ఏపీలో ప్రభుత్వాస్పత్రుల్లో నెలకొన్న పరిస్థితులపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అసలు పాలన ఉందా అని ఆయన ప్రశ్నించారు. రోజురోజుకు మానవత్వం మసకబారిపోతోందని.. తమవారిని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్నవారికి చేతనైన సహాయం అందించాల్సింది పోయి అక్కడ కూడా డబ్బులు, రూల్స్ అంటూ వైద్య సిబ్బంది ప్రవర్తించడం దారుణమని సోము వీర్రాజు మండిపడ్డారు.
తిరుపతిలో కాలువలో పడి మృతిచెందిన 10 సంవత్సరాల బాలుడిని ఇంటికి తీసుకెళ్లడానికి తండ్రి నానా అవస్థలు పడ్డాడని.. 108 వాహనం లేకపోవడంతో కుమారుడి మృతదేహాన్ని బైకుపైనే తీసుకుని ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని.. 108 వాహనాన్ని అడిగితే… నిబంధనలు అంగీకరించవంటూ నిరాకరించడం దారుణమని సోము వీర్రాజు అన్నారు. మహాప్రస్థానం వాహనం అందుబాటులో లేకపోవడం ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోందని ఆరోపించారు. కొందరి తప్పులు వల్ల వైద్య విభాగంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు హితవు పలికారు.
Pathipati Pullarao: దొడ్డిదారిలో ఎంపీపీ సీటుని వైసీపీ కొట్టేసింది