకో పైలట్ మధ్య వదిలేసి వెళ్లిపోయాడు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చకుండా మద్యంమత్తులో మునిగితేలాడు. వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని సమస్తిపూర్ నుంచి లోకల్ రైలు సహర్సాకు బయలుదేరింది. గంట ప్రయాణం తర్వాత రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలుకు క్రాసింగ్ ఇచ్చేందుకు ఓ చోట ఆగింది. దీంతో లోకో పైలెట్ రైలు దిగి వెళ్లిపోయాడు. అయితే క్రాసింగ్ తర్వాత కూడా రైలు ఎంతకీ కదల్లేదు. దీంతో ప్రయాణికులు ఆందోళన చేయడంతో […]