ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విజయనగరం జిల్లాలలో ఈ సాయంత్రం పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆయా జిల్లాలలో రైతులు వెంటనే పొలాల నుంచి ఇంటికి చేరుకోవాలని సూచించింది. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు, గొర్రెల కాపరులు చెట్ల కింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని తెలిపింది.
శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం, సర్వకోట, హీరా మండలం, లక్ష్మీనర్సుపేట.. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జి. మాడుగుల, చింతపల్లె, రాజవొమంగి, జికె వీధి, కొయ్యురు, పాడేరు, డుంబ్రిగూడ, హుకుంపేట.. అనకాపల్లి జిల్లాలోని దేవరపల్లి, చీడికాడ, నాతవరం, గొలుగొండ, మాడుగుల.. విజయనగరం జిల్లాలోని వేపాడ, శృంగవరపుకోట, గంట్యాడ మండలాలు, పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉధృతంగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు పంపింది.
Andhra Pradesh: వీడిన ఉత్కంఠ.. వైసీపీ ఖాతాలోకే దుగ్గిరాల ఎంపీపీ పదవి